డెలివరీలో ‘టైమ్ బాంబ్’ – 10 నిమిషాల ఫుడ్ సరఫరాతో ప్రాణాలకు ముప్పు
సహనం వందే, హైదరాబాద్: మన ఆకలి తీర్చే గిగ్ కార్మికులు ఇప్పుడు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కొత్త ఏడాది వేడుకల వేళ తమ కష్టాలను ప్రపంచానికి చాటేందుకు సిద్ధమయ్యారు. కంపెనీల మితిమీరిన వేగం ప్రాణాల మీదకు తెస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10 నిమిషాల డెలివరీ పేరుతో సాగిస్తున్న మరణ మృదంగాన్ని అడ్డుకోవాలని దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. 10 నిమిషాల డేంజర్డెలివరీ యాప్స్ ఇప్పుడు 10 నిమిషాల డెలివరీ అంటూ వింత ప్రయోగాలు చేస్తున్నాయి. దీనివల్ల డెలివరీ…