అవినీతి అనకొండ హరీష్ – శివాలెత్తిన కవిత… బావపై తీవ్ర ఆరోపణలు

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ఆరోపణలు ఒకవైపు కొనసాగుతుండగా బీఆర్‌ఎస్ పార్టీలో అంతర్గత కలహాలు బయటపడ్డాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను కుదిపేశాయి. మాజీ మంత్రి, తన బావ హరీశ్ రావుతో పాటు మాజీ ఎంపీ సంతోష్ రావులే కాళేశ్వరంలో జరిగిన అవినీతికి మూల కారణమని ఆమె తీవ్ర ఆరోపణలు గుప్పించారు. వారి స్వార్థం, అవినీతి వల్లే…

Read More

కాళేశ్వరంలో సునామీ – సీబీఐ దర్యాప్తుకు ప్రభుత్వం నిర్ణయం

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. లక్ష కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలతో అట్టుడికిపోతున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా నిర్ణయించడం సంచలనం రేపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం, గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై పూర్తిస్థాయి లోతుగా దర్యాప్తు జరగాలన్న ప్రజల ఆకాంక్షను ప్రతిబింబిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిణామం బీఆర్ఎస్ పార్టీని తీవ్ర…

Read More

వ్యవసాయ విస్త’రణం’అధికారులు – ఏఈఓల ప్రమోషన్ల చిక్కుముడి

సహనం వందే, హైదరాబాద్:వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈఓ) పదోన్నతులు అంతులేని చిక్కుముడిగా మారాయి. వ్యవసాయంలో డిగ్రీ (బీఎస్సీ అగ్రికల్చర్) పూర్తి చేసి నేరుగా ఏఈఓలుగా నియమితులైన వారికి తీవ్ర అన్యాయం జరుగుతోందని గ్రాడ్యుయేట్ ఏఈఓల సంఘం ఆరోపించింది. మరోవైపు కేవలం డిప్లొమా అర్హతతో ఉద్యోగంలో చేరినవారు ఇన్-సర్వీస్‌లో బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసి సీనియారిటీని తొక్కేస్తున్నారని ఆ సంఘం మండిపడుతోంది. దీనివల్ల దాదాపు 750 మంది గ్రాడ్యుయేట్ ఏఈఓలు తమ పదోన్నతుల కోసం తొమ్మిదేళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారని…

Read More

ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ – అర్ధరాత్రి నుంచి వైద్య సేవలు బంద్

సహనం వందే, హైదరాబాద్:రాష్ట్రంలోని నెట్‌వర్క్ ఆసుపత్రులు ఆదివారం అర్థరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపి వేశాయి. రాష్ట్ర ప్రభుత్వం తమకు చెల్లించాల్సిన 1300 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రకటించాయి. ఈ పరిణామం రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగించే అవకాశం ఉంది. ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య సేవలు చేసినందుకు తమకు రావాల్సిన బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం జాప్యం చేస్తోందని నెట్‌వర్క్ ఆసుపత్రులు చాలా…

Read More

వ్యవసాయ వర్సిటీలో అవినీతి పంట – ఆచార్య ఎన్‌జీ రంగా వీసీపై ఫిర్యాదులు

సహనం వందే, గుంటూరు:ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అవినీతికి నిలయంగా మారిందంటూ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విశ్వవిద్యాలయానికి తాత్కాలిక వీసీగా వ్యవహరిస్తున్న వ్యక్తి అక్రమాలకు పాల్పడుతున్నారని, కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఓ ప్రొఫెసర్‌ స్వయంగా గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ఈ ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు వర్సిటీలో జరుగుతున్న చీకటి కార్యకలాపాలకు అద్దం పడుతున్నాయి. నిబంధనలను బేఖాతరు చేస్తూ పాలక మండలిని విస్మరించి కోరం లేకుండానే రెండు సంవత్సరాలుగా సమావేశాలు నిర్వహిస్తున్నారంటే…

Read More

కుర్చీ వదలని ఎంఎన్ జే డైరెక్టర్

సహనం వందే, హైదరాబాద్:ఎంఎన్ జే డైరెక్టర్ శ్రీనివాసులును వెంటనే రిలీవ్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన ఈనెల 26వ తేదీన ఉత్తర్వులు ఇచ్చారు. అయినప్పటికీ ఇప్పటికీ ప్రతిరోజూ ఆయన ఆస్పత్రికి వస్తూనే ఉన్నారు. అంతేకాదు డైరెక్టర్ పోస్టులో విధులు నిర్వహిస్తుండటంపై ఆసుపత్రి వర్గాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వం తప్పించినా వైద్య ఆరోగ్యశాఖ ఉన్నత స్థాయి యంత్రాంగం ఆయనను ఎందుకు రిలీవ్ చేయడం లేదని…

Read More

స్మిత సబర్’వార్’ – రేవంత్ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ సెలవు నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీసింది. ఆరు నెలలపాటు చైల్డ్ కేర్ లీవ్ తీసుకోవడం వెనుక నిజమైన కారణాలు ఏంటనేది అంతుచిక్కడం లేదు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమెకు ప్రాధాన్యత లేని పోస్టులు కట్టబెట్టడం, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చ జరిగే సమయంలో సెలవు తీసుకోవడం రాజకీయ వర్గాల్లో అనుమానాలకు తావిచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో…

Read More

జీరో యూరియా దందా… వ్యాపారుల మాయ- ఫ్యాక్టరీల నుంచి నేరుగా తెచ్చి వ్యాపారం

సహనం వందే, హైదరాబాద్:రైతుకు యూరియా కొరత నిద్రపట్టనివ్వడం లేదు. వ్యవసాయ పనులను పక్కనపెట్టి గంటల తరబడి ఎరువుల దుకాణాల ముందు క్యూలో నిల్చోవడం నిత్యకృత్యమైపోయింది. ఈ దుస్థితిని కొందరు డీలర్లు, వ్యాపారులు అవకాశంగా తీసుకుని యూరియా బ్లాక్ దందాకు తెరతీశారు. ప్రభుత్వం నిర్ణయించిన రూ. 270 విలువ గల 45 కిలోల యూరియా బస్తాను కొన్నిచోట్ల రూ. 500 పైగా అమ్ముతున్నారు. ఒక బస్తా కావాలంటే ఇతర సరుకులను కూడా కొనాలనే షరతులు, క్యాష్ అండ్ క్యారీ…

Read More

నెంబర్ అడగొద్దు… కస్టమర్స్ చెప్పొద్దు – ఇక మొబైల్ నెంబర్లు అడగడం నేరమే!

సహనం వందే, న్యూఢిల్లీ:భారతదేశంలో డిజిటల్ యుగం విస్తరిస్తున్న కొద్దీ వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన ఆందోళనలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని పరిరక్షించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో అమలులోకి రానున్న నూతన డేటా రక్షణ చట్టం ప్రకారం రిటైల్ దుకాణాల్లో వస్తువులు కొనుగోలు చేసే సమయంలో వినియోగదారుల మొబైల్ నెంబర్లను అడగడం నేరంగా పరిగణించబడుతుంది. ఇప్పటివరకు దుకాణాలు, షాపింగ్ మాల్స్‌లో బిల్లింగ్ ప్రక్రియలో మొబైల్ నెంబర్లు సేకరించడం ఒక…

Read More

అపార్ట్‌మెంట్లు డ్రగ్స్ అడ్డాలు – పబ్‌, రిసార్ట్‌, ఫామ్‌హౌస్‌లపై నిఘాతో మార్పు

సహనం వందే, హైదరాబాద్:హైదరాబాద్ మహానగరంలో అపార్ట్‌మెంట్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. గతంలో పబ్‌లు, రిసార్ట్‌లు, ఫామ్‌హౌస్‌లలో చీకటి సామ్రాజ్యాన్ని నడిపించిన నేరగాళ్లు… ఇప్పుడు తమ కార్యకలాపాలకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. పోలీసుల నిఘా కళ్ళ నుంచి తప్పించుకోవడానికి సర్వీస్ అపార్ట్‌మెంట్లు, గెస్ట్ హౌస్‌లను అడ్డాగా మార్చుకుని అక్కడే డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నారు. ఇటీవల కొండాపూర్‌లో జరిగిన సంఘటన ఈ ప్రమాదకరమైన పోకడకు అద్దం పట్టింది. పోలీసులు ఒక సర్వీస్ అపార్ట్‌మెంట్‌పై దాడి చేసి రేవ్ పార్టీ…

Read More