
రక్తంతో తడుస్తున్న అభిమానం – విజయ్ ర్యాలీ ఘటనలో 38 మంది మృతి
సహనం వందే, తమిళనాడు:అభిమానుల పట్ల సినిమా తారల తీరు అత్యంత దారుణంగా ఉంటుంది. ఫ్యాన్స్ అమాయకత్వాన్ని తమ సినిమా రాజకీయ, అవసరాల కోసం ఉపయోగించుకుంటూ వందల కోట్లు గడిస్తున్నారు. సినిమాల ద్వారా వచ్చిన అభిమానాన్ని రాజకీయాల వైపు మళ్ళించుకుని పదవులు పొందుతున్నారు. తమ స్వార్థం కోసం అభిమానుల రక్తం కళ్ళచూస్తున్నారు. పదవీకాంక్ష కోసం ఇష్టారాజ్యంగా ర్యాలీలు నిర్వహిస్తూ జనాన్ని తొక్కి చంపేస్తున్న ఈ ధోరణిని అభిమాన ఉగ్రవాదం అనకుండా ఎలా ఉండగలం? కరూరు జిల్లాలో నటుడు విజయ్…