2 రూపాయల ఫీజు… 18 లక్షల రోగులు – 50 ఏళ్లుగా అదే ఫీజుతో వైద్య వృత్తికి గౌరవం

సహనం వందే, కన్నూర్:500 రూపాయల ఫీజు… 5 వేల రూపాయల వైద్య పరీక్షలు… వేల రూపాయల మందులు… ఇలా రోగులను దోచుకుంటున్న కొందరు డాక్టర్లను… కార్పొరేట్ ఆసుపత్రులను నేడు మనం చూస్తున్నాం. కానీ కేరళ రాష్ట్రం కన్నూర్ కు చెందిన డాక్టర్ ఎ.కె. రైరు గోపాల్ కేవలం రెండు రూపాయల ఫీజుతోనే రోగులకు వైద్యం చేయడం ఎంతో విశేషం. 50 ఏళ్లుగా ఆయన అదే ఫీజు వసూలు చేస్తున్నట్టు ఆశ్చర్యకరం. రెండు రూపాయల డాక్టర్ గా పేరొందిన…

Read More

రెమ్యూనరేషన్లలో సంస్కరణలు – కేరళలో సినీ అట్టడుగు వర్గాలకు అగ్రపీఠం

సహనం వందే, తిరువనంతపురం:కేరళలో ప్రభుత్వం చలనచిత్ర రంగాన్ని సమూలంగా మార్చడానికి ఒక కీలకమైన ముసాయిదా చలనచిత్ర విధానాన్ని విడుదల చేసింది. ఈ విధానం పరిశ్రమను అధికారికంగా గుర్తించడం, అంతర్జాతీయంగా ప్రాధాన్యత పెంచడం, అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడం లక్ష్యంగా రూపొందించారు. తిరువనంతపురంలో జరుగుతున్న రెండు రోజుల మలయాళం ఫిల్మ్ కాన్‌క్లేవ్ సందర్భంగా ఈ విధానాన్ని ఆవిష్కరించారు. లింగ సమానత్వానికి ప్రాధాన్యతఈ విధానం సినిమా నిర్మాణాన్ని, ప్రదర్శనను ఒక పరిశ్రమగా గుర్తించడం, మెరుగైన ఆర్థిక వనరులను సమకూర్చడం,…

Read More

టీఆర్ఎస్ (డి) గౌరవ అధ్యక్షురాలిగా ప్రసన్న

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ రక్షణ సమితి (డెమోక్రటిక్) (టీఆర్ఎస్ (డి)) పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని, సమస్యలపై పోరాడే మహిళగా గుర్తింపు పొందిన ప్రసన్నను తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా నియమిస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. పరిచయం అవసరం లేని పేరుగా తెలంగాణలో సుపరిచితులైన ప్రసన్న, ఇకపై పార్టీకి దిశానిర్దేశం చేయనున్నారు. ఆమె పోరాట స్ఫూర్తి పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తుందని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.

Read More

‘సృష్టి’ అధికారులపై ఉక్కుపాదం – వైద్య ఆరోగ్య మంత్రి దామోదర్ హెచ్చరిక

సహనం వందే, హైదరాబాద్: ‘సృష్టి’ ఫెర్టిలిటీ వంటి సెంటర్లలో అక్రమాలకు వీలు కల్పించిన ప్రభుత్వ అధికారులు, మెడికల్ కౌన్సిల్ వంటి సంస్థల పాత్రపై సమగ్ర విచారణ జరపాలని… అందులో బాధ్యులైన వారిపై ఉక్కుపాదం మోపాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఉన్నతాధికారులను ఆదేశించారు. మాతృత్వం ఆశతో వచ్చేవారిని వ్యాపార వస్తువులుగా మార్చిన కొన్ని ఐవీఎఫ్ కేంద్రాలు, సరోగసి సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సృష్టి తరహా ఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని…

Read More

బ‌స్తీతో ‘హైడ్రా’ దోస్తీ – హైడ్రా క‌మిష‌న‌ర్‌ ఏవీ రంగ‌నాథ్ శ్రీకారం

సహనం వందే, హైద‌రాబాద్‌: కూల‌గొట్టుడు కాదు.. ప‌ర్యావ‌ర‌ణ హిత‌మైన, అంద‌రికీ నివాస యోగ్య‌మైన‌ న‌గ‌ర నిర్మాణ‌మే తమ ల‌క్ష్య‌మ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ స్ప‌ష్టం చేశారు. హైడ్రా అంటే భ‌యం కాద‌ని… న‌గ‌ర ప్ర‌జ‌లంద‌రికీ ఓ అభ‌యం అని అన్నారు.చెరువులు, నాలాలు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ను క‌బ్జా చేసిన వారు చేస్తున్న దుష్ప్ర‌చారాన్ని తిప్పి కొట్టాల‌ని న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు సూచించారు. 5 ఎక‌రాల భూమిని క‌బ్జా చేసి అందులో ప‌ని వాళ్ల‌కోసం ఒక షెడ్డు వేసి……

Read More

శ్రావణమాసం సకల శుభప్రదం – వరాలక్ష్మీ కటాక్షమే జీవన ధ్యేయం

శ్రావణమాసం అంటే ప్రకృతి పరిమళించే పుణ్యకాలం. మహిళలందరికీ ఎంతో ఇష్టమైన మాసం. ఈ నెలలో ప్రతి రోజు ఒక పర్వదినమే, శ్రావణ సోమవారాలు పరమేశ్వరుని ఆరాధనకు, మంగళవారాలు మంగళగౌరీ వ్రతానికి, శుక్రవారాలు మహాలక్ష్మికి, శనివారాలు శ్రీ వెంకటేశ్వరుని సేవకు. ఇలాంటి పవిత్ర మాసంలో శ్రావణ శుక్రవారం జరిగే వరలక్ష్మీ వ్రతం సౌభాగ్యానికి, శాంతికి, ఐశ్వర్యానికి ప్రతీక. ఈ వ్రతాన్ని విశేషంగా పాటించడానికి ఒక పవిత్ర కథ ఆధారంగా చెబుతారు – అదే చారుమతీ కథ. పూర్వకాలంలో చారుమతీ…

Read More

నాడు సుందరయ్య… నేడు అప్పలనాయుడు – సైకిల్ పై పార్లమెంటుకు ఎంపీ

సహనం వందే, ఢిల్లీ:కమ్యూనిస్టు నేత పుచ్చలపల్లి సుందరయ్య 1952 ప్రాంతంలో పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. అంతేకాదు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. అంతటి కీలక స్థానంలో ఉన్న సుందరయ్య నిరాడంబరంగా సామాన్యుడి సైకిల్ పై పార్లమెంటుకు వెళ్లేవారు. తన ఫైల్స్ ను సైకిల్ పై పెట్టుకొని వెళ్లడం అనేక మందిని ఆశ్చర్యపరిచింది. అచ్చం అలాగే ప్రస్తుత తెలుగుదేశం పార్టీకి చెందిన విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కూడా సైకిల్ పై పార్లమెంటుకు వెళుతుండడం అత్యంత ఆసక్తికరంగా మారింది….

Read More

ఎంబీబీఎస్ కు డబ్బా కాలేజీల దెబ్బ – నాలుగేళ్లలో నిండని 11,966 సీట్లు

సహనం వందే, ఢిల్లీ: ఒకప్పుడు ఎంబీబీఎస్ లో సీటు రావడం చాలా కష్టమైన విషయం. ఇప్పుడు అవకాశాలు మరింత పెరిగాయి. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ సీట్లు పెద్ద ఎత్తున అందుబాటులోకి వచ్చాయి. కానీ అనేక కాలేజీలలో ఎంబీబీఎస్ సీట్లు మిగిలిపోతుండటం ఆందోళన కలిగిస్తుంది. సీట్ల కోసం విద్యార్థులు ఇప్పటికీ ఎదురుచూస్తూనే ఉన్నారు… అయినప్పటికీ ఎంబీబీఎస్ సీట్లు మిగిలి పోవడానికి కారణం ఏంటనేది చర్చనీయాంశం అయింది. 2024-25 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా 2,849 ఎంబీబీఎస్ సీట్లు ఖాళీగా ఉన్నాయని కేంద్ర…

Read More

90 ఏళ్ల బుల్లెట్టు… రేస్ వాకర్- అలాన్ పోయిస్నర్ స్ఫూర్తి గాథ

సహనం వందే, అమెరికా:వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే అని డాక్టర్ అలాన్ పోయిస్నర్ నిరూపిస్తున్నారు. 90 ఏళ్ల వయసులోనూ అలుపెరుగని స్ఫూర్తితో ముందుకు సాగుతున్న ఆయన, రేస్‌వాకింగ్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు స్వర్ణ పతకాలు సాధించారు. తన వయసు విభాగంలో రికార్డులు నెలకొల్పిన ఆయన, నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. నా వయసు 90… కానీ నేను యువకుడినేతనను ఎవరైనా వృద్ధుడు అని పిలిస్తే, నేను వృద్ధుడిని కాదు, వయసు మళ్లిన వ్యక్తిని…

Read More

చలనచిత్రాణి సంస్కృతేన- ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పిలుపు

సహనం వందే, ఢిల్లీ:యువత సంస్కృతం వైపు ఆకర్షితులవ్వాలంటే దానిని ఆసక్తికరంగా, సరళంగా బోధించాలని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సంస్కృతంలో సినిమాలు (చలనచిత్రాణి సంస్కృతేన) రావాలన్నారు.‌సామాజిక మాధ్యమాలు, ఆధునిక కథనాల ద్వారా సంస్కృతాన్ని యువతకు చేరువ చేయాలని ఆయన అన్నారు. ఈ భాష ద్వారా భారతీయ సంస్కృతి, జ్ఞానం, విలువలను భవిష్యత్తు తరాలకు అందించవచ్చని ఆయన ఉద్ఘాటించారు. మోహన్ భాగవత్ చేసిన…

Read More