
ఎంపీ అప్పలనాయుడుకు మోడీ ప్రశంస
సహనం వందే, న్యూఢిల్లీ:విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడును ప్రధాని మోడీ ప్రత్యేకంగా ప్రశంసించారు. కలిశెట్టి పార్లమెంట్ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరవుతారని, కొత్త విషయాలను అన్వేషించి సమాజానికి మంచి విషయాలను పరిచయం చేస్తారని ప్రధాని కొనియాడారు. ఆయన భుజం తట్టి ‘గాడ్ బ్లెస్ యూ’ అని అభినందించారు. పార్లమెంట్ ప్రాంగణంలో సోమవారం టీడీపీ ఎంపీలు ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ సహా పలువురు ఎంపీలు ఈ భేటీలో పాల్గొన్నారు. ఏపీ అభివృద్ధికి…