
భాజపా విజయానికి సోషల్ మీడియా కీలకం
సహనం వందే, హైదరాబాద్:రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం ఖాయమని బీజేపీ ఓబీసీ మోర్చా నేషనల్ సోషల్ మీడియా మెంబర్ పెరిక సురేష్ అన్నారు. పార్టీ కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో సామాజిక మాధ్యమాలు ముఖ్య పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో పార్టీ ఐటీ, సోషల్ మీడియా విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీ బలోపేతానికి సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకోవాలని కార్యకర్తలకు సూచించారు….