‘స్ట్రీట్‌ డాక్టర్స్’

సహనం వందే, హైదరాబాద్: ఈమె పేరు మిల్లీ-మే ఆడమ్స్. యునైటెడ్ కింగ్డమ్ లోని వేల్స్ కు చెందిన మెడికల్ స్టూడెంట్. హైదరాబాదులో జరిగిన మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనడానికి వచ్చారు. బ్రిటన్ లో అందాల పోటీల్లో ఆమె గతంలో విజయం సాధించారు. ఈ యువ డాక్టర్ అందాల పోటీలోనే కాదు… ఒక మెడికోగా సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. స్ట్రీట్ డాక్టర్స్ అనే పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థకు సారధ్యం వహిస్తున్నారు. 2008లో వైద్య విద్యార్థులతో ప్రారంభమైన…

Read More

అందం వెనుక విషాదం

సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్‌లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో థాయ్‌లాండ్‌కు చెందిన ఓపల్ సుచాతా చువాంగ్‌శ్రీ ప్రపంచ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకుంది. 16 ఏళ్ల వయసులో రొమ్ము కణితి శస్త్రచికిత్సను చేయించుకుని, రొమ్ము క్యాన్సర్ అవగాహనకు తన జీవితాన్ని అంకితం చేసిన ఈ యువతి ప్రస్థానం హృదయాన్ని పిండేస్తుంది. ఆమె విజయం కేవలం అందానికే కాదు. ఆమె సంకల్పానికి, సమాజం పట్ల బాధ్యతకు నిదర్శనం. 16 ఏళ్లలోనే జీవిత పాఠం…2003 సెప్టెంబర్ 20న థాయ్‌లాండ్‌లోని…

Read More

అందాల పోటీలా? వేశ్యా కేంద్రాలా?

సహనం వందే, హైదరాబాద్: హైదరాబాదులో జరుగుతున్న ప్రపంచ అందాల పోటీలు వివాదాస్పదంగా మారాయి. ఈ పోటీల నిర్వహణపై మిస్ ఇంగ్లాండ్-2024 విజేత మిల్లా మాగీ (24) తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం సంచలనం అయ్యింది. అంతేకాదు ఈ పోటీలను బహిష్కరించి ఆమె తిరిగి తన దేశానికి వెళ్ళిపోయింది. ‘నేను ఈ ఈవెంట్‌లో వేశ్యలా భావించా. ఎల్లప్పుడూ మేకప్‌లో ఉండాలట. బ్రేక్‌ఫాస్ట్ సమయంలో కూడా బాల్ గౌన్లలో ఉండాలట. అందాల పోటీలను స్పాన్సర్ చేస్తున్న మధ్య వయస్కులైన పురుషులతో సోషలైజ్…

Read More

ఫిలింసిటీలో ‘మిస్ వరల్డ్’ రచ్చ

సమన్వయ లోపం.. కార్యక్రమం ఆలస్యం సహనం వందే, హైదరాబాద్: ఫిలిం సిటీలో అందాల బామల పర్యటన కార్యక్రమం ఆలస్యంగా సాగింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న సుందరీమణుల ప్రోగ్రాంలు సమయనుకూలంగా జరుగుతుండగా.. ఫిలిం సిటీ శనివారం నాటి కార్యక్రమం మాత్రం ఆలస్యంగా జరిగింది. వాస్తవానికి ఫిలిం సిటీకి సమయం ప్రకారం సాయంత్రం 5.30 గంటలకే అందాల తారాలంతా చేరుకున్నప్పటికి అక్కడి సిబ్బంది, అధికారులు, పోలీసుల మధ్యన సమన్వయ లోపంతో కార్యక్రమ నిర్వహణలో ఆలస్యం చోటు చేసుకుందని…

Read More

ప్రభుత్వ డబ్బుతో ఏఐజీకి డప్పు

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ వేదికపై పరువు తీసుకుంటోంది! అందాల పోటీల పేరుతో ప్రజల సొమ్మును యథేచ్ఛగా ధారపోస్తూ ప్రైవేట్ కార్పొరేట్లకు కొమ్ము కాస్తోంది. మెడికల్ టూరిజం ముసుగులో ఒకవైపు ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) వంటి ఆసుపత్రుల వ్యాపారానికి ఎర్ర తివాచీ పరుస్తోంది. మరోవైపు ఐపీఎల్ టికెట్ల అమ్మకాలు పెంచేందుకు అందమైన అమ్మాయిలను వాడుకుంటోంది. ఇది ప్రభుత్వ సొమ్ముతో జరుగుతున్న వ్యాపారం కాదా? ప్రజల నమ్మకాన్ని మంటగలిపే దారుణమైన చర్య కాదా?…

Read More

‘ప్రపంచం కళ్లన్నీ తెలంగాణవైపే’

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం అంతర్జాతీయ ఖ్యాతిని మరింతగా పెంచేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన 72వ మిస్ వరల్డ్ 2025 పోటీలను హైదరాబాద్ వేదికగా ఈ నెల 7 నుండి 31 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించింది. ఈ పోటీలను తెలంగాణ ప్రత్యేకతలను ప్రపంచానికి చాటి చెప్పే సువర్ణావకాశంగా భావిస్తూ, భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రపంచం కళ్లన్నీ తెలంగాణవైపే!…‘ప్రపంచం కళ్లన్నీ…

Read More