US Visa Banned for 75 Countries

75 దేశాలకు అమెరికా వీసా బంద్ – ట్రంప్ సంచలనం… అంతర్జాతీయ కలకలం

సహనం వందే, న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన విశ్వరూపాన్ని చూపిస్తున్నారు. వలసదారులపై ఉక్కుపాదం మోపుతూ ఏకంగా 75 దేశాలకు వీసా ప్రాసెసింగ్‌ను నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. రష్యా, ఇరాన్ వంటి దేశాలతో పాటు థాయ్‌లాండ్, బ్రెజిల్ వంటి దేశాలను కూడా ఈ జాబితాలో చేర్చడం గమనార్హం. ఇది అగ్రరాజ్యపు వీసా విధానంలో అతిపెద్ద మార్పు. 75 దేశాల జాబితాలో ఉన్నవారు వీరేఅమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన అంతర్గత…

Read More
Trump Questions Electronic voting

ఈవీఎంల హ్యాకింగ్… ట్రంప్ షాకింగ్ – అమెరికా అధ్యక్షుడి సంచలన ఆరోపణలు

సహనం వందే, అమెరికా: అమెరికాలో ఎన్నికల ప్రక్రియపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆధునిక సాంకేతికతతో కూడిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) కంటే పాత కాలపు బ్యాలెట్ పేపర్ల పద్ధతిలో ఎన్నికల నిర్వహణే అత్యుత్తమమని ఆయన తేల్చి చెప్పారు. ఓటింగ్ మెషీన్ల వల్ల అక్రమాలు జరుగుతున్నాయని, వాటిని వెంటనే తొలగించి పారదర్శకమైన పద్ధతిని తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. తాజాగా ట్రంప్ అమెరికా ప్రముఖ పత్రిక ‘న్యూయార్క్ టైమ్స్’ ప్రతినిధులకు…

Read More
Trump warnings

ప్రపంచానికి మరో హిట్లర్ – దేశదేశాన అమెరికా జెండా లక్ష్యం

సహనం వందే, న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకునేందుకు ఏ మాత్రం వెనకాడడం లేదు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీ నాజీ నియంత హిట్లర్ ఎలాగైతే వ్యవహరించాడో… సరిగ్గా అలాగే ట్రంప్ కూడా ప్రపంచంపై ఆధిపత్యం కోసం దూకుడుతో ముందుకు వెళ్తున్నాడు. వెనిజులా అధ్యక్షుడు మదురోను బందీగా తీసుకురావడమే ప్రపంచ దేశాలకు పరోక్షంగా ట్రంప్ వార్నింగ్ ఇచ్చినట్లైంది. వెనిజులా నుంచి ఇండియా వరకు ఆయన హెచ్చరికల పరంపర కొనసాగుతోంది. స్నేహం…

Read More
Venezuela President Madura

ట్రంప్ హంటింగ్… గ్లోబల్ షాకింగ్ – అధునాతన టెక్నాలజీతో అధ్యక్షుడి అంతం

సహనం వందే, హైదరాబాద్: ఒక దేశాధ్యక్షుడిని అపహరించడం అంటే అది కేవలం సినిమాల్లోనే సాధ్యం అనుకున్నారంతా. కానీ జనవరి 3వ తేదీ అర్ధరాత్రి వెనిజులా రాజధాని కరాకాస్‌లో జరిగిన ఘటన హాలీవుడ్ యాక్షన్ సినిమాను మించిపోయింది. ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే అధ్యక్ష భవనంలోకి అమెరికా బలగాలు ఎలా జొరబడ్డాయి? వేల సంఖ్యలో ఉన్న వెనిజులా సైన్యం ఏమైంది? మదురో ఎందుకు అడ్డుకోలేకపోయారు? ఈ ఆపరేషన్ వెనుక ఉన్న అసలు రహస్యాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అత్యంత…

Read More

అమెరికా వీసా… విద్యార్థుల దండయాత్ర – ట్రంప్ రూల్స్ ను బ్రేక్ చేసిన భారతీయులు

సహనం వందే, న్యూఢిల్లీ:అమెరికాలో చదవడానికి మన విద్యార్థులు అత్యంత ఆసక్తి చూపిస్తున్నారు. ట్రంప్ కారణంగా వీసా కష్టాలు ఇబ్బంది పెడుతున్నా… నిబంధనలు మారుతున్నా మనవాళ్లు ఏమాత్రం వెనక్కి చూడడం లేదు. అమెరికాలో చదివి తీరాల్సిందేనన్న బలమైన ఆకాంక్షతో అక్కడికి వెళ్తున్నారు. తాజా లెక్కల ప్రకారం ఈ ఏడాది ఏకంగా 3.63 లక్షల మందికి పైగా భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఇది 9.5 శాతం ఎక్కువ. అమెరికాలో చదువుతున్న మొత్తం విదేశీ విద్యార్థుల సంఖ్యలో…

Read More

ఐఫోన్ రూ. 2.50 లక్షలు?

సహనం వందే, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మేక్ ఇన్ యూఎస్ విధానంలో భాగంగా యాపిల్ ఐఫోన్‌లను అమెరికాలోనే తయారు చేయాలని గట్టిగా కోరుకుంటున్నారు. అయితే ఈ కల నిజమైతే ఐఫోన్ కొనుగోలుదారులకు భారీ షాక్ తగలవచ్చు. నిపుణుల హెచ్చరికల ప్రకారం, ఒక ఐఫోన్ ధర ఏకంగా $3,000 (సుమారు రూ. 2.5 లక్షలు) వరకు పెరిగే అవకాశం ఉంది. చైనా నుంచి అమెరికాకు ఉత్పత్తి మారితే…ట్రంప్ ప్రభుత్వం చైనా నుంచి దిగుమతి చేసుకునే…

Read More

మెలానియా ట్రంప్ మాయం!

సహనం వందే, వాషింగ్టన్: అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్… ఈ పేరు వినగానే ఒక మిస్టరీలా అనిపిస్తోంది. ఆమె ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? వైట్‌హౌస్‌లో ఆమె ఎందుకు కనిపించడం లేదు? ఈ ప్రశ్నలు ఇప్పుడు అమెరికా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. జనవరిలో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, గత 108 రోజుల్లో మెలానియా వైట్‌హౌస్‌లో కేవలం 14 రోజులు మాత్రమే ఉన్నారని సమాచారం. ఆమె ఎప్పుడు, ఎంతసేపు…

Read More

కాశ్మీర్ వెయ్యేళ్ళ పోరాటమా?

సహనం వందే వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదాస్పదమయ్యాయి. భారత్, పాకిస్థాన్ మధ్య కాశ్మీర్ సమస్యపై ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని ఆయన ఖండించారు. భారత్, పాకిస్థాన్‌లు కాశ్మీర్ కోసం “వెయ్యి సంవత్సరాలుగా” పోరాడుతున్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు చరిత్రాత్మకంగా తప్పుగా ఉన్నాయని, పాకిస్థాన్ 1947లోనే ఏర్పడిందని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. భారత్-పాక్…

Read More