వ్యవసాయ ఉగ్రవాదం

సహనం వందే, ఢిల్లీ: అమెరికాలో వ్యవసాయ ఉగ్రవాదం ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రమాదకరమైన ఫంగస్‌ను అక్రమంగా దిగుమతి చేసుకున్నారనే ఆరోపణలపై ఒక చైనా మహిళను అరెస్టు చేసినట్లు ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ తెలిపారు. ఈ ఘటన వ్యవసాయ రంగంలో దాగి ఉన్న ప్రమాదాలను, ఆహార భద్రతకు పొంచి ఉన్న ముప్పును చాటింది. వ్యవసాయ ఆధారిత దేశమైన భారత్‌కు కూడా ఇలాంటి దాడుల వల్ల ముప్పు ఉందా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. వ్యవసాయ ఉగ్రవాదం అంటే ఏంటి?యుంకింగ్ జియాన్…

0
Read More

కమల్ హాసన్ కు తమిళనాట మైలేజీ!

సహనం వందే, చెన్నై: సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీ అధినేత కమల్ హాసన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దక్షిణాది రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ‘థగ్ లైఫ్’ సినిమా ప్రమోషన్ల సందర్భంగా కన్నడ భాష పుట్టుక గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో పెను దుమారాన్ని రేపాయి. అయితే ఈ వివాదం తమిళనాడులో ఆయనకు రాజకీయంగా కలిసొచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కన్నడ భాషపై తీవ్ర వివాదం…‘థగ్ లైఫ్’ ప్రమోషన్ ఈవెంట్‌లో…

0
Read More

ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ చీఫ్ అసంతృప్తి

సహనం వందే, హైదరాబాద్: మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనితీరు ఏ మాత్రం బాగోలేదని, వెంటనే తమ పనితీరును సరిదిద్దుకోవాలని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నెలలోనే పీసీసీ కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని స్పష్టం చేసిన ఆయన, ఎమ్మెల్యేలు తమ పనితీరును బేరీజు వేసుకోవాల్సిన బాధ్యత తమపైనే ఉందని స్పష్టం చేశారు. శుక్రవారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ రివ్యూ మీటింగ్‌లో మాట్లాడుతూ, పలువురు ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేకపోవడంతో…

0
Read More

రేపు హైదరాబాదుకు ప్రభాకర్ రావు

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న మాజీ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) చీఫ్ ప్రభాకర్ రావు రేపు రాత్రి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. పాస్‌పోర్ట్ రద్దు కావడంతో ఆయన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎమర్జెన్సీ ట్రాన్సిట్ వారెంట్‌కు దరఖాస్తు చేసుకోగా, అది మంజూరైంది. ఈ నేపథ్యంలో శనివారం ఆయన ఇండియాకు బయలుదేరనున్నారు. 8వ తేదీ అర్థరాత్రి ప్రభాకర్ రావు హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం 9వ తేదీ ఉదయం…

0
Read More

తిరుమల తరహాలో యాదగిరిగుట్ట

సహనం వందే, యాదాద్రి: తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగానే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయం ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీని, విద్యా సంస్థలను యూనివర్సిటీ స్థాయికి అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో టీటీడీ సేవలు అందిస్తున్న తరహాలోనే తెలంగాణలో యాదగిరిగుట్ట రాణించాలనే ఉద్దేశంతో యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధి బోర్డు ద్వారా విశిష్ట సేవలు అందించేలా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. భారీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన…యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు…

0
Read More

చంద్రబాబు సరికొత్త సంప్రదాయం

సామాన్యులకు సలహాదారు పదవులు సహనం వందే, అమరావతి: తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలో ఎంతో మంది సీనియర్ నాయకులు పదవుల కోసం ఎదురుచూస్తుండగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరి అంచనాలకు అందని వ్యక్తులను సలహాదారులుగా నియమిస్తూ తనదైన మార్గాన్ని అనుసరిస్తున్నారు. ముఖ్యంగా అటవీ శాఖ సలహాదారుగా ‘ఫారెస్ట్ మ్యాన్’ గా పేరొందిన జర్నలిస్ట్ అంకారావును నియమించడం తాజా ఉదాహరణ. అంకారావు నియామకంపై సీఎం ప్రకటించే వరకు ఆయనకు కూడా తెలియదంటే అతిశయోక్తి కాదు. నల్లమల అటవీ…

0
Read More

రోడ్‌షోలు అవసరమా..?

సహనం వందే, ముంబై: బెంగళూరులో జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ ర్యాలీలో చోటు చేసుకున్న తొక్కిసలాట, 11 మంది మరణం పట్ల భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయాలను పురస్కరించుకొని రోడ్లపై జరిపే ర్యాలీల అవసరం లేదని, మనుషుల ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో గంభీర్ మాట్లాడుతూ, ఈ ఘటనపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు….

0
Read More

తిరుమలేశుని సేవలో ఆయిల్ ఫెడ్

సహనం వందే, హైదరాబాద్: ఆయిల్ ఫెడ్ ఇద్దరి కబంధహస్తాల్లో చిక్కుకుపోయింది. వారిద్దరే ఆ సంస్థను తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. ఆయిల్ ఫెడ్ లోని కీలక విభాగాల్లో పాగా వేశారు. దీంతో వారు ఆడింది ఆట… పాడింది పాటగా మారింది. వారు ఏం చెప్తే అది జరుగుతుంది. వారిద్దరి సేవలో ఆయిల్ ఫెడ్ సంస్థ పునీతమవుతుంది. వారే తిరుమలేశ్వర్ రెడ్డి… జొన్న సత్యనారాయణ. తిరుమలేశ్వర్ రెడ్డి ఫైనాన్స్, కన్జ్యూమర్ మార్కెటింగ్, బల్క్ మార్కెటింగ్, ఓపీఎస్ వంటి విభాగాలకు మేనేజర్…

0
Read More

డాక్టర్ కే చేతబడి

సహనం వందే, హైదరాబాద్: ఆయన ఒక డాక్టర్… హైదరాబాదు నగరంలో మంచి ప్రైవేట్ ప్రాక్టీస్ ఉంది. కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారు. ఆయన ఆస్తులపై ఉప్పల్ ప్రాంతానికి చెందిన శివస్వామి అనే చేతబడి చేసే వ్యక్తి కన్నేశాడు. ఇంకేం రంగంలోకి దిగాడు. ‘నువ్వు నాకు గత జన్మలో సొంత అన్నవి. మనిద్దరం ఒక దేశానికి రాజులం. నాకున్న అతీంద్రియ శక్తులతో ఈ విషయాన్ని గుర్తించాను’ అంటూ మాయ మాటలు చెప్పాడు. ఇంకా ఏమన్నాడంటే, ‘నువ్వు మామూలు డాక్టర్…

0
Read More

యూరియా గండం

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడింది. సకాలంలో తెప్పించడంలో వ్యవసాయశాఖ విఫలమైంది. దాహం వేసినప్పుడు బావిని తవ్వినట్లుగా… ఇప్పుడు యూరియా కావాలంటూ హడావుడి చేస్తున్నారు. ముందుగానే కేంద్రం వద్దకు వెళ్లి ప్రయత్నించాల్సింది పోయి… ఇప్పుడు తమ తప్పును ఇతరులపై నెట్టే విధంగా కేంద్రం వద్ద పంచాయతీకి సిద్ధమయ్యారు. సీజన్ కి ముందు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంలో ఎందుకు వైఫల్యం చెందినట్లు? సీజన్ జోరు మీద ఉన్న సమయంలో ఇప్పుడు హడావుడి చేస్తే…

0
Read More