Elon Musk Mars Embassy

అంగారక గ్రహం… మస్క్ దేశం! – టెక్సాస్‌ స్టార్‌బేస్‌లో మార్స్ ఎంబసీ ఏర్పాటు

సహనం వందే, టెక్సాస్‌: అంగారకుడిపైనే మానవ ఆవాసం అంటూ ఎలాన్ మస్క్ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు ఒక వాస్తవిక రూపం దాల్చుతున్నాయి. అమెరికా టెక్సాస్ స్టార్‌బేస్ కేంద్రంగా జరుగుతున్న మార్పులు ఊహకందని రీతిలో ఉన్నాయి. అక్కడి వాతావరణం, గోడలపై ఉన్న చిత్రాలు, మారుతున్న దృశ్యాలు భవిష్యత్తు మానవ ప్రస్థానానికి దిశానిర్దేశం చేస్తున్నాయి. ఒక సామాన్య యాత్రికుడి కళ్లతో చూసిన స్టార్‌బేస్ అసలు కథ ఇదే. మిథ్య కాదు వాస్తవంటెక్సాస్‌లోని స్టార్‌బేస్‌లోకి అడుగుపెడితే ఏదో తెలియని భ్రమ కలుగుతుంది….

Read More
US Visa

పది రోజుల్లో… వీసా చేతిలో! – జులై 1 నుండి అమెరికా సరికొత్త స్కీమ్

సహనం వందే, హైదరాబాద్: అమెరికా వెళ్లాలంటే ఏళ్ల తరబడి వేచి చూడాల్సిందే. ఇప్పుడు ఆ కష్టాలకు చెక్ పెట్టే సమయం వచ్చింది. అదనపు డబ్బులు చెల్లిస్తే సరి పది రోజుల్లోనే ఇంటర్వ్యూ స్లాట్ దక్కుతుంది. సామాన్యుడికి ఇది అందనంత ఎత్తులో ఉన్నా ధనవంతులకు మాత్రం రాజమార్గం. ఖరీదైన ఈ ప్రయాణం వెనుక ఉన్న అసలు చిక్కులను చూద్దాం. డబ్బుతోనే దారిఅమెరికా వీసా కోసం ఇప్పుడు పడరాని పాట్లు పడనక్కర్లేదు. ఏళ్ల పాటు క్యూలో నిలబడాల్సిన పని లేదు….

Read More
Visakha Steel Plant Fire Accident

కాలిపోతున్న నగరాలు..రాలిపోతున్న ప్రాణాలు – మొన్న ఢిల్లీ… నిన్న హైదరాబాద్.. నేడు విశాఖ

సహనం వందే, హైదరాబాద్: నిత్యం అభివృద్ధి అంటున్న పాలకులు నగరాలను మృత్యుకూపాలుగా మారుస్తున్నారు. కళ్లు మూసి తెరిచేలోపు అగ్ని కీలల్లో సజీవదహనమవుతున్న కార్మికులు, అకాల వర్షాలకు నీట మునుగుతున్న రాజధానులు చూస్తుంటే మనం అభివృద్ధి వైపు వెళ్తున్నామా లేదా మృత్యువు అంచున బతుకుతున్నామా అన్న అనుమానం కలుగుతోంది. నగరాల విస్తరణలో ప్లానింగ్ లేని లోపం రాజకీయ ప్రయోజనాల కోసం చట్టాలను తుంగలో తొక్కడం వల్ల సామాన్యుడి ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోతోంది. స్టీల్ ప్లాంట్ విషాదంవిశాఖ స్టీల్…

Read More
Cockroach Party

‘బొద్దింక’ల స్వరం… మారిన భారతం – నేపాల్ నుంచి ఇండియా వైపు జెన్ జెడ్

సహనం వందే, హైదరాబాద్: నేపాల్, శ్రీలంక దేశాల్లో పాలకులను గడగడలాడించిన యువ ఉద్యమాలు ఇప్పుడు భారత్‌కు పాకాయి. నిన్నటి వరకు ఆన్‌లైన్ జోక్ అని కొట్టిపారేసిన బొద్దింకల జనతా పార్టీ ఇప్పుడు అధికార పీఠాన్ని కదిలిస్తోంది. పొరుగు దేశాల్లో జరిగినట్లుగానే వ్యవస్థపై విసిగిన జెన్ జెడ్, మిలీనియల్స్ ఇప్పుడు ఢిల్లీ వీధుల్లో విప్లవానికి నాంది పలికారు. పాలకుల అహంకారానికి, యువత ఆవేశానికి మధ్య జరుగుతున్న ఈ పోరులో గెలుపు ఎవరిదో కాలమే నిర్ణయించాలి. చరిత్ర పునరావృతం అవుతుందా?నేపాల్,…

Read More
Markfed

మక్కల వేలంలో చిక్కుముడులు – బేస్ ప్రైస్ లేకుండా మార్క్ ఫెడ్ వేలం

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణలో మక్కల విక్రయం ఇప్పుడు పెద్ద చిక్కుముడిలా మారింది. ప్రభుత్వం ఏకంగా 14.70 లక్షల మెట్రిక్ టన్నుల స్టాక్‌ను బేస్ ప్రైస్ లేకుండానే ఈ-వేలం వేయడానికి సిద్ధమైంది. వానాకాలం అమ్మకాల్లో అదనపు ఆదాయం వచ్చినట్లు చెప్పుకున్నా అసలు లెక్కలు మాత్రం వందల కోట్ల నష్టాన్ని చూపిస్తున్నాయి. మార్క్ ఫెడ్ తీరుపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విధానం మారిందిమార్క్‌ఫెడ్ యాసంగి మక్కల విక్రయానికి కొత్త బాట పట్టింది. ఇప్పటివరకు ఉన్న పద్ధతులకు స్వస్తి…

Read More
Chalo Karimnagar

మెడికో తల్లిదండ్రుల చలో కరీంనగర్ – ప్రతిమ, చల్మెడ మెడికల్ కాలేజీలపై ఆగ్రహం

సహనం వందే, కరీంనగర్: కరీంనగర్‌లో వైద్య విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డెక్కారు. ప్రతిమ, చల్మెడ ఆనందరావు వైద్య కళాశాలలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని వారు మండిపడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలను కాలరాస్తూ నాలుగున్నర సంవత్సరాల ఎంబీబీఎస్ కోర్సుకు ఐదేళ్ల ఫీజులు వసూలు చేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తే కాలేజీ యాజమాన్యాలు మొండిగా సమాధానం ఇస్తుండటంతో గందరగోళం నెలకొంది. అక్రమ ఫీజుల వసూళ్ల పర్వంకరీంనగర్‌లోని ప్రతిమ, చల్మెడ ఆనందరావు వైద్య కళాశాలల తీరుపై తల్లిదండ్రుల కమిటీ పోరాటం చేస్తోంది. విద్యార్థుల…

Read More
Brain Operation

పవన్ ‘మత్తు’ కణితి చిత్తు – ఓజీ సినిమా చూపించి మెదడుకు ఆపరేషన్

సహనం వందే, గుంటూరు: ఆపరేషన్ థియేటర్‌లో కత్తులు, కత్తెరల ధ్వని. మెదడుపై నిశితమైన శస్త్రచికిత్స. అయినా రోగి మాత్రం ఎంతో ప్రశాంతంగా సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తోంది. మెదడులోని కణితిని తొలగించడానికి వైద్యులు ఎంచుకున్న ఈ సరికొత్త మార్గం వైద్య ప్రపంచంలోనే ఆశ్చర్యం కలిగిస్తోంది. స్పృహలో ఉండి సినిమా చూస్తూ సర్జరీ చేయించుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. మెదడులో కణితిప్రకాశం జిల్లాకు చెందిన కోటేశ్వరమ్మకు మెదడులో కణితి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అది మాట, కదలికలను…

Read More
AI Vs India

రీల్స్ వ్యసనం… ఏఐలో పతనం – గ్లోబల్ ఏఐ రేసులో ఇండియా 46వ స్థానం

+ సహనం వందే, హైదరాబాద్: దేశ యువత చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంది కానీ భవిష్యత్తు వైపు చూపు లేదు. సోషల్ మీడియాలో మీమ్స్, రీల్స్ పిచ్చిలో భారతీయ జనరేషన్ జడ్ మునిగిపోయింది. ప్రపంచ దేశాలు ఏఐ సాంకేతికతతో దూసుకుపోతుంటే ఆశ్చర్యంగా చూస్తోంది. టెక్నాలజీ వేగంగా మారుతున్న వేళ మనం కేవలం కాలక్షేపానికే పరిమితమై ప్రపంచ జాబ్ మార్కెట్‌లో అడుగుపెట్టే అర్హతను ఎలా కోల్పోతున్నామో ఈ నివేదిక విశ్లేషిస్తోంది. శిక్షణలో దయనీయ స్థితిప్రపంచ దేశాలు తమ శ్రామిక శక్తికి…

Read More
Hitler & Hydraa

హైడ్రాలో హిట్లర్ నీడ – సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యల కలకలం

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో హైడ్రా పేరు ఇప్పుడు పెను సంచలనంగా మారింది. మార్వెల్ కామిక్స్‌లోని ఒక క్రూరమైన ఉగ్రవాద సంస్థ పేరును నేటి రాజకీయాలకు ముడిపెట్టడం రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. హిట్లర్ భావజాలం నుండి ప్రేరణ పొందినట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ పాలనా విధానంపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. రాజకీయ వేదికపై సినిమా కల్పనమార్వెల్ కామిక్స్‌లో హైడ్రా అనేది ఒక కల్పిత ఉగ్రవాద సంస్థ. ప్రపంచాన్ని భయంతో నియంత్రించడం,…

Read More
Kaloji Narayana Rao Health University

మెడికల్ ఫీ’జులుం’పై ఉక్కుపాదం – రంగంలోకి దిగిన కాళోజీ హెల్త్ యూనివర్సిటీ

సహనం వందే, హైదరాబాద్: ప్రైవేట్ మెడికల్ కాలేజీలు విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేస్తూ చేస్తున్న దోపిడీపై కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం తీవ్రంగా స్పందించింది. నాలుగున్నరేళ్ల కోర్సు కాలానికి మించి ఫీజులు అడగవద్దని స్పష్టం చేస్తూనే ఇంటర్న్‌షిప్ అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవని యాజమాన్యాలను హెచ్చరించింది. ప్రభుత్వం, ఎన్ఎంసీ, టీఏఎఫ్ఆర్సీ నిబంధనల అమలే పరమావధిగా శనివారం ఈ కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వ ఉత్తర్వుల ఉల్లంఘనప్రభుత్వ ఉత్తర్వులను తుంగలో తొక్కి కొన్ని ప్రైవేట్…

Read More