నకిలీ కార్డియాలజిస్ట్‌ చికిత్సతో ఏడుగురి మృతి

మధ్యప్రదేశ్‌లో కేసు నమోదు సహనం వందే, భోపాల్:మధ్యప్రదేశ్‌లోని దమోహ్ జిల్లాలో ఒక మిషనరీ ఆసుపత్రిలో నకిలీ కార్డియాలజిస్ట్‌గా పనిచేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నకిలీ డాక్టర్ చికిత్స చేసిన ఏడుగురు రోగులు మరణించినట్లు ఆరోపణలు రావడంతో అధికారులు సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందం సోమవారం దమోహ్‌కు చేరుకుంది. బుధవారం వరకు అక్కడే ఉంటూ విచారణ జరుపనుంది. ఈ నకిలీ వైద్యుడు…

Read More

ట్రంప్ ‘హ్యాండ్స్ ఆఫ్’

సహనం వందే, న్యూయార్క్:అమెరికాలో జనాగ్రహం కట్టలు తెంచుకుంది. అమెరికా వీధుల్లో అధ్యక్షుడు ట్రంప్, వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్ విధానాలపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. “హ్యాండ్స్ ఆఫ్” ఉద్యమం ప్రజల ఆగ్రహానికి ప్రతీకగా మారింది. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలపై టారీఫ్ లు విధించటంతో అంతర్జాతీయంగా ట్రంప్ పై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికాకు వ్యతిరేకంగా చైనా కూడా సుంకాల టారిఫ్ ను 34 శాతం పెంచడంతో, రెండు దేశాల మధ్య కోల్డ్ వార్ మొదలైంది. మరోవైపు…

Read More

పేదల కడుపు నింపే సన్నబియ్యం

సహనం వందే, భద్రాచలం:రాష్ట్రంలోని ప్రతి నిరుపేద సన్నబియ్యంతో అన్నం తినాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి లబ్దిదారుడి ఇంట్లో సహపంక్తి భోజనం చేశారు. ఆదివారం భద్రాచలం శ్రీ సీతారామ స్వామి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న అనంతరం బూర్గంపాడు మండలం సారపాకలో సన్నబియ్యం లబ్దిదారుడు బూరం శ్రీనివాస్ ఇంట్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన…

Read More

అంతులేని అవినీతిలో ఐఏఎస్ లు

సహనం వందే, హైదరాబాద్:భారత పరిపాలనా వ్యవస్థలో అత్యున్నత స్థానంలో ఉన్న ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) వ్యవస్థ దేశానికి నిజంగా న్యాయం చేయగలుగుతోందా అనే ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్, సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దువ్వూరి సుబ్బారావు ఒక ప్రముఖ ఇంగ్లీష్ పేపర్లో రాసిన వ్యాసం ఈ చర్చకు ప్రధాన కారణమైంది. ‘ఐఏఎస్ వ్యవస్థ దేశానికి న్యాయం చేయలేదా?’ అనే శీర్షికతో ప్రచురితమైన ఈ వ్యాసంలో, సుబ్బారావు ఐఏఎస్…

Read More

ప్రయాగ్‌రాజ్‌లో దర్గా ఎక్కి జైశ్రీరామ్ నినాదాలు

సహనం వందే, ప్రయాగ్‌రాజ్:ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో రామ నవమి ఉత్సవాల సందర్భంగా ఆదివారం హిందుత్వ సంస్థల సభ్యులు సికంద్రా ప్రాంతంలోని సయ్యద్ సలార్ మసూద్ ఘాజీ మియాన్ దర్గాపైకి ఎక్కి గందరగోళం సృష్టించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. వీడియోలో హిందుత్వ కార్యకర్తలు కాషాయ జెండాలను పట్టుకుని దర్గాపైకి ఎక్కుతూ జై శ్రీ రామ్ నినాదాలు చేస్తూ కనిపిస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసినట్లు తెలుస్తోంది. స్థానిక…

Read More

తమిళంలో సంతకం ఎందుకు చేయరు?

సహనం వందే, చెన్నై:తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు చేశారు. తమిళ భాషపై ప్రేమ ఉన్నట్లయితే, తమిళనాడు నాయకులు తమ సంతకాలను తమిళ భాషలోనే చేయాలని పీఎం మోదీ సూచించారు. “తమిళనాడు నాయకుల నుంచి నాకు వచ్చే లేఖలను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. వారిలో ఎవరూ తమ సంతకాలను తమిళ భాషలో చేయడం లేదు” అని మోదీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తమిళనాడులో భాషా వివాదాన్ని మరింత రెచ్చగొట్టేలా ఉన్నాయి. రాష్ట్రంలో…

Read More

దుబాయ్ నుండి బెంగళూరుకు బంగారు యాత్ర

సహనం వందే, బెంగళూరు:కర్ణాటక డీజీపీ రామచంద్ర రావు కూతురు, కన్నడ నటి రన్యారావు బంగారు అక్రమ రవాణా కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు ఈ కేసులో కీలక వివరాలను వెల్లడించారు. రన్యారావు 49.6 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలించి, దానిని విక్రయించడంలో జ్యూయలర్ సహిల్ సకారియా జైన్ సహకరించినట్లు తేలింది. ఈ దొంగ బంగారం విలువ రూ. 40.14 కోట్లు. గత నెల మూడో తేదీన బెంగళూరు…

Read More

జగన్ టెన్షన్

సహనం వందే, అమరావతి:ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ఉద్రిక్తత రోజురోజుకూ పెరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం వరుస కేసులతో వేధిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వల్లభనేని వంశీ, పోసాని కృష్ణ మురళి వంటి కీలక నేతలు ఇప్పటికే జైలు పాలవగా, రాష్ట్ర వ్యాప్తంగా అనేకచోట్ల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌పై ఇప్పటికే నమోదైన క్విడ్ ప్రోకో వ్యవహారంలో సీబీఐ, ఈడీ కేసులను ఆధారంగా చేసుకుని ఆయన బెయిల్‌ను రద్దు…

Read More

బండి సంజయ్ ఖబర్దార్!

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని ఆయన హెచ్చరించారు. బీసీల 42 శాతం రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చేందుకు ప్రధానిని ఒప్పించే దమ్ము బండి సంజయ్ కి ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీ పెద్దలకు భయపడే తెలంగాణ బీజేపీ నేతలు బీసీల ధర్నాకు మొహం చాటేశారని ఆయన విమర్శించారు. ఈ మేరకు…

Read More

మజ్జిగ తాగండి… ఆశీర్వదించండి

సహనం వందే, రాజేంద్రనగర్:మజ్జిగ తాగండి… తనను ఆశీర్వదించండి అంటూ ప్రముఖ సామాజిక కార్యకర్త సిద్దురెడ్డి కందకట్ల పిలుపునిచ్చారు. వేసవికాలంలో ప్రజల దాహార్తి తీర్చడం తన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగా శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఆదివారం శంషాబాద్ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఆయన మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ఆర్భాటంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సిద్దురెడ్డి మాట్లాడుతూ… వేసవికాలంలో కొందరు నీళ్లు కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో…

Read More