కిడ్నీలను దెబ్బతీసే క్రీమ్స్ – జాబితా విడుదల చేసిన అమెరికా పబ్లిక్ హెల్త్

Face Creams damages Kidneys
  • పీపీఎం లెక్కల్లో బయటపడ్డ విషపు వ్యాపారం
  • అనుమతి కంటే లక్షల రెట్లు అధికంగా పాదరసం
  • క్రీముల్లోని పాదరసం ప్రమాదకరం, విషపూరితం
  • జాబితాలో ఇండియాలోని క్రీమ్స్ ఉన్నాయని స్పష్టీకరణ

సహనం వందే, హైదరాబాద్:

మీరు ముఖానికి రాసుకుంటున్న క్రీమ్ మీ కిడ్నీలను దెబ్బతీస్తే? మీ ఇంట్లో అందరూ ఉపయోగించే సౌందర్య సాధనాల నుంచి విషపూరితమైన ఆవిరి వెలువడితే? అందంగా కనిపించాలనే ఆశతో కొంటున్న ఫేస్ క్రీములే ఆరోగ్యానికి శాపంగా మారితే? ఇవి ఊహాగానాలు కాదు. అమెరికాలోని కాలిఫోర్నియా ప్రజారోగ్య విభాగం బయటపెట్టిన ఆందోళనకరమైన వాస్తవాలు.

వేలు లక్షల రెట్ల ప్రమాదకర పాదరసం
ముఖం తెల్లగా మారాలని, మచ్చలు మాయమవ్వాలని, ముడతలు తగ్గాలని కొంటున్న కొన్ని ఫేస్ క్రీమ్స్ లలో ప్రమాదకరమైన పాదరసం ఉన్నట్లు అమెరికా ప్రజారోగ్య విభాగం గుర్తించింది. ఈ వివరాలు cdph.ca.gov, Biomonitoring California నివేదికల్లో వెలుగులోకి వచ్చాయి. పాదరసం మోతాదును పీపీఎం (పది లక్షల భాగాల్లో ఎన్ని భాగాలనేది) కొలతతో లెక్కిస్తారు. ఒక పెద్ద ట్యాంకులో పది లక్షల నీటి చుక్కలు ఉంటే, అందులో ఒక్క చుక్క విషం పడటమే ఒక పీపీఎం. అమెరికా నిబంధనల ప్రకారం క్రీముల్లో ఒక పీపీఎం కంటే ఎక్కువ పాదరసం ఉండటం చట్టవిరుద్ధం. కానీ హెచ్చరికలో పేర్కొన్న న్యూ ఫేస్ క్రీమ్‌లో ఏకంగా 2 లక్షల పీపీఎం, ఫ్రెష్ అండ్ వైట్ క్రీమ్‌లో 24 వేలు, ఫ్రెష్ అండ్ క్లియర్‌లో 19 వేలు, భారత్‌లో తయారైన ఓలిఫెయిర్ పెర్ల్స్ క్రీమ్‌లో 11 వేల భాగాల పాదరసం నమోదైంది.

మూడు రకాలుగా క్రీమ్స్ విభజన…
అధికారులు వీటిని వాణిజ్య క్రీములు, చేతితో తయారుచేసే క్రీములు, ఇతరుల ద్వారా కలుషితమైన పేరున్న బ్రాండ్ల ఉత్పత్తులు అనే మూడు రకాలుగా విభజించారు. పాండ్స్ క్లారెంట్ బీ త్రీ, పాండ్స్ క్రెమా ఎస్, పాండ్స్ రీజువెనెస్ వంటి ఉత్పత్తులు ఇతరుల ద్వారా కలుషితం జరిగినట్లు పేర్కొన్నారు. అలాగే భారత్‌లో తయారైన ఓలిఫెయిర్ పెర్ల్స్ సాఫ్రన్ నైట్ క్రీమ్‌ను ఆన్‌లైన్ నమూనా సేకరించి ప్రత్యేక హెచ్చరిక ఇచ్చారు. కాబట్టి ఈ జాబితాలో పేరుందంటే ఆ బ్రాండ్‌కు చెందిన ప్రతి డబ్బా విషపూరితమని కాదు, పరీక్షించిన నిర్దిష్ట నమూనాల్లోనే పాదరసం గుర్తించారని వినియోగదారులు అర్థం చేసుకోవాలి.

లేబుల్ లేని క్రీములు… ఆన్‌లైన్ అమ్మకాలు
నేచురల్ క్రీములు, ఇంట్లో తయారుచేసిన మందులు అంటూ స్థానిక మార్కెట్లు, సోషల్ మీడియా, ఆన్‌లైన్‌లో అమ్ముతున్న ఉత్పత్తుల వెనుక అసలు రంగు బయటపడింది. పాకిస్థాన్, చైనా, థాయ్‌లాండ్, మెక్సికో, ఫిలిప్పీన్స్, జపాన్, కంబోడియా, వియత్నాం, తైవాన్, జమైకా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల ఉత్పత్తులతో పాటు, తయారీ దేశం ఏదో తెలియని క్రీముల్లోనూ పాదరసం దొరికింది. 5 కే ప్లస్ ఎక్స్ టూ, నన్ కేర్, పార్లే క్రీమ్, పాక్స్ కాంప్లెక్షన్ కేర్, పార్లే గోల్డీ అడ్వాన్స్‌డ్, ఓమ్ని గోల్డ్, డీలక్స్ సిల్కెన్ క్రీముల్లో వేలల్లో పాదరసం స్థాయులు నమోదయ్యాయి. గత రెండు సంవత్సరాల్లోనూ ఇలాంటి నమూనాలు దొరకడం, అందం ఆశను ఆసరాగా చేసుకుని విషం అమ్మే దందా ఇంకా ఆగలేదని స్పష్టం చేస్తోంది.

కిడ్నీలపై ఎఫెక్ట్…
ప్యాకింగ్, పేరు చూసి గుడ్డిగా క్రీములు కొనడం మానుకోవాలి. ఇప్పటికే ఇలాంటి క్రీములు వాడుతుంటే తక్షణమే ఆపేసి, వాటిని చెత్తబుట్టలో వేయాలి. వెంటనే వైద్యులను కలిసి రక్తం, మూత్రంలో పాదరసం స్థాయులు, కిడ్నీల పనితీరు పరీక్షించుకోవాలి. ప్యాకింగ్‌పై మెర్క్యురీ, మెర్క్యూరియో, మెర్క్యూరస్ క్లోరైడ్, కాలొమెల్ వంటి పేర్లు ఉన్నాయేమో గమనించాలి. అందం కోసం ఆరోగ్యాన్ని, ముఖ్యంగా కిడ్నీలను పణంగా పెట్టడం ఎంతవరకు సమంజసమో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది.

అమెరికా గుర్తించిన ప్రమాదకర క్రీమ్స్ లిస్ట్…

List of Face Creams Containing Mercury https://share.google/Yh4PV4KoSbHyEk2M7

క్రెమా డెస్పిగ్మెంటాంటే…

ఐదు కే ప్లస్ ఎక్స్ టూ / ఐదు కే ప్లస్ ఎక్స్ టూ క్రీమ్

ఎ బ్యూటీ క్రీమ్ డే క్రీమ్

ఎ బ్యూటీ క్రీమ్ నైట్ క్రీమ్

ఎ బ్యూటీ క్రీమ్ రింకిల్స్

ఆక్వామేరీ క్రెమా

బీ బీ స్పెషల్ క్రీమ్

ఫోన్ క్రీమ్

పాప్ పాపులర్ ఫేషియల్ క్రీమ్

క్యూ నిక్ కేర్ వైట్ ఆర్మ్‌పిట్ వైటెనింగ్

కియాన్ మెయి వైటెనింగ్ క్రీమ్

రోజాబెల్ క్రెమా

శాన్ రూబీ బ్యూటీ వైటెనింగ్ క్రీమ్

షిచాడే టోక్యో

స్పాట్ రిమూవర్ క్రీమ్

సూపర్ వైట్ బ్యూటీ క్రీమ్ / సూపర్ వైట్

టాప్ బ్యూటీ వైటెనింగ్ నైట్ క్రీమ్

బ్యూటెడెర్మ్ డే నైట్ టోనర్

బెర్రీ ప్లస్ ఎక్స్‌ట్రా వైటెనింగ్ క్రీమ్ / బెర్రీ ప్లస్

బెస్ట్

బ్లాక్ అండ్ వైట్ రేడియన్స్ ఎస్‌పీఎఫ్ పదిహేను వైటెనింగ్ ఫేస్ పౌడర్

సీసీఎం క్రీమ్

చాందినీ వైటెనింగ్ క్రీమ్

చుపా మాంచాస్

క్లారలూనా

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *