స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్?

కేంద్రం కులగణన ప్రకటనతో చిక్కులు సహనం వందే, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త కులగణన చేపట్టనున్నట్లు ప్రకటించడంతో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యం కానున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కుల సర్వే నిర్వహించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన నేపథ్యంలో తాజా ప్రకటన రాష్ట్ర ప్రభుత్వ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. కేంద్ర కులగణనకే సాధికారత…కేంద్ర ప్రభుత్వం జనాభా గణాంకాల సమయంలో…

Read More

‘ప్రపంచం కళ్లన్నీ తెలంగాణవైపే’

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం అంతర్జాతీయ ఖ్యాతిని మరింతగా పెంచేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన 72వ మిస్ వరల్డ్ 2025 పోటీలను హైదరాబాద్ వేదికగా ఈ నెల 7 నుండి 31 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించింది. ఈ పోటీలను తెలంగాణ ప్రత్యేకతలను ప్రపంచానికి చాటి చెప్పే సువర్ణావకాశంగా భావిస్తూ, భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రపంచం కళ్లన్నీ తెలంగాణవైపే!…‘ప్రపంచం కళ్లన్నీ…

Read More

డిగ్రీ పరీక్షలు తక్షణమే నిర్వహించాలి

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలో డిగ్రీ పరీక్షల నిర్వహణలో నెలకొన్న గందరగోళంపై ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణమే డిగ్రీ పరీక్షలు నిర్వహించాలని, ప్రభుత్వం, యాజమాన్యాల మధ్య విద్యార్థుల భవిష్యత్తు బలి కాకూడదని డిమాండ్ చేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని, ఉన్నత విద్యామండలి జోక్యం చేసుకుని సమస్యలను పరిష్కరించాలని కోరింది. అలాగే, తెలుగు విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ ప్రవేశాల్లోని అవకతవకలపై విచారణ జరిపి…

Read More

బహు’భ’జన

సహనం వందే, హైదరాబాద్: ఇలా అగ్రవర్ణాల ప్రయోజనాల కోసమే పనిచేస్తూ… మరోవైపు తాము బహుజనుల కోసమే పుట్టామని… వారి సేవలోనే తరిస్తామని… అందుకే కులగణన చేశామని అధికార పెద్దలు డబ్బా కొట్టుకుంటున్నారు. వారి మాటలకు చేతలకు ఎంత తేడా ఉందో పై ఉదాహరణలు చాలు. దేశంలో… రాష్ట్రంలో బహుజనుల పట్ల అగ్రవర్ణ పార్టీల తీరు ఇదే. బీజేపీ మతంపై ఆధారపడి ఓట్లు సంపాదిస్తున్నందున… కులంపై ఆధారపడి ఓటు బ్యాంకును స్థిరం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. కానీ…

Read More

‘మెగా’ ఇన్‌స్పిరేషన్

సహనం వందే, ముంబై: ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో జరిగిన వేవ్స్ సమ్మిట్ లో అల్లు అర్జున్ పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవిని తన మెగా ఇన్‌స్పిరేషన్‌గా అభివర్ణించాడు. ‘మామయ్య చిరంజీవి నా సినిమా జర్నీలో ఎప్పుడూ మెగా ఇన్‌స్పిరేషన్. ఆయన నటన, సినిమా పట్ల అంకితభావం నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. ఆయన స్ఫూర్తితోనే నేను నటనలో ఎన్నో కొత్త ప్రయోగాలు చేశాన’ని బన్నీ ఎమోషనల్‌గా చెప్పాడు. చిరంజీవి నటనలోని వైవిధ్యం, యాక్షన్ స్టంట్స్, డ్యాన్స్ నుండి…

Read More

ఎముకలు విరిచి… కాల్చి… జర్నలిస్ట్ హత్య

సహనం వందే, రష్యా: ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో జరుగుతున్న దారుణాలను ప్రపంచానికి తెలియజేయడానికి తన ప్రాణాలను సైతం లెక్కచేయని ఒక ధైర్యవంతురాలైన మహిళా జర్నలిస్ట్ విక్టోరియా రోష్చినా. ఆమె రష్యా సైనికుల చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురైంది. ఆమె శరీరం గుర్తు పట్టని స్థితిలో కనిపించడం ఈ దుర్ఘటన ఎంత భయంకరమైనదో తెలియజేస్తోంది. నిజం కోసం ప్రాణాలర్పించిన విలేకరి…విక్టోరియా రోష్చినా రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో రహస్యంగా సమాచారం సేకరిస్తూ ఉండగా రష్యన్ బలగాల చేతికి…

Read More

పాక్ కళాకారులపై నిషేధం విధించాల్సిందే

బాలీవుడ్ సినీ నటుడు సునీల్ శెట్టి కామెంట్ సహనం వందే, ముంబై: పహల్గాంలో జరిగిన దాడి తర్వాత పాకిస్థానీ కళాకారులపై నిషేధం విధించాలన్న డిమాండ్‌కు నటుడు సునీల్ శెట్టి గట్టిగా మద్దతు తెలిపారు. మన శాంతికి భంగం కలిగించి, అమాయకులను చంపేవారితో కళలు, క్రికెట్ వంటి రంగాల్లో పనిచేయటం సరైనది కాదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు దేశం ఐక్యంగా ఉండాలని, ఎవరూ విద్వేషాలు వ్యాప్తి చేయకుండా చూడాలని ఆయన పిలుపునిచ్చారు.ఉగ్రదాడి నేపథ్యంలో స్పందించిన…

Read More