తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించాయి
– సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆందోళన సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు, మతోన్మాద దాడులు పెరుగుతున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నడిబొడ్డున న్యాయవాది ఇజ్రాయిల్ హత్య, ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం వంటి ఘటనలను ఆయన తీవ్రంగా ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కుల దురహంకార హత్యలు కూడా పెరుగుతున్నాయని ఆయన…