బేడీలు వేసినా మారని మెడి’కేడీలు’ – ఎన్ఎంసీ అధికారులు ‘మహా’ ముదుర్లు

సహనం వందే, హైదరాబాద్:అదొక డబ్బా మెడికల్ కాలేజ్… నగరానికి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అందులో వసతులు లేవని లోకమంతా కోడై కూసింది. మూడేళ్ల క్రితం ఆ ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఒక బ్యాచ్ రద్దు కూడా చేశారు. అయినా దాని తీరు మారలేదు… జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అధికారుల అక్రమాలు ఆగలేదు. ఎన్ని ఆరోపణలు వచ్చినా… నకిలీ రోగులు ఉన్నారని తేలినప్పటికీ ఆ కాలేజీకి ఎన్ఎంసీ తాజాగా మరో 50 ఎంబీబీఎస్ సీట్లను…

Read More

రద్దయినా మారని బుద్ధి – ‘మహావీర్’ యాజమాన్యం ధిక్కరణ ధోరణి

సహనం వందే, హైదరాబాద్:వికారాబాద్ లోని ‘మహావీర్’ మెడికల్ కాలేజీ బాగోతం అంతా ఇంతా కాదు. మూడేళ్ల క్రితం రాష్ట్రంలో మూడు మెడికల్ కాలేజీలలో మౌలిక సదుపాయాలు లేవని ఆ సంవత్సరం బ్యాచ్ లను జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ మూడు కాలేజీల్లో మహావీర్ మెడికల్ కాలేజీ కూడా ఉంది. అయినప్పటికీ ఆ కాలేజీ యాజమాన్యం మాత్రం తన వైఖరి మార్చుకోవడం లేదని బోధనాసుపత్రిని చూస్తే అర్థమవుతుంది. ఏం చేసుకుంటారో చేసుకోండన్న…

Read More

దిక్కులేని దీనులు… ‘మహా’ విద్యార్థులు – మహావీర్ మెడికల్ కాలేజీలో పరిస్థితి ఘోరం

వికారాబాద్ నుంచి ‘సహనం వందే’ ప్రతినిధి:వికారాబాద్ మహావీర్ మెడికల్ కాలేజీ అనుబంధ ఆసుపత్రిని పరిశీలిస్తే దీనికి ఇన్నాళ్లు ఎలా అనుమతులు వచ్చాయా అన్న అనుమానాలు తలెత్తుతాయి. జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) కళ్ళు మూసుకుని ముడుపులు పుచ్చుకొని బాజాప్తా అనుమతులు ఇచ్చినట్లు అర్థం అవుతుంది. ఈ స్టోరీని చదువుతున్న వాళ్ళు ఎవరైనా ఒక్కసారి అక్కడికి వెళ్లి చూడండి… లేదా ఈ ఆర్టికల్ తోపాటు పెడుతున్న వీడియోలను చూడండి. దానికి అనుమతులు ఇవ్వడం న్యాయమా లేదా మీరే నిర్ణయించండి….

Read More

ఎన్ఎంసీ స్కాన్… మెడికల్ స్కామ్ – తనిఖీల్లో ప్రైవేట్ మెడికల్ కాలేజీల బండారం

సహనం వందే, హైదరాబాద్:ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో వైద్య విద్య అత్యంత నాసిరకంగా మారుతోంది. డబ్బుల కోసం కాలేజీలు పెట్టిన కొందరు బడా బాబులు నాసిరకం వైద్య విద్య అందిస్తున్నారు. వ్యాపార ధోరణి తప్ప మరో ఆలోచన లేకపోవడంతో ఆయా కాలేజీలు కునారిల్లిపోతున్నాయి. కనీస సౌకర్యాలు కల్పించక… బోధన సిబ్బంది పూర్తిస్థాయిలో లేక వైద్య విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నాయి. పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. కొన్ని కాలేజీల్లో ఉండాల్సిన సంఖ్యలో…

Read More

మహావీర్ గుప్పిట్లో ఎన్ఎంసీ -లంచం తీసుకున్నందుకు కృతజ్ఞతాభావం

సహనం వందే, హైదరాబాద్:జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) దారి తప్పిపోయింది. లంచాల రుచికి మరిగిన ఎన్ఎంసీ బృందాలు ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ తమ తీరు మార్చుకోవడం లేదు. దేశంలో అనేక చోట్ల సీబీఐ కేసులు పెడుతూ కొందరిని అరెస్టు చేస్తున్నా… ఎన్ఎంసీ అధికారులు మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ముడుపులు తీసుకుని ముందే కమిట్మెంట్లు ఇవ్వడంతో మెడికల్ కాలేజీ యాజమాన్యాలతో చెట్టాపట్టాల్ వేసుకొని దర్జాగా తిరుగుతూనే ఉన్నాయి. అందుకు నిలువెత్తు ఉదాహరణ వికారాబాద్ లో ఉన్న మహావీర్…

Read More

వైద్య విద్యకు ‘ఎన్ఎంసీ’ చెద – అవినీతి అడ్డా జాతీయ మెడికల్ ‘కమీ’షన్

సహనం వందే, హైదరాబాద్:భారత వైద్య విద్య రంగాన్ని పట్టి పీడిస్తున్న అవినీతి, అక్రమాలపై ప్రపంచ ప్రఖ్యాత వైద్య పత్రిక ‘లాన్సెట్’ బాంబు పేల్చింది! జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) వ్యవస్థీకృత అవినీతికి, అసమర్థతకు నిలయంగా మారిందని ఘాటుగా విమర్శించింది. జులై 19న ప్రచురితమైన ఈ సంచలనాత్మక నివేదిక… భారత వైద్య విద్య భవిష్యత్తును, ప్రజల ఆరోగ్య సంరక్షణ నాణ్యతను అంధకారంలోకి నెట్టేస్తోందని హెచ్చరించింది. ఎన్‌ఎంసీ అక్రమాల పుట్ట అని దునుమాడింది. లంచాల బాగోతం… వ్యవస్థకే చీడజూన్ 30న…

Read More

తెలంగాణలో ప్రైవేటు మెడికల్ కాలేజీల అనుమతికి 500 కోట్లు?

సహనం వందే, హైదరాబాద్:ప్రైవేటు మెడికల్ కాలేజీల మాఫియా వైద్య విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తుంది. డబ్బా కాలేజీలు పెట్టి విద్యార్థుల నుంచి అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తూ వందల కోట్లకు పడగలెత్తుతున్నాయి. వాటిని పర్యవేక్షించాల్సిన జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) లంచాలకు మరిగి ఇష్టారాజ్యంగా అనుమతులు ఇవ్వటం సంచలనంగా మారింది. వైద్య విద్యా వ్యవస్థను కుదిపేసిన భారీ అవినీతి కుంభకోణం బయటపడింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తులో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ), వైద్య…

Read More