విశాఖలో ‘కరాచీ’ చిచ్చు!

సహనం వందే, విశాఖపట్నం: విశాఖపట్నంలో కరాచీ అనే పేరు ఇప్పుడు అగ్గి రాజేస్తోంది. వెంకోజీపాలెం డైమండ్ పార్క్ రోడ్డులో కొన్నేళ్లుగా కొనసాగుతున్న కరాచీ బేకరీ పేరును మార్చాలంటూ స్థానిక జనజాగృతి సమితి సభ్యులు తీవ్రస్థాయిలో ఆందోళన చేపట్టారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో… శత్రుదేశ నగరమైన కరాచీ పేరుతో ఇక్కడ వ్యాపారం చేయడం ఏమిటని వారు నిలదీస్తున్నారు. ఈ పేరును వెంటనే మార్చాలని, లేదంటే బేకరీపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ వారు…

Read More

పిల్లలకు తమిళ పేర్లు పెట్టండి

సహనం వందే, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తమిళ భాషా సంస్కృతులపై తమకున్న అపారమైన అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. రాష్ట్ర ప్రజలు తమ పిల్లలకు, అలాగే తమ వ్యాపార సంస్థలకు తప్పనిసరిగా తమిళ పేర్లే పెట్టాలని ఆయన సూచించారు. భాషా వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో తమిళ గుర్తింపును మరింతగా పెంపొందించే లక్ష్యంతో స్టాలిన్ నవదంపతులు, వ్యాపారులను ఉద్దేశించి ఈ పిలుపునిచ్చారు. ఆయన సందేశం తమిళ ప్రజల్లో భాషాభిమానాన్ని మరింతగా పెంచే అవకాశం ఉంది. పెళ్లి వేడుకలో…

Read More

డ్రగ్స్ మత్తులో మస్క్

సహనం వందే, న్యూయార్క్: టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌పై ప్రఖ్యాత వార్తా సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన ఆరోపణలతో కూడిన బాంబు పేల్చింది. ‘మస్క్ అబోవ్ ది లా’ పేరుతో ఒక ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్ సిరీస్‌ను ప్రచురించింది. ఈ కథనాలు మస్క్ రహస్య జీవితంలోని చీకటి కోణాలను వెలుగులోకి తెచ్చాయి. ముఖ్యంగా అతని మాదక ద్రవ్యాల వినియోగం, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో రహస్య మంతనాలు, టెస్లా బోర్డు డైరెక్టర్లతో అతనికున్న అసాధారణ సంబంధాలపై…

Read More

పోప్ ఎన్నిక రక్తసిక్తం!

సహనం వందే, వాటికన్ సిటీ: పోప్ ఎన్నికల చరిత్ర భక్తి, అధికారం, కుట్రల కలయిక. గతంలో రాజకీయ ఒత్తిళ్లు, లంచాలు ఎక్కువగా ఉన్నా, ఇప్పుడు పరిస్థితి మారింది. ఆధునిక కాన్‌క్లేవ్ ఆధ్యాత్మికంగా జరుగుతోంది. కానీ ఈ రహస్య ఎన్నికల వెనుక ఉన్న కథలు మాత్రం ఇప్పటికీ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. ఈ ఎన్నికల వెనుక శతాబ్దాల తరబడి కుట్రలు, రాజకీయాలు నడిచాయని చరిత్ర చెబుతోంది. నేడు పరిస్థితి కొంత మారినా, గతంలో పోప్ పదవి కోసం జరిగిన…

Read More

ప్రభుత్వ డబ్బుతో ఏఐజీకి డప్పు

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ వేదికపై పరువు తీసుకుంటోంది! అందాల పోటీల పేరుతో ప్రజల సొమ్మును యథేచ్ఛగా ధారపోస్తూ ప్రైవేట్ కార్పొరేట్లకు కొమ్ము కాస్తోంది. మెడికల్ టూరిజం ముసుగులో ఒకవైపు ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) వంటి ఆసుపత్రుల వ్యాపారానికి ఎర్ర తివాచీ పరుస్తోంది. మరోవైపు ఐపీఎల్ టికెట్ల అమ్మకాలు పెంచేందుకు అందమైన అమ్మాయిలను వాడుకుంటోంది. ఇది ప్రభుత్వ సొమ్ముతో జరుగుతున్న వ్యాపారం కాదా? ప్రజల నమ్మకాన్ని మంటగలిపే దారుణమైన చర్య కాదా?…

Read More

రేవంత్ రెడ్డికి రిటర్న్ గిఫ్ట్

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య అగాధం మరింత పెరిగింది! పెండింగ్ సమస్యలు పరిష్కరించకపోతే జూన్ 9 తర్వాత సమ్మెకు వెళ్తామని ఉద్యోగులు తెగేసి చెప్పారు. ఆర్టీసీ కార్మికులు ఇప్పటికే సమ్మెకు సిద్ధం కావడంతో, రాష్ట్రంలో ఉద్యోగుల ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. ఆర్టీసీ సమ్మెతో రవాణా వ్యవస్థ స్తంభించిపోనుంది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు ఉద్యోగులను మరింత రెచ్చగొట్టాయి. ‘ఉద్యోగులు రాజకీయ పార్టీల చేతుల్లో పావులుగా మారొద్దు’ అంటూ హితవు పలికిన సీఎంకు,…

Read More

బ్రాహ్మణుల “అతి”వాదం

సహనం వందే, బెంగళూరు: దేశంలో పరీక్షలంటే విద్యార్థులకు ఒత్తిడితో కూడుకున్న వ్యవహారం. కానీ కొందరు మాత్రం తమ ఆచారాలను అడ్డుపెట్టుకుని అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. తాజాగా కర్ణాటకలోని నీట్ పరీక్షా కేంద్రంలో జరిగిన జంధ్యం వివాదం ఇందుకు నిదర్శనం. సాంకేతికత పెరిగిపోయిన ఈ రోజుల్లో పరీక్షల్లో అనేక ఆంక్షలు సహజం. రింగులు, షూలు, గడియారాలు వంటి వాటితో పాటు, ఇప్పుడు ఉపనయనం చేసుకున్న బ్రాహ్మణ విద్యార్థులు ధరించే జంధ్యాన్ని కూడా అనుమతించడం లేదు. భద్రతా కారణాల దృష్ట్యా…

Read More

టీనేజీ తీవ్రవాదులు

సహనం వందే, యూరప్: యూరప్ ఖండం ఇప్పుడు అత్యంత భయానకమైన ఉగ్రవాద ముప్పును ఎదుర్కొంటోంది. ఊహించని విధంగా కేవలం 14 ఏళ్ల వయసున్న పిల్లలు సైతం ఉగ్ర దాడుల కుట్రల్లో పట్టుబడుతున్నారు. సంగీత కచేరీలు, షాపింగ్ మాల్స్, మతపరమైన ప్రార్థనా స్థలాలపై విధ్వంసం సృష్టించేందుకు పథకాలు రచిస్తున్న ఈ లేత వయసు ఉగ్రవాదులను గుర్తించడం భద్రతా దళాలకు పెను సవాలుగా మారుతోంది. చిన్న వయసులోనే విషబీజాలు…యూరప్ వ్యాప్తంగా ఉగ్రవాద దాడుల కుట్రల్లో చిన్నారులు, యువకులు నిమగ్నమవుతున్న సంఘటనలు…

Read More

‘కుల’రణగొణ

సహనం వందే, హైదరాబాద్: దేశంలో కులగణన అంశం రాజకీయంగా, సామాజికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. కుల గణన చేపట్టడంపై అనేక అగ్రకులాల పెద్దలు ఆందోళన చెందుతున్నారు. కులగణన సక్రమంగా జరిగితే రాజకీయంగా, ఉద్యోగ ఉపాధి అవకాశాల పరంగా తమకు నష్టం జరుగుతుందని అగ్రవర్ణాలు ఆందోళన చెందుతున్నాయి. వెనుకబడిన తరగతులకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇస్తే, తమకు అవకాశాలు తగ్గుతాయని వారు భావిస్తున్నారు. కులగణన తర్వాత తమ జనాభాకు అనుగుణంగా అవకాశాలు కల్పించాలంటూ బహుజన ఉద్యమాలు ఊపందుకుంటాయని, ఇది కూడా…

Read More

తెలంగాణ ఉద్యోగుల ఆగ్రహజ్వాల

సహనం వందే హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల ఐక్యకార్యాచరణ సమితి (టీజీఈజేఏసీ) తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ బాట పట్టడానికి సిద్ధమైంది. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఒక రోజు సుదీర్ఘ సదస్సులో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులు సమావేశమై, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే జూన్ 9వ తేదీ తర్వాత ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు….

Read More