JNTU Corrupted Officer?

జేఎన్‌టీయూలో అవినీతీశ్వరుడు – యూనివర్సిటీని అడ్డగోలుగా దోచిన మాజీ అధికారి

సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో గత ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన ఓ మాజీ అధికారి బండారం ఇప్పుడు బట్టబయలవుతోంది. యూనివర్సిటీని ఆయన అక్రమాస్తులు కూడబెట్టే ఏటీఎంలా మార్చేశారనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ సీబీఐకి అందిన ఫిర్యాదు ఇప్పుడు వర్సిటీ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు ఆ మాజీ అధికారి ఎవరు? ఆయన హయాంలో తెరవెనుక ఏం జరిగింది? ప్రభుత్వ నిధులను ఎలా స్వాహా చేశారు? అనే ఆసక్తికరమైన…

Read More
60 Corrupted Officers of Telangana in Jail

అవినీతి ఉద్యోగులతో జైళ్లు కిటకిట! – కటకటాల్లో 60 మంది.. ఉన్నతాధికారులూ అదే దారి!

సహనం వందే, హైదరాబాద్: ప్రజలకు సేవ చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ సంపాదనకు తెరలేపుతుండటంతో తెలంగాణ జైళ్లు నిండిపోతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 60 మంది ఉద్యోగులు రిమాండ్‌లో ఉండగా, అందులో చంచల్‌గూడ జైలులోనే 35 మంది ఉన్నారు. కింది స్థాయి సిబ్బందే కాకుండా కీలక ఉన్నతాధికారులు కూడా కటకటాలపాలవడం ప్రభుత్వ యంత్రాంగంలో కలకలం రేపుతోంది. ఒకవైపు ఏసీబీ వరుస అరెస్టులు చేస్తుంటే, మరోవైపు గతంలో నమోదైన కేసులే మూసివేత దిశగా వెళ్లడం కొత్త…

Read More
Electric Cars fail

ఎలక్ట్రిక్ కార్లకు బ్రేకులు – కొనడానికి ప్రజల వెనుకంజ

సహనం వందే, హైదరాబాద్: ఒకప్పుడు కారు కొనాలంటే మైలేజీ ఎంత వస్తుంది? పెట్రోల్ ఖర్చు ఎంత? అని ఆలోచించేవాళ్లం. ఇప్పుడు మరో ప్రశ్న వచ్చి చేరింది. ఎలక్ట్రిక్ కారు కొనాలా? లేక పెట్రోల్ కారే మంచిదా? ఎలక్ట్రిక్ కార్లకు శబ్దం తక్కువ. పొగ కాలుష్యం తక్కువ. నిర్వహణ ఖర్చులు కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంది. అయినా ప్రపంచవ్యాప్తంగా వీటి వినియోగం అనుకున్నంత వేగంగా పెరగడం లేదు. అసలు సమస్య ఎక్కడుంది? సాంకేతికతలోనా? ధరలోనా? ఛార్జింగ్ సదుపాయాల్లోనా?…

Read More
JNTU Student Vikram Death Issue

జేఎన్‌టీయూలో సెక్యూరి(పి)టీ? – ఇంజనీరింగ్ స్టూడెంట్ మృతితో ఉలిక్కిపడ్డ క్యాంపస్‌

సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్ జేఎన్‌టీయూలో ఇంజినీరింగ్‌ విద్యార్థి విక్రమ్‌ మృతి క్యాంపస్‌లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఈ ఘటనతో విశ్వవిద్యాలయంలో విద్యార్థుల భద్రత, సంక్షేమం, అధికారుల పర్యవేక్షణపై చర్చ మొదలైంది. భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా ఇప్పటికైనా గట్టి చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ జి.వి. నరసింహ, వైస్‌ ప్రిన్సిపాల్‌ రఘురాంకు వినతిపత్రం అందించారు. భవనాలపైకి వెళ్లకుండా చర్యలుక్యాంపస్‌లో ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి…

Read More
Women Protection Pistol

అమ్మాయి చేతికి తుపాకి – మహిళల భద్రతకు మార్కెట్లో కొత్త పరికరాలు

సహనం వందే, హైదరాబాద్‌: మహిళలపై లైంగిక వేధింపులు, దాడులపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఆత్మరక్షణ పరికరాలకు డిమాండ్ పెరుగుతోంది. సాధారణ బ్యాగులో పెట్టుకునేంత చిన్నగా ఉండే కీచైన్ అలారాలు, పెన్నుల రూపంలో ఉండే విద్యుత్ షాక్ పరికరాలు, అత్యవసర సంకేతాలు పంపే ఆభరణాలు మార్కెట్లోకి వస్తున్నాయి. వీటితో పాటు పెప్పర్ స్ప్రేలు, కారు అద్దాలను పగలగొట్టే చిన్న సుత్తులు, ప్రత్యేకమైన టార్చ్‌లైట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అంటే మహిళలు బయటకు వెళ్లేటప్పుడు తమ వెంట తీసుకెళ్లగలిగే భద్రతా…

Read More
Thirupathi Child Kidnap Issue

పసికందును ఎత్తుకెళ్లిన అప్పులోళ్లు – అప్పు వివాదంలో ఆరు నెలల చిన్నారి బందీ

సహనం వందే, తిరుపతి: ఆరు నెలల పసికందుకు అప్పులు, వడ్డీ లెక్కలతో ఏం పని? కానీ తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం శివనాథపాలెం గ్రామంలో వెలుగుచూసిన ఘటనలో ఓ చిన్నారి అప్పుల వివాదంలో చిక్కుకుంది. గ్రామానికి చెందిన ఆది, మేఘమాల దంపతులు సుమారు ఏడు నెలల క్రితం శ్రీకాళహస్తికి చెందిన వెంకటగిరి మునెమ్మ, ప్రసాద్, మోహన్ కుటుంబం నుంచి రూ. 1.50 లక్షలు అప్పుగా తీసుకున్నారు. వడ్డీ చెల్లింపులో జాప్యం జరగడంతో ఇరువర్గాల మధ్య వివాదం మొదలైంది….

Read More
CBI Enquiry on JNTU Professors Transfers

సీబీఐ ఉచ్చులో జేఎన్‌టీయూ ప్రొఫెసర్లు – 30 మందికి అక్రమ లబ్ధి… 52 లక్షలు చెల్లింపు

సహనం వందే, హైదరాబాద్: ఉద్యోగంలో ప్రమోషన్ వస్తే సహజంగానే ఆనందపడతారు. హోదా పెరుగుతుంది.. జీతం పెరుగుతుంది.. ఇన్నాళ్ల కష్టానికి గుర్తింపు లభించిందని భావిస్తారు. కానీ జేఎన్‌టీయూలో కొంతమంది ప్రొఫెసర్లకు మాత్రం ప్రమోషన్లు కొత్త సమస్యలు తెచ్చిపెట్టాయి. కెరీర్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ కింద అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొందిన సుమారు 30 మందికి చెల్లించిన మొత్తాలపై ఇప్పుడు వివాదం మొదలైంది. అర్హత వచ్చిన తేదీ నుంచే కొత్త హోదాకు సంబంధించిన వేతనాలు, బకాయిలు చెల్లించడంపై ఆడిట్ అధికారులు…

Read More
Waste Food New Business

‘చెత్త’ ఆహారం… కొత్త వ్యాపారం! – పారేయాల్సిన ఆహారం చౌకగా విక్రయం

సహనం వందే, హైదరాబాద్: బేకరీలు, రెస్టారెంట్లలో రోజంతా అమ్మకాలు ముగిశాక మిగిలిపోయే కేకులు, బ్రెడ్లు, పఫ్‌లను మరుసటి రోజు అమ్మలేక నిర్వాహకులు చెత్తబుట్టలో పారేస్తుంటారు. అయితే ఇప్పుడు ఈ మిగులు ఆహారమే ‘సర్‌ప్రైజ్ బ్యాగ్స్’ పేరుతో కొత్త వ్యాపారానికి మార్గం చూపిస్తోంది. ప్రత్యేక మొబైల్ యాప్‌ల ద్వారా సమీపంలోని బేకరీలు, కేఫ్‌లలో మిగిలిన ఆహార సంచులను బుక్ చేసుకుని, ఆన్‌లైన్‌లో డబ్బు చెల్లించాక వచ్చే కోడ్ చూపించి దుకాణంలో నేరుగా తీసుకోవచ్చు. ఏ దుకాణం నుంచి సంచి…

Read More
Huge Salaries to Corporate Higher Officials

బాసుల జీతం వంద రెట్లు అధికం – సీఈవోలు, ఉద్యోగుల మధ్య వేతనాల్లో భారీ అంతరం

సహనం వందే, హైదరాబాద్: భారత కార్పొరేట్ రంగంలో సీఈవోల వేతనాలు, సాధారణ ఉద్యోగుల సంపాదన మధ్య వ్యత్యాసం ఊహకందని విధంగా పెరుగుతోంది. ఒకే సంస్థలో పనిచేస్తున్నప్పటికీ, సంస్థలు అభివృద్ధి చెందుతున్న కొద్దీ కొద్దిమంది ఉన్నతాధికారుల సంపద దూసుకుపోతుండగా, కష్టపడే సాధారణ ఉద్యోగుల వేతనాలు నత్తనడకన సాగుతున్నాయని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. రికార్డు స్థాయిలో వేతనాల అంతరంబీఎస్‌ఈ 500 సూచీలోని 232 కంపెనీల వార్షిక నివేదికలను పరిశీలించగా, దాదాపు సగం సంస్థల బాసుల వేతనం సగటు ఉద్యోగి…

Read More
All Trains are full for Sankrathi

సంక్రాంతికి రైళ్లన్నీ ఫుల్‌! – రిజర్వేషన్లు తెరిచిన నిమిషాల్లోనే ఖతం

సహనం వందే, హైదరాబాద్: సంక్రాంతి పండుగకు ఇంకా రెండు నెలల సమయం ఉండగానే రైలు ప్రయాణికులకు కష్టాలు మొదలయ్యాయి. సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న వారికి రిజర్వేషన్‌ కౌంటర్లలో చుక్కెదురవుతోంది. ముఖ్యంగా హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో టికెట్లు దొరకడం గగనమవుతోంది. రిజర్వేషన్లు ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రముఖ రైళ్లలో అందుబాటులో ఉన్న సీట్లన్నీ నిండిపోతున్నాయి. దీంతో ముందుగానే ప్రయాణానికి ప్రణాళిక వేసుకున్నవారికి కూడా నిరాశ తప్పడం లేదు. సాధారణంగా సంక్రాంతి సమయానికి రైళ్లలో రద్దీ…

Read More