హిందువులు బతకాలంటే గన్ పట్టాల్సిందేనా? – రాజాసింగ్ హాట్ కామెంట్స్…ప్యూ రీసెర్చ్‌ వైరల్

Rajasingh hot Comments
  • ప్రతి కుటుంబానికీ తుపాకీ ఇవ్వాలని ఎమ్మెల్యే డిమాండ్
  • ముస్లిం విస్ఫోటనం.. హిందూ భవిష్యత్తు ప్రమాదం
  • ప్రపంచంలో హిందూ జనాభా వాటాకు భారీ గండి
  • భారత్‌ మరో పాకిస్థాన్ ఆవుతుందా?
  • మతాల లెక్కలు.. మారుతున్న సమీకరణాలు!

సహనం వందే, హైదరాబాద్:

ఇంట్లో పిల్లలు, కుటుంబం, ఆస్తిపాస్తులను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ లైసెన్సు కలిగిన తుపాకీ కలిగి ఉండాలా? తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే టి. రాజాసింగ్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఈ ప్రశ్నను దేశవ్యాప్తంగా చర్చకు తెచ్చాయి. జనాభా మార్పులపై ఆందోళన వ్యక్తం చేస్తూ, స్వీయ రక్షణ కోసం హిందువులు ఆయుధాలు కలిగి ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యల వెనుక ఆయన చూపుతున్న కారణాలు, వాటికి ఆధారాలేమిటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

జనాభా నియంత్రణ చట్టం కావాలంటూ
జనాభా మార్పులనే తన వ్యాఖ్యలకు ప్రధాన కారణంగా రాజాసింగ్‌ చూపారు. దేశంలో జనాభా నియంత్రణ చట్టం అవసరమని చెబుతూ ‘హమ్‌ దో, హమారే దో’ నినాదాన్ని ప్రస్తావించారు. అలాంటి చట్టం లేకపోతే భవిష్యత్తులో పరిస్థితులు మారవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక వీడియో సందేశంలో ఆయన తుపాకీ పట్టుకుని కొంతమందితో మాట్లాడుతున్నట్లు కనిపించారు. ఆ వీడియోలో వ్యక్తిగత భద్రత కోసం ఆయుధాలు అవసరమని వాదించారు. స్వీయ రక్షణకు తుపాకీ కూడా ఒక మార్గమన్నది ఆయన అభిప్రాయం.

Muslims domination

ముస్లింలు మూడు రెట్లు పెరుగుతారా?
రాబోయే పదిహేను నుంచి ఇరవై ఏళ్లలో దేశంలోని ముస్లిం జనాభా మూడు రెట్లు పెరిగే అవకాశం ఉందని రాజాసింగ్‌ పేర్కొన్నారు. దీనివల్ల హిందూ సమాజంపై ఎలాంటి ప్రభావం పడుతుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. తన వాదనకు మద్దతుగా పాకిస్థాన్‌ పరిస్థితులను ప్రస్తావించారు. అక్కడ హిందువులు మతపరమైన వేధింపులు, బలవంతపు మతమార్పిడులు, హత్యలు, లైంగిక హింస ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ఇలాంటి పరిణామాలు భవిష్యత్తులో భారత్‌లోనూ చోటుచేసుకోవచ్చని ఆందోళన వెలిబుచ్చారు.
మోడీ తుపాకీ ఆలోచన చేయాలి
అనుమతి ఉన్న ఆయుధాలనే ప్రస్తావించినప్పటికీ, ప్రతి కుటుంబం తుపాకీ తీసుకోవాలన్న ఆలోచనపై చర్చ అవసరం. లైసెన్సు అనేది బాధ్యతాయుత వినియోగాన్ని గుర్తు చేస్తుంది. దేశవ్యాప్తంగా హిందువుల మద్దతుతోనే మోడీ అధికారంలోకి వచ్చారని రాజాసింగ్‌ వ్యాఖ్యానించారు. తన ప్రతిపాదనలను మోడీ నాయకత్వంలో అమలు చేయవచ్చని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ఇలా తన డిమాండ్‌ను వ్యక్తిగత అభిప్రాయానికే పరిమితం చేయకుండా దేశ నాయకత్వంతో ముడిపెట్టి మాట్లాడారు.

రచ్చలేపిన ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ రిపోర్ట్…
రాజాసింగ్ వ్యాఖ్యలు చేయడానికి కారణం ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ రిపోర్టే. ఆ రిపోర్ట్ అంచనాల ప్రకారం, ప్రపంచ మతాల జనాభాలో రాబోయే దశాబ్దాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకోవచ్చు. ప్రస్తుతం అత్యధిక జనాభా కలిగిన మతంగా క్రైస్తవం ఉండగా, రాబోయే పదేళ్లలో ఇస్లాం ఆ స్థానానికి చేరే అవకాశం ఉందని అంచనా. 2035 నాటికి ముస్లింల జనాభా 257 కోట్లకు, క్రైస్తవుల సంఖ్య 252 కోట్లకు చేరవచ్చని నివేదిక పేర్కొంటోంది.

హిందూ జనాభా వాటాకు గండి…
హిందువుల జనాభా పెరిగినా ప్రపంచ జనాభాలో వారి వాటా తగ్గవచ్చని అంచనా ఆ రిపోర్ట్ అంచనా వేసింది. 2070 నాటికి అత్యధిక ముస్లింలు ఉన్న దేశంగా పాకిస్థాన్‌ మారవచ్చని, ఆ తర్వాత భారత్‌, నైజీరియా, ఇండోనేషియా నిలవవచ్చని పేర్కొంది. ఈ మార్పులకు మతమార్పిడుల కంటే పిల్లల జననాలే ప్రధాన కారణమని ప్యూ విశ్లేషించింది. భారత్‌లో ముస్లిం జనాభా వాటా గణనీయంగా పెరుగుతుందని అంచనా వేసింది.

హిందువుల కంటే ముస్లిం జననాల రేటు రెట్టింపు…
ఇస్లాంలో జనాభా పెరుగుదల వేగం ఎక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. 2020 నుంచి 2025 మధ్య ముస్లిం మహిళలు సగటున 3.1 మంది పిల్లలకు జన్మనివ్వగా, హిందూ తదితర మతాల మహిళల్లో ఈ సగటు 1.6గా ఉందని తెలిపింది. హిందువుల కంటే ముస్లిం జననాల రేటు రెట్టింపు స్థాయిలో ఉండటం గమనార్హం. ఇదే కాలంలో ముస్లిం తల్లులకు సుమారు 25.2 కోట్ల మంది పిల్లలు పుట్టినట్లు రిపోర్ట్ అంచనా వేసింది. ఈ జననాల ధోరణి భవిష్యత్తులో ప్రపంచ జనాభా లెక్కలపై ప్రభావం చూపవచ్చని నివేదిక పేర్కొంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *