
రక్తచరిత్రకు నేతల తహతహ – గతంలో జగన్ ‘రప్పా రప్పా’ ఫ్లెక్సీ వివాదం
సహనం వందే, హైదరాబాద్/అమరావతి:జనాన్ని రెచ్చగొట్టడానికి మన నేతలు కత్తులు వాడుతున్నారు. పరోక్షంగా నెత్తుటి రాజకీయాన్ని ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తుంది. సినిమాల్లోనూ నిషేధించాల్సిన కత్తుల నెత్తురు చిత్రాలను… బయట కూడా ప్రదర్శించడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలో వైసీపీ కార్యకర్తలు పుష్ప సినిమాలోని రప్పా రప్పా డైలాగును ప్రదర్శించి రెచ్చగొట్టే ప్రయత్నం చేయడాన్ని అక్కడి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వ్యతిరేకించారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ మొన్న హైదరాబాదులో జరిగిన…