రైతన్న నోట్లో మార్క్ ఫెడ్ మట్టి – పరిశ్రమలకు తరలుతున్న యూరియా

సహనం వందే, హైదరాబాద్:యూరియా కొరతతో అన్నదాతలు ఆగమాగం అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో రాకపోవడంతో పంటలకు ఎరువు వేయలేని పరిస్థితి నెలకొంది. కొరతను ఆసరాగా చేసుకుని కొందరు మార్క్ ఫెడ్ అధికారులు దళారులతో కుమ్మక్కై యూరియాను పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలకు కేటాయించిన యూరియాను కొందరు అక్రమార్కులు పరిశ్రమలకు మళ్లించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. యూరియాను పైవుడ్, రెసిన్, పెయింట్స్, వార్నిష్ పరిశ్రమలు, జంతు, పౌల్ట్రీ, ఫీడ్ యూనిట్లలో, సారాయి తయారీలో వినియోగిస్తారు. కేంద్ర…

Read More

మార్క్’ఫ్రాడ్’… యూరియా ‘బ్లాక్’ – దళారులకు అధికారుల అండ

సహనం వందే, హైదరాబాద్:రాష్ట్రంలో యూరియా కొరత రైతులను వెన్నాడుతుంది. కొరతను నివారించని అధికారులు… కొద్దిపాటి స్టాక్ ను దళారుల చేతుల్లో పెట్టి నల్ల బజారుకు తరలిస్తున్నారు. ఈ విషయంలో కొందరు మార్క్ ఫెడ్ అధికారులు దళారులతో కుమ్మక్కు అవుతున్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు. వివిధ జిల్లాల్లో ప్రాథమిక సహకార సంఘాలు, మార్క్ ఫెడ్ అధికారులు, దళారులు ఏకమై బ్లాక్ మార్కెటుకు తరలిస్తున్నారు. ఈ విషయంలో కొందరు మార్క్ ఫెడ్ అధికారులు దళారులతో కుమ్మక్కు అవుతున్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు. వివిధ…

Read More

మార్క్’ఫ్రాడ్’ అధికారి గుప్పిట్లో 50 వేల టన్నుల యూరియా

సహనం వందే, హైదరాబాద్:కేంద్ర ప్రభుత్వం రాయితీపై అందించే యూరియా రైతన్నల పాలిట ఓ కన్నీటి గాథగా మారింది. మార్క్‌ఫెడ్ సంస్థలో కీలకస్థానంలో ఉన్న ఓ అధికారి తన గుప్పిట్లో ఏకంగా 50 వేల టన్నుల యూరియాను పెట్టుకుని, దళారులతో కుమ్మక్కై అధిక ధరలకు అమ్ముకుంటూ లక్షల రూపాయలు కొల్లగొడుతున్న వైనం సంచలనం సృష్టిస్తోంది. మార్క్‌ఫెడ్ కార్యాలయం నుంచే ఈ అక్రమ దందాకు చక్రం తిప్పుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దోపిడీలో జిల్లా మేనేజర్లు పాలుపంచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి…

Read More

మార్క్ ఫెడ్ లో జాగీర్దార్లు

సహనం వందే, హైదరాబాద్: మార్క్ ఫెడ్ లో కొందరు ఏళ్లుగా ఒకేచోట పాతుకుపోయారు. దీంతో ఆయా విభాగాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆ విభాగాలను తమ సొంత జాగీరులా భావిస్తున్నట్లు తోటి ఉద్యోగులే మండిపడుతున్నారు. వారి పోస్టుల్లోకి ఇతరులను తీసుకురావాలన్న ప్రయత్నాలకు అడ్డుపడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. పై స్థాయి అధికారులను మాయ చేసి తమ విభాగాలను సామంత రాజ్యాలుగా మార్చుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో వారిని కదపడానికి ఎవరూ సాహసించడం లేదు. ఐదారేళ్లుగా తిష్ట వేసిన…

Read More

మార్క్ ఫెడ్ లో ఆ ఒక్కడు!

సహనం వందే, హైదరాబాద్: మార్క్ ఫెడ్ సంస్థలో రైతులకు చేస్తున్న సాయం కంటే కొందరు అధికారులు మేయడమే ఎక్కువగా ఉందన్న విమర్శలు ఉన్నాయి. సంస్థ నష్టాల ఊబిలో కూరుకుపోయినా పర్వాలేదు… కానీ తమ జేబులు నింపుకునేలా కొందరు అధికారులు పావులు కదుపుతుంటారు. మార్క్ ఫెడ్ సంస్థను తమ సొంత జాగీరులా భావిస్తూ కోట్లు గడిస్తున్నారు. ఈ సంస్థలో సాధారణ కింది స్థాయి అధికారి కూడా ఐఏఎస్, ఐపీఎస్ వంటి అధికారులకు ఏమాత్రం తగ్గకుండా మెయింటైన్ చేస్తుంటారు. ఒక…

Read More

జొన్న ‘అవినీతి’ కేంద్రాలు

సహనం వందే, హైదరాబాద్: రాష్ట్రంలో అనేక జొన్న కొనుగోలు కేంద్రాలు అక్రమాలకు అడ్డాగా మారాయి. పక్క రాష్ట్రాల నుంచి అడ్డదారిలో జొన్నలు తెచ్చి, మద్దతు ధర పేరుతో దళారులు లక్షల రూపాయలు కొల్లగొడుతుంటే అడ్డుకోవాల్సిన అధికారులు కళ్లు మూసుకుంటున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా తాంసిలో ముక్కిపోయిన అక్రమ జొన్నలు పట్టుబడటం సంచలనం రేపింది. ఈ ఘటన వెనుక అధికారుల హస్తం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అసలు ఈ జొన్నలు ఎవరివో, ఎక్కడి నుంచి తెచ్చారో తేల్చకుండా అధికారులు దాస్తున్నారు….

Read More

దళారులకు మార్క్‌ఫెడ్‌ అండదండ

సహనం వందే, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మార్క్‌ఫెడ్ ఎండి శ్రీనివాస్ రెడ్డి… వీళ్లంతా జొన్న రైతుల కోసం కృషి చేస్తుంటే కిందిస్థాయిలో కొందరు అధికారులు మాత్రం దళారులకు అమ్ముడుపోతున్నారు. జొన్న రైతులకు మద్దతు ధర ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. జొన్న కొనుగోలులో ఎలాంటి అక్రమాలు జరగకూడదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పదేపదే చెప్తున్నప్పటికీ అధికారులు మాత్రం తమ దందా కొనసాగిస్తున్నారు. హైదరాబాదు…

Read More