Trump warnings

ప్రపంచానికి మరో హిట్లర్ – దేశదేశాన అమెరికా జెండా లక్ష్యం

సహనం వందే, న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకునేందుకు ఏ మాత్రం వెనకాడడం లేదు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీ నాజీ నియంత హిట్లర్ ఎలాగైతే వ్యవహరించాడో… సరిగ్గా అలాగే ట్రంప్ కూడా ప్రపంచంపై ఆధిపత్యం కోసం దూకుడుతో ముందుకు వెళ్తున్నాడు. వెనిజులా అధ్యక్షుడు మదురోను బందీగా తీసుకురావడమే ప్రపంచ దేశాలకు పరోక్షంగా ట్రంప్ వార్నింగ్ ఇచ్చినట్లైంది. వెనిజులా నుంచి ఇండియా వరకు ఆయన హెచ్చరికల పరంపర కొనసాగుతోంది. స్నేహం…

Read More
Gujarat Collector

1500 కోట్ల కలెక్టర్ స్కామ్ – ఐఏఎస్ ‘స్పీడ్ మనీ’ దందాపై ఈడీ దెబ్బ

సహనం వందే, గుజరాత్: ప్రజలకు రక్షణగా ఉండాల్సిన కంచే చేను మేసిన చందమిది. ఐఏఎస్ అనే అత్యున్నత హోదాను అడ్డుపెట్టుకుని ఆ అధికారి సాగించిన లీలలు వింటే సామాన్యుడికి ఒళ్లు గగుర్పొడుస్తుంది. కలెక్టరేట్ అంటే ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనుకుంటే పొరపాటే. అది పక్కాగా రేట్లు ఖరారు చేసి దోచుకునే వ్యాపార కేంద్రమని రాజేంద్రకుమార్ పటేల్ నిరూపించారు. ఒక్కో పనికి ఒక్కో రేటు కట్టి, అందినకాడికి దండుకున్న ఈ ‘అవినీతి చక్రవర్తి’ బాగోతం ఇప్పుడు బట్టబయలైంది….

Read More
#jobs by references

దోస్తులతోనే ఉద్యోగమస్తు – రిఫరల్ ఉంటే కొలువు 10 రెట్లు గ్యారెంటీ!

సహనం వందే, హైదరాబాద్: కొత్త ఏడాదిలో కొత్త ఉద్యోగంలో చేరాలని కలలు కంటున్నారా? అయితే మీరు కఠినమైన పోటీని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ప్రస్తుతం మార్కెట్లో వేలాది అప్లికేషన్లు వచ్చి పడుతున్నాయి. అర్హత ఉన్నా సరే సరైన వ్యూహం లేకపోతే వెనకబడిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ పోటీ ప్రపంచంలో నెగ్గాలంటే మీ దగ్గర ఒక పక్కా ప్లాన్ ఉండాలి. గురి చూసి కొట్టాలిఉద్యోగ వేటలో రెండు రకాల పద్ధతులు ఉంటాయి. ఒకటి వందల సంఖ్యలో అప్లికేషన్లు…

Read More
Sankrathi cinemas Box office

బాక్సాఫీస్ బీట్… పండుగ హీట్ – సంక్రాంతి హీరో… విజేత ఎవరో?

సహనం వందే, హైదరాబాద్: తెలుగు వారికి సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ. అరవై ఏళ్ల వృద్ధుడి నుంచి ఆరేళ్ల పిల్లాడి వరకు ప్రతి ఒక్కరూ థియేటర్ల వైపు చూసే సమయం ఇది. ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద యుద్ధం మామూలుగా ఉండేలా లేదు. అగ్ర కథానాయకులు తమ అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యారు. పండుగ హడావుడి ఇప్పుడే మొదలైంది. ప్రభాస్ వింటేజ్ మేజిక్…రెబల్ స్టార్ ప్రభాస్ ఈసారి తన పంథా మార్చారు. భారీ యాక్షన్ చిత్రాల తర్వాత ‘ది రాజా…

Read More
Doctors met CM

ముఖ్యమంత్రికి డాక్టర్ల మొర – వైద్యుల సమస్యలు పరిష్కరించాలని విన్నపం

సహనం వందే, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యం సంక్షోభంలో పడే ప్రమాదం కనిపిస్తోంది. రోగుల ప్రాణాలు కాపాడే డాక్టర్లే ఇప్పుడు తమ ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలు వైద్యుల్లో తీవ్ర అసంతృప్తిని నింపుతోంది. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం పొంచి ఉందని వైద్య సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యమంత్రికి మొరప్రభుత్వ వైద్యుల సమస్యలు తీవ్ర రూపం దాల్చుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం అప్రమత్తమైంది….

Read More
Vizianagaram MP

24 గంటలు… 3 రాష్ట్రాలు… 5,742 కి.మీ. – విజయనగరం ఎంపీ అప్పలనాయుడు ఘనత

సహనం వందే, విజయనగరం: విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు 24 గంటల్లో రికార్డ్ సృష్టించారు. మూడు రాష్ట్రాల్లో 5,742 కిలోమీటర్ల విమాన ప్రయాణం చేసి పలు అభివృద్ధి, సేవా, పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నమైపోయారు. శనివారం రాత్రి 9 గంటల సమయంలో ముంబై వెళ్లిన ఆయన అక్కడ ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ ఇండియన్ అథ్లెటిక్ జ్యోతి యర్రాజికి ఘన సత్కారం చేశారు. ఆ తర్వాత అదేరోజు అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఉదయమే లేచి 9 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ…

Read More
Venezuela President Madura

ట్రంప్ హంటింగ్… గ్లోబల్ షాకింగ్ – అధునాతన టెక్నాలజీతో అధ్యక్షుడి అంతం

సహనం వందే, హైదరాబాద్: ఒక దేశాధ్యక్షుడిని అపహరించడం అంటే అది కేవలం సినిమాల్లోనే సాధ్యం అనుకున్నారంతా. కానీ జనవరి 3వ తేదీ అర్ధరాత్రి వెనిజులా రాజధాని కరాకాస్‌లో జరిగిన ఘటన హాలీవుడ్ యాక్షన్ సినిమాను మించిపోయింది. ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే అధ్యక్ష భవనంలోకి అమెరికా బలగాలు ఎలా జొరబడ్డాయి? వేల సంఖ్యలో ఉన్న వెనిజులా సైన్యం ఏమైంది? మదురో ఎందుకు అడ్డుకోలేకపోయారు? ఈ ఆపరేషన్ వెనుక ఉన్న అసలు రహస్యాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అత్యంత…

Read More
Haridwar

హిందువులకే హరి’ద్వారం – హరిద్వార్ లో అన్యమతస్థులపై ఆంక్షలు

సహనం వందే, ఉత్తరాఖండ్: హరిద్వార్ అంటేనే ఆధ్యాత్మికతకు నిలయం. గంగా నది తీరాన వెలసిన ఈ పుణ్యక్షేత్రం పవిత్రతను కాపాడేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హరిద్వార్‌లోని కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లోకి అన్యమతస్థులు రాకుండా ఆంక్షలు విధించనున్నట్లు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ప్రకటించారు. ధార్మిక సంప్రదాయాలను గౌరవించడమే తమ ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రకటన ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. పవిత్రత కోసం సాహసంహరిద్వార్ పుణ్యక్షేత్రం హిందువులకు అత్యంత పవిత్రమైనది….

Read More
Psychiatrist shortage

పిచ్చోడంటారు… పట్టించుకోరు – 85 శాతం మందికి అందని మానసిక వైద్యం

సహనం వందే, హైదరాబాద్: దేశంలో మానసిక సమస్యలు ముదురుతున్నాయి. ప్రతి రోజూ లక్షలాది మంది ఒత్తిడి, ఆందోళనలతో నలిగిపోతున్నారు. అయితే వీరికి వైద్యం అందించే వ్యవస్థ మాత్రం కుంటుపడుతోంది. చికిత్స పొందాల్సిన వారు కొండంత ఉంటే… సాయం చేసే చేతులు గోరంతే ఉన్నాయి. ఈ అంతరం భయంకరమైన పరిణామాలకు దారితీస్తోంది. ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే సమాజం మానసిక కుంగుబాటులోకి జారిపోయే ప్రమాదం పొంచి ఉంది. చికిత్సలో భారీ అంతరం…భారతదేశంలో మానసిక వైద్యం అందని ద్రాక్షలా మారింది….

Read More
Venezuela President Maduro

వెనిజులా దేశాధ్యక్షుడి కోట బద్దలు – అర్ధరాత్రి ఇంట్లోకి జొరబడిన అమెరికా ఫోర్స్

సహనం వందే, వెనిజులా: అగ్రరాజ్యం అమెరికా మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. వెనిజులా దేశంపై మెరుపు దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను బందీగా పట్టుకుంది. అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఈ ఆపరేషన్ తో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ప్రజాస్వామ్యం పేరుతో అమెరికా చేస్తున్న ఈ సాహసం చమురు రాజకీయం వైపు మలుపు తిరుగుతోంది. అర్ధరాత్రి ఆపరేషన్ తో విలవిలశనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఆ దేశ రాజధాని…

Read More