విద్యార్థులపై డెత్ ప్రెజర్! – సుప్రీంకోర్టు ప్యానెల్ కమిటీ సర్వే రిపోర్ట్
సహనం వందే, న్యూఢిల్లీ: ఒక్క మార్కు తగ్గితేనే జీవితం అయిపోయిందనుకునే రోజులివి. అలాంటిది దేశంలోని అత్యున్నత కాలేజీల్లో చదువుతున్న వేలాది మంది విద్యార్థులు మానసికంగా ఎలాంటి నరకం అనుభవిస్తున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? చదువుకోవాల్సిన వయసులో భావి భారత పౌరులుగా ఎదగాల్సిన సమయాన వారిలో తీవ్ర మానసిక వేదన కనిపిస్తోంది. మన విద్యాసంస్థల్లో విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురవుతున్నారో తెలిస్తే నిజంగా గుండె పగిలిపోతుంది. సుప్రీంకోర్టు టాస్క్ ఫోర్స్ అధ్యయనంఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు ఈమధ్యకాలంలో బాగా…