భారత్‌తో మైత్రికి చైనా తహ తహ

సహనం వందే, ఢిల్లీ:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన భారీ సుంకాల దెబ్బకు చైనా కౌంటర్ ఎటాక్‌తో స్పందించింది. ఈ వాణిజ్య యుద్ధంలో అమెరికా టారిఫ్ ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు చైనా భారత్ వైపు దృష్టి సారించి, మైత్రి బంధాన్ని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఒకవైపు అమెరికా దిగుమతులపై సుంకాలను 34 శాతం నుంచి భారీగా 84 శాతానికి పెంచి ట్రంప్‌కు షాక్ ఇచ్చిన చైనా, మరోవైపు భారత్‌తో కలిసి నిలబడాలని విజ్ఞప్తి చేస్తూ ఈ ఆర్థిక…

Read More

మంత్రివర్గ విస్తరణ లేనట్లేనా?

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల కాలంలో హాట్ టాపిక్‌గా మారిన మంత్రివర్గ విస్తరణ వ్యవహారం ప్రస్తుతానికి నిలిచినట్లే కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కేబినెట్‌ను విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్న సమయంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పార్టీలోని సీనియర్ నాయకులు, అధిష్ఠానం నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా ఈ ప్రక్రియ ఆలస్యమవుతోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. రేవంత్ నిర్ణయాలకు పెద్దల అడ్డుకట్ట…రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలతో ముందుకు…

Read More

జేఈఈ కటాఫ్‌ తగ్గే ఛాన్స్‌

సహనం వందే, హైదరాబాద్:జేఈఈ మెయిన్‌–2025లో గత ఏడాదితో పోలిస్తే కటాఫ్‌ కొంత తగ్గే అవకాశం ఉంది. 2024లో జేఈఈ మెయిన్స్‌లో పర్సంటైల్‌ 94 ఉండగా, ఈసారి అది 92 ఉండొచ్చని విద్యా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది జనవరి, ఏప్రిల్‌లో నిర్వహించిన రెండు సెషన్లలోనూ ప్రశ్నలు గతం కంటే కొద్దిగా కష్టతరంగా ఉండటమే దీనికి కారణం. దేశవ్యాప్తంగా రెండు సెషన్లలో నిర్వహించిన జేఈఈ మెయిన్‌ ప్రవేశ పరీక్షలు ఈ మంగళవారం ముగిశాయి. దాదాపు 12 లక్షల…

Read More

గూడు కోసం జర్నలిస్టుల గోడు

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో జర్నలిస్టులుగా పనిచేస్తున్న వారిలో దాదాపు 80 శాతం మంది బడుగు, బలహీన వర్గాల నుంచి వచ్చినవారే. మిగిలిన 20 శాతం మంది దిగువ మధ్య తరగతి నేపథ్యం గలవారు. అయినప్పటికీ, జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో జర్నలిస్టులను సంపన్న వర్గాలుగా వ్యాఖ్యానించడం విచారకరం. ఈ తీర్పు నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన హామీ అమలు సందిగ్ధంలో పడింది. ఈ పరిస్థితుల్లో జర్నలిస్ట్ హౌసింగ్…

Read More

అగ్రకులాల గుప్పిట్లో బహుజన ఉద్యమం

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో రెడ్డి రిపబ్లిక్‌ రాజ్యం నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కమ్మ, కాపు వర్గాలే రాజ్యమేలుతున్నాయి. కేవలం 15% గా ఉన్న అగ్రకులాలు 85% ఉన్న బడుగు బలహీన వర్గాలను శాసిస్తున్నాయి. రాజకీయ అధికారం మొదలు… సమస్త సంపద వారి చేతుల్లోనే ఉండిపోయింది. ఈ నేపథ్యంలో మెజారిటీ ఎస్సీ, ఎస్టీ, బీసీలను తమ గుప్పెట్లో పెట్టుకుని, వారిని ఓటు బ్యాంకుగా మార్చుకొని రాజ్యాధికారం చలాయిస్తున్నారు. రాజ్యాధికారం కోసం పోరాడాలని అంబేద్కర్, కాన్షీరాం, జ్యోతిరావు పూలే వంటి…

Read More

టైటానిక్ మునిగిపోయే వరకూ లైట్లు

సహనం వందే, లండన్:చరిత్ర పుటల్లో విషాద గాథగా నిలిచిన టైటానిక్ షిప్ ప్రమాదం గురించి తాజాగా సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అత్యాధునిక స్కానింగ్ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించిన పరిశీలనలో… టైటానిక్ మునిగిపోతున్న భయానక క్షణాల్లో సైతం ఓడలోని విద్యుత్ దీపాలు చివరి వరకు వెలుగుతూనే ఉన్నాయని తేలింది. దీనికి కారణం ఓడ ఇంజనీర్లు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చేసిన అసాధారణమైన ప్రయత్నమని నిపుణులు చెబుతున్నారు.1912లో అట్లాంటిక్ మహాసముద్రంలో మంచుకొండను ఢీకొట్టిన తర్వాత టైటానిక్ మునిగిపోవడంతో…

Read More

ఆధార్ బయోమెట్రిక్ డేటా తారుమారు

సహనం వందే, మీరట్:దేశంలోని అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డుల్లో ఒకటైన ఆధార్ భద్రతకు పెద్ద గండి పడింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక ముఠా ఏకంగా 12 రాష్ట్రాల్లో వేలాది మంది ప్రజల ఆధార్ బయోమెట్రిక్ సమాచారాన్ని మార్చేసిందని బయటపడటంతో దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటన ఆధార్ వ్యవస్థపై నమ్మకాన్ని పూర్తిగా దెబ్బతీసింది. మన వ్యక్తిగత సమాచారం ఇంత తేలిగ్గా ఎలా తస్కరించబడుతోంది? డిజిటల్ గుర్తింపు కార్డుల భవిష్యత్తు ఏంటనే భయం అందరిలోనూ మొదలైంది. 12 రాష్ట్రాల్లో…

Read More

బరువు తగ్గడానికి మందులు బెస్ట్

సహనం వందే, న్యూయార్క్:బరువు తగ్గాలంటే శారీరక శ్రమ చేయాల్సిన అవసరం లేదని, దానికంటే మందులతో ఈజీగా తగ్గవచ్చని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైద్య రంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణతో ఊబకాయానికి స్వస్తి పలకవచ్చని అంటున్నారు. యోగా, వ్యాయామం కంటే బరువు తగ్గించే మందులే ఎక్కువ ప్రభావం చూపిస్తాయని ఆయన విశ్లేషించారు. సోమవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అమెరికాలో బిల్ గేట్స్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ‘సాంప్రదాయ…

Read More

సొమ్ము స్వాహా…!

సహనం వందే, హైదరాబాద్:ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కోట్ల రూపాయల సొమ్ము స్వాహా అయ్యింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పుణ్యమా అని ప్రపంచ దేశాలు తల్లడిల్లిపోయాయి. స్టాక్ మార్కెట్ లు కుప్పకూలిపోయాయి. సామాన్యుడి పెట్టుబడులు… మొదలు కంపెనీల షేర్లు ఆవిరయ్యాయి. స్టాక్ మార్కెట్ చరిత్రలో ఈ సోమవారం ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోనుంది. ఫలితంగా భారతదేశంలో డీజిల్, పెట్రోల్, గ్యాస్ గ్యాస్ సిలిండర్ ధరలు హఠాత్తుగా పెరిగి… సాధారణ ప్రజల నడ్డి విరిచాయి. స్టాక్ మార్కెట్ పతనం అంటే…

Read More

సినీనటి దియామీర్జాపై యాక్షన్

సహనం వందే, హైదరాబాద్:కంచ గచ్చిబౌలి ప్రాంతంలో చెట్ల నరికివేతకు సంబంధించిన వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఈ వ్యవహారంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) ద్వారా తయారు చేసిన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారన్న ఆరోపణలతో తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాల సమాచారం ప్రకారం… ఈ వివాదంలో సినీ నటి దియా మీర్జా, యూట్యూబర్ ధ్రువ్ రాఠీతో పాటు మరికొంతమంది సెలబ్రిటీలపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఏఐతో రచ్చ రచ్చ…హైదరాబాద్ విశ్వవిద్యాలయ విద్యార్థులు…

Read More