తారలు… కొత్త దారులు – తెరపై తళుకులు… బయట వెలుగులు
సహనం వందే, హైదరాబాద్: ఒకప్పుడు నటీమణుల పాత్ర కేవలం వెండితెరకే పరిమితం. పెళ్లి కాగానే ఇంటికే పరిమితం కావాల్సి వచ్చేది. అలాగే అవకాశాలు తగ్గగానే కొందరు కనుమరుగైపోయేవారు. కానీ ఇప్పుడు ఆ రోజులు పోయాయి! ఈ తరం తెలుగు నటీమణులు నటనతోపాటు అనేక రంగాల్లో తమదైన ముద్ర వేస్తూ ఆల్ రౌండర్లుగా పేరు తెచ్చుకుంటున్నారు. సినిమా అవకాశాలు తగ్గినా తమ జీవిత లక్ష్యం అక్కడితో ఆగదని నిరూపిస్తున్నారు. గ్లామర్ ప్రపంచంలో మెరిసిన ఈ తారలు నిజ జీవితంలో…