500 కోట్ల సైబర్ మోసగాడు – బెజవాడ యువకుడు శ్రవణ్ గ్యాంగ్ నిర్వాకం

సహనం వందే, విజయవాడ:విజయవాడకు చెందిన యువకుడు శ్రవణ్ కుమార్ రెండు నెలల్లోనే 500 కోట్ల రూపాయల సైబర్ క్రైంకు పాల్పడడం సంచలనం అయ్యింది. అతన్ని హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. శ్రవణ్ కుమార్ 500 మ్యూల్ అకౌంట్లు సృష్టించి వాటి ద్వారా 500 కోట్ల పైచిలుకు నగదు బదిలీలు చేసిన విషయం తెలిసింది. సైబర్ లింకుల ద్వారా వచ్చిన మోసపూరిత డబ్బును ఈ అకౌంట్లలోకి మార్చి, తర్వాత ఫేక్ కంపెనీలకు పంపేవాడు. ఈ వ్యవస్థలో ఆరు కంపెనీలకు ప్రత్యేక…

Read More

వినాయక చవితి విశిష్టత – సంతోషం పంచే సనాతన సంప్రదాయం

భారతీయ సంస్కృతిలో పండుగలకు విశిష్ట స్థానం ఉంది. ప్రతి పండుగ ఒక ప్రత్యేకమైన సందేశాన్ని, ఒక తాత్విక బోధనను అందిస్తుంది. వాటిలో అత్యంత ప్రాముఖ్యమైనది వినాయక చవితి. భాద్రపద శుద్ధ చవితి నాడు గణనాథుడిని ఆరాధించడం అనాది కాలం నుండి వస్తున్న సనాతన సంప్రదాయం. విఘ్ననాయకుడు, విద్యాదాయకుడు, ఐశ్వర్యప్రదాత అయిన గణపతిని పూజించడం ద్వారా జీవితంలో ఆనందం, శాంతి, సౌఖ్యం కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. గణపతి రూపంలోనే ఎన్నో బోధనలు!వినాయకుడు గజాననుడు, విఘ్నేశ్వరుడు, గణాధిపతి, సిద్ధివినాయకుడు…

Read More

యూరియా కోసం రైతుల రాళ్ల దాడి

సహనం వందే, వనపర్తి:యూరియా కోసం అన్నదాతలు అగచాట్లు పడుతున్నారు. కీలకమైన సమయంలో యూరియా అందుబాటులో లేకపోవడంతో అధికారులను నిలదీస్తున్నారు. అందులో భాగంగా శనివారం వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలో అన్నదాతలు ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం వద్ద అధికారులను నిలదీశారు. వారు స్పందించకపోవడంతో రాళ్లతో దాడి చేశారు. దీంతో అక్కడ తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల రైతులు యూరియా కోసం ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.‌ మరోవైపు కొందరు మార్క్…

Read More

కమ్యూనిస్టు నేత సురవరం కన్నుమూత – రేవంత్ రెడ్డి సంతాపం

సహనం వందే, హైదరాబాద్:సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం కమ్యూనిస్టు పార్టీకి, కార్మిక వర్గానికి తీరని లోటు. విద్యార్థి దశ నుంచే పోరాటం…1942 మార్చి 25న మహబూబ్‌నగర్ జిల్లాలో జన్మించిన సుధాకర్ రెడ్డి విద్యార్థి దశ నుంచే ప్రజా సమస్యలపై పోరాడారు. కేవలం 15 ఏళ్ల వయసులోనే పాఠశాలలో…

Read More

‘ముప్పై’తో పదవికి ముప్పు – నెల రోజులు జైలులో ఉంటే పదవి ఊస్ట్

సహనం వందే, న్యూఢిల్లీ:కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన సీఎం, పీఎం తొలగింపు బిల్లు రాజకీయ రగడ రేపుతోంది. తీవ్రమైన నేరారోపణలతో అరెస్టై నెల రోజులు జైలులో ఉంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా మంత్రులను పదవి నుంచి తొలగించే ఈ బిల్లుపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ బిల్లు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని దెబ్బతీసే కుట్రగా విపక్షాలు మండిపడుతున్నాయి. బీజేపీ అధికార దుర్వినియోగం ద్వారా విపక్ష ప్రభుత్వాలను కూల్చేందుకు చేస్తున్న పన్నాగంగా ఈ…

Read More

కాళ్లు పట్టు… పదవి కొట్టు – రిటైర్డ్ ఐఏఎస్ శరత్ కు చైర్మన్ పదవి

సహనం వందే, హైదరాబాద్:ఉన్నత పదవుల్లో ఉన్న కొందరు ఐఏఎస్ అధికారులు తమ హుందాతనాన్ని మరిచి రాజకీయ నాయకుల ముందు తలవంచడంపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పదవీ విరమణకు మూడు నెలల ముందు ముఖ్యమంత్రి కాళ్లు మొక్కడం సంచలనం రేపిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ శరత్‌కు కీలక పదవి దక్కడంతో ఈ చర్చ మరోసారి రాజుకుంది. గతంలోనూ ఇదే తరహా ఘటనలు జరిగాయి. పాలకుల వద్ద ఆశ్రయం పొందిన అధికారులు ఉన్నతాశయాలను పక్కన పెట్టి, పదవుల కోసం…

Read More

పంట కోర్సుల్లో వాటా మంట – వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో కోటా కిరికిరి

సహనం వందే, హైదరాబాద్:వ్యవసాయ విద్యలో ప్రవేశాల కోసం తెలంగాణలో కౌన్సెలింగ్ ప్రారంభమైనప్పటికీ రైతులు, వ్యవసాయ కూలీల కోటా అమలుపై విమర్శలు వచ్చాయి. వ్యవసాయ, వెటర్నరీ, ఉద్యాన విశ్వవిద్యాలయాల్లో ఈఏపీసెట్ ర్యాంకుల ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతున్నా, కోటా నిబంధనలు గ్రామీణ వర్గాలకు నిజంగా న్యాయం చేస్తున్నాయా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. రైతు, కూలీ కుటుంబాలకు అవకాశాలు కల్పించాలనే లక్ష్యం ఉన్నప్పటికీ, కొన్ని విధానపరమైన లోపాలు ఆ లక్ష్యాన్ని నీరుగార్చేలా ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎకరం కంటే తక్కువ…

Read More

యూరియా లోటు… షరతుల పోటు – పట్టాదారు పాస్ పుస్తకం ద్వారానే అమ్మకం

సహనం వందే, హైదరాబాద్:కీలకమైన వర్షాల సమయంలో యూరియాను రైతులకు అందజేయడంలో తెలంగాణ మార్క్ ఫెడ్ యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న కొందరు దళారులతో… మరికొందరు అధికారులు కుమ్మక్కైనట్లు జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 2.98 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొరత ఉన్నట్లు స్వయానా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు అక్రమార్కులు ఇష్టారాజ్యంగా యూరియాను పక్కదారి పట్టిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి….

Read More

‘చిరు’ చొరవ – టాలీవుడ్ కార్మికుల సమస్యపై చర్చ

సహనం వందే, హైదరాబాద్:టాలీవుడ్ కార్మికుల సమస్యను పరిష్కరించేందుకు మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు. 15 రోజులుగా జరుగుతున్న సమ్మెను నిలుపుదల చేసేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా కొందరు నిర్మాతలతో ఆయన చర్చలు జరిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇటు నిర్మాతల మధ్య, అటు కార్మికుల మధ్య ఉన్న గందరగోళాన్ని తొలగించి, సమస్యను పరిష్కరించేందుకు చిరంజీవి చొరవ తీసుకున్నారు. 15 రోజుల పోరాటం…వేతనాలు 30 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ సినీ కార్మికులు గత 15…

Read More

ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఎంపీ కలిశెట్టి అభినందన

సహనం వందే, న్యూఢిల్లీ:ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన సీపీ రాధాకృష్ణన్‌ను విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఏపీ మంత్రి నారా లోకేశ్‌తో సహా మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో వారు రాధాకృష్ణన్‌కు తమ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశం కేవలం మర్యాదపూర్వకం మాత్రమేనని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. రాధాకృష్ణన్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు తమ మద్దతును తెలియజేసేందుకు ఈ భేటీ జరిగినట్లు సమాచారం. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తమిళనాడుకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు…

Read More