గూడు చెదిరె… గుండె పగిలె – దేశంలో ఏడేళ్లలో రెట్టింపైన ఇళ్ల కూల్చివేతలు
సహనం వందే, న్యూఢిల్లీ: అభివృద్ధి ముసుగులో పేదవాడి సొంతింటి కల కల్లలవుతోంది. నగరాల సుందరీకరణ పేరిట బుల్డోజర్లు పేదల గుడిసెలను నేలమట్టం చేస్తున్నాయి. ఏళ్ల తరబడి నివసిస్తున్న చోట నుంచి కనికరం లేకుండా గెంటేస్తున్నారు. అధికార గర్వంతో పాలకులు చేస్తున్న ఈ దాడులు మానవ హక్కులను కాలరాస్తున్నాయి. గూడు కోల్పోయిన గుండెల్లో ఆవేదన కట్టలు తెంచుకుంటోంది. ఇది కేవలం ఇళ్ల కూల్చివేత కాదు.. సామాన్యుడి ఆత్మగౌరవంపై జరుగుతున్న దాడి. రెట్టింపైన విధ్వంసం…గడిచిన 7 ఏళ్ల కాలంలో దేశంలో…