అన్నం పర’భస్మ’స్వరూపం – మన భోజనం రోగాల మయం
సహనం వందే, హైదరాబాద్ మీరు రోజూ తినే భోజనం మీకు శక్తిని ఇస్తోందా లేక రోగాలను పంచుతోందా? మనం ఎంతో ఇష్టంగా తినే తెల్లటి అన్నం, మెత్తని చపాతీలు కడుపు లోపల సైలెంట్ బాంబుల్లా మారుతున్నాయి. భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తాజా అధ్యయనం చూస్తుంటే గుండె జారిపోవాల్సిందే. మన ఆహారపు అలవాట్లే మన పాలిట శాపంగా మారుతున్నాయని… డయాబెటిస్ ముప్పు ముంగిట్లోనే ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కార్బోహైడ్రేట్ల రాజ్యం… రోగాల భయంభారతీయుల భోజనంలో కార్బోహైడ్రేట్ల…