ఆకాశంలో ఆట… ఇండిగో వేట! – గుత్తాధిపత్యానికి 6 విమాన సంస్థలు బలి!
సహనం వందే, హైదరాబాద్: భారతీయ విమానయాన రంగంపై నీలినీడలు కమ్ముకున్నాయి. విమాన ప్రయాణాలను సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చిన 6 ప్రముఖ సంస్థలు వరుసగా కుప్పకూలడం వెనుక కేవలం అప్పులు, ఇంధన ధరల పెరుగుదల వంటి ఆర్థిక అంశాలే కారణమా? లేక దేశీయ గగనతలాన్ని తమ గుప్పిట్లోకి తీసుకునేందుకు ప్రధాన సంస్థలు పన్నిన కుట్రనా? అన్న అనుమానాలున్నాయి. ఈ సంస్థల పతనం కేవలం వ్యాపార వైఫల్యం కాదు. మార్కెట్‌లో పోటీ లేకుండా చేసేందుకు పెద్ద సంస్థలు పన్నిన కుట్ర…