నారా వారి నయా నాటకం – యూరియా తగ్గించే రైతులకు బోనస్ ఎర

సహనం వందే, అమరావతి:యూరియా కొరత సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యూహాన్నే రచించారు. యూరియా వాడకం తగ్గిస్తే రైతులకు ఒక్కో బస్తాకు రూ. 800 ప్రోత్సాహకం ఇస్తామని ప్రకటించారు. వినడానికి బాగానే ఉన్నా ఈ ప్రకటన వెనుక దాగి ఉన్న రాజకీయ కోణాన్ని విశ్లేషిస్తే అసలు విషయం అర్థమవుతుంది. రాష్ట్రంలో ఇప్పటికే యూరియా కొరతతో రైతులు సతమతమవుతున్నారు. ఈ పరిస్థితిలో వాడకం తగ్గించమని చెప్పడం… ఒకవేళ అవసరమైతే డోర్ డెలివరీ…

Read More

బ్లడ్ మ్యాచ్‌ – దేశం బాధలో ఉంటే పాక్ తో క్రికెట్ ఆటలేంటి?

సహనం వందే, హైదరాబాద్:ఏప్రిల్ రెండో తేదీన పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. అమాయకులైన 26 మంది భారత పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. దేశం ఇంకా ఆ దుర్ఘటన షాక్‌లోంచి తేరుకోకముందే కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్‌లకు అనుమతి ఇవ్వడం ప్రజల ఆగ్రహానికి కారణమైంది. రాజకీయ నాయకులు, సామాన్య ప్రజలు, ఉగ్రదాడి బాధితుల కుటుంబాలు ఈ నిర్ణయంపై మండిపడుతున్నాయి. దేశం మొత్తం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని నినదిస్తుంటే క్రికెట్ మైదానాల్లో పాకిస్తాన్‌తో చేతులు…

Read More

లండన్ మండెన్ – ‘మా దేశం మాక్కావాలి’.. బ్రిటన్ లో నిరసనలు

సహనం వందే, లండన్:లండన్ నగరం వలస వ్యతిరేక నినాదాలతో హోరెత్తిపోయింది. యాంటీ-ఇమ్మిగ్రేషన్ ఉద్యమం గట్టి గళంతో ముందుకు సాగుతోంది. వెస్ట్‌మిన్‌స్టర్ బ్రిడ్జి నుంచి హౌస్ ఆఫ్ పార్లమెంట్ వరకు వేలాది మంది ప్రజలు కదలివచ్చారు. అతివాద కార్యకర్త టామీ రాబిన్సన్ నేతృత్వంలో జరిగిన ఈ ‘యునైట్ ది కింగ్‌డమ్’ ర్యాలీకి లక్షన్నర మందికి పైగా హాజరయ్యారని నివేదికలు చెబుతున్నాయి. వలసవాదాన్ని వ్యతిరేకిస్తూ, అక్రమ వలసదారులను వెంటనే వెనక్కి పంపించాలని వీరు డిమాండ్ చేశారు. నిరసన శాంతియుతంగా మొదలైనా…

Read More

విజయనగరం వీరుడు… పార్లమెంట్ టాపర్

సహనం వందే, న్యూఢిల్లీ:విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పార్లమెంటులో టాపర్ గా నిలిచారు. ప్రశ్నలు, హాజరు విభాగాల్లో ఎంపీలందరితో పోలిస్తే మొదటి స్థానం సాధించారు. మొత్తం పని తీరులో నాలుగో స్థానం వచ్చింది. 99 శాతం హాజరు, 115 ప్రశ్నలతో ముందుండటం అతని అంకితభావాన్ని తెలియజేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని 25 ఎంపీలలో అత్యుత్తములలో ఒకరిగా నిలవడం తెలుగుదేశం పార్టీకి గొప్ప గుర్తింపు. లోక్‌సభ సభ్యుల పనితీరు నివేదికను పార్లమెంట్ విడుదల చేసింది. 2024 జూన్ 24 నుంచి 2025…

Read More

రగులుతున్న గిరిజన వివాదం – లంబాడీల ఆత్మగౌరవ పోరాటం

సహనం వందే, కొత్తగూడెం:కొత్తగూడెం పట్టణం లంబాడీల ఆత్మగౌరవ నినాదాలతో హోరెత్తిపోయింది. సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు భూక్యా సంజీవ్ నాయక్ నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీ… రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఒక స్పష్టమైన సందేశాన్ని పంపింది. లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని వేసిన కేసు విషయంలో కాంగ్రెస్ అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరిని వారు తీవ్రంగా ఖండించారు. ఒకవైపు ఆదివాసీలతో, మరోవైపు లంబాడీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశాలు నిర్వహించడం సమస్యను పరిష్కరించడానికి కాదని,…

Read More

జెన్ జెడ్ వెనుక ‘డీజే’ సౌండ్ – నేపాల్ ను కుదిపేసిన నేత సుదాన్ గురుంగ్

సహనం వందే, నేపాల్:నేపాల్‌లో అవినీతి, కుటుంబ రాజకీయాలు… అలాగే సోషల్ మీడియా నిషేధంపై జెన్ జెడ్ యువతలో రేగిన ఆగ్రహం ఇప్పుడు రాజకీయ విప్లవంగా మారింది. ఈ పోరాటంలో ప్రభుత్వాన్ని గడగడలాడించిన యువ కెరటం 36 ఏళ్ల సుదాన్ గురుంగ్. ‘హమి నేపాల్’ అనే సంస్థకు అధ్యక్షుడైన గురుంగ్… ఈ నిరసనలకు ఊపిరి పోశాడు. వాటిని దేశవ్యాప్తంగా వ్యాపింపజేశాడు. ‘కొత్త తరం ముందుకు వచ్చి, పాత విధానాలను సవాల్ చేయాల’ని గురుంగ్ చెప్పిన మాటలు లక్షలాది మంది…

Read More

లోకల్ ఫుడ్సే… సూపర్‌ఫుడ్స్ – స్థానిక పండ్లు… కూరగాయలే ఆరోగ్యానికి రక్ష

సహనం వందే, హైదరాబాద్:ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో మెరుస్తున్న అకై బౌల్స్… కెఫెల్లో కనిపించే స్పిరులినా స్మూతీలు… వీటిని చూసి సూపర్‌ఫుడ్స్ అనే పదానికి అలవాటు పడిపోయాం. ఈ ఆహారాలు బరువు తగ్గించడంతో పాటు చర్మాన్ని మెరుగుపరుస్తాయని… శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తాయని… క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను కూడా నిరోధిస్తాయని ప్రచారం జరుగుతోంది. కానీ వైద్యులు మాత్రం ఇవి మ్యాజిక్ చేసే మందులు కాదని… బ్యాలెన్స్‌డ్‌గా స్థానికంగా లభించే పండ్లు, కూరగాయలు తినడమే నిజమైన ఆరోగ్య రహస్యం అని…

Read More

ప్రేమతో మీ అనుష్క… – అభిమానులకు ప్రత్యేకంగా లేఖ

సహనం వందే, హైదరాబాద్:సినీ తార అనుష్క శెట్టి తన అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఒక అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తన తాజా చిత్రం ఘాటి విడుదలైన కొద్ది రోజులకే ఆమె సోషల్ మీడియాకు విరామం ప్రకటించారు. ‘ఎక్కడ మొదలు పెట్టానో మళ్ళీ అక్కడికే’ అంటూ ఆమె పెట్టిన భావోద్వేగమైన పోస్ట్ అభిమానుల మనసులను కదిలించింది. ఈ నిర్ణయం సినిమా వర్గాల్లో విస్తృతంగా చర్చకు దారితీసింది. ఆమె త్వరగా తిరిగి రావాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. ఘాటి…

Read More

జనం నెత్తిన వారసత్వం – కుటుంబాల గుప్పిట్లో ప్రజాస్వామ్యం

సహనం వందే, న్యూఢిల్లీ:భారత ప్రజాస్వామ్యం ఇప్పుడు కొన్ని కుటుంబాల గుప్పెట్లో బందీగా మారిందని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అనే ఎన్నికల హక్కుల సంస్థ జరిపిన తాజా అధ్యయనం నిరూపించింది. దేశంలోని మొత్తం 5,204 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలలో ఐదో వంతు మంది రాజకీయ కుటుంబాల నుంచి వారసులుగా వచ్చిన వారేనని ఆ సంస్థ నివేదిక స్పష్టం చేసింది. లోక్‌సభలో ఏకంగా 31 శాతం మంది సభ్యులు, రాజ్యసభలో 19 శాతం మంది వారసత్వ…

Read More

హోమియోపతి వైద్యులు ఎంబీబీఎస్ డాక్టర్లేనా?

సహనం వందే, మహారాష్ట్ర:మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు వైద్య సమాజంలో తీవ్ర కలకలం రేపుతోంది. హోమియోపతి వైద్యులను వైద్య మండలిలో నమోదు చేయాలంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నిర్ణయం ప్రజారోగ్యానికి పెను ప్రమాదమని, ఇది వైద్య వ్యవస్థలో అవినీతికి దారితీస్తుందని ఐఎంఏ హెచ్చరిస్తోంది. ప్రభుత్వం హోమియోపతి వైద్యుల లాబీయింగ్‌కు తలొగ్గి ఈ నిర్ణయం తీసుకుందని వైద్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై బొంబే హైకోర్టులో కేసు…

Read More