కవిత అక్క… పార్టీ పక్కా – రాజకీయాలపై రగిలిపోతున్న జాగృతి నేత
సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు కొత్త మలుపు తిరుగుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన సంచలన ప్రకటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజా వ్యాఖ్యలు ఆమె సొంతంగా కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతోందన్న ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. 2029 సార్వత్రిక ఎన్నికలలో తాము పోటీ చేస్తామని కవిత స్పష్టం చేయడంతో భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు అనివార్యమని…