దందా చేస్తే బొంద పెడతా – విజయనగరం ఎంపీ కలిశెట్టి హెచ్చరిక
సహనం వందే, విజయనగరం: విజయనగరం రాజకీయాల్లో కలిశెట్టి అప్పలనాయుడు ఒక ప్రత్యేక ముద్ర వేశారు. సాధారణ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ లోక్ సభలో అడుగుపెట్టారు. నిరాడంబరత, నిబద్ధతే పెట్టుబడిగా ఆయన సాగిస్తున్న రాజకీయ ప్రయాణం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పదవిని బాధ్యతగా భావిస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్న అప్పలనాయుడుతో ‘సహనం వందే’ డిజిటల్ పేపర్ విజయనగరం ప్రతినిధి ప్రత్యేక ఇంటర్వ్యూ. సహనం వందే: ఎంపీగా ఎన్నికై ఏడాదిన్నర అయింది కదా… మీ అనుభూతి ఏంటి?అప్పలనాయుడు:…