కాంగ్రెస్ లో మహిళాగ్రహం

సహనం వందే, హైదరాబాద్: అధికారంలోకి రావడానికి కష్టపడ్డ మహిళా నేతలకు కాంగ్రెస్ పార్టీ మొండిచెయ్యి చూపిస్తోంది. నామినేటెడ్ పదవులు ఇవ్వకపోవడంతో మహిళా కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. అర్హుల జాబితాను పీసీసీ, ఏఐసీసీకి పంపి ఏడాదిన్నర గడుస్తున్నా ఒక్కరికి కూడా పదవి దక్కకపోవడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో మహిళలకు ప్రాధాన్యత లేకపోతే ఎలా పనిచేయాలని వారు నిలదీస్తున్నారు. 20 ఏళ్లకు పైగా పార్టీ కోసం పనిచేసినా పదవులు ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందని…

Read More

‘మరాఠీ మాట్లాడితేనే డబ్బులు ఇస్తాం’

సహనం వందే, ముంబై: ముంబైలోని భాండుప్ ప్రాంతంలో జరిగిన ఒక సంఘటన భాషా అభిమానానికి అద్దం పడుతోంది. సాయి రాధే అపార్ట్‌మెంట్‌లో ఒక జంట, తమ ఇంటికి పిజ్జా డెలివరీ చేసిన వ్యక్తి మరాఠీ మాట్లాడలేదనే కారణంతో డబ్బులు చెల్లించడానికి నిరాకరించారు. హిందీ మాట్లాడకూడదని వాళ్ళు హుకుం జారీ చేశారు. ఈ షాకింగ్ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘నీకు మరాఠీ రాదు.. డబ్బులు ఇవ్వం!’డొమినోస్ డెలివరీ ఏజెంట్ రోహిత్ లవారే పిజ్జా ఆర్డర్‌తో వెళ్లినప్పుడు,…

Read More

సోఫియాపై బీజేపీ మంత్రి మత వ్యాఖ్యలు

కాంగ్రెస్ భగ్గు… దేశవ్యాప్తంగా ఆగ్రహం! సహనం వందే, ఢిల్లీ: భారత సైన్యానికి గర్వకారణమైన మహిళా అధికారి, కల్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి విజయ్ షా చేసిన నీచమైన వ్యాఖ్యలు దేశాన్ని కుదిపేశాయి. ఆపరేషన్ సింధూర్ పత్రికా సమావేశంలో సోఫియా ఖురేషీని ఉద్దేశించి విజయ్ షా చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. విజయ్ షాను తక్షణమే మంత్రి పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ వివాదం సోషల్ మీడియాలో…

Read More

వ్యవసాయశాఖలో కోవర్ట్

సహనం వందే, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాల అమలుతీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నప్పటికీ, రైతుల నుంచి నిరసనలు వెల్లువెత్తుతుండటం వెనుక వ్యవసాయశాఖలోని ఒకరిద్దరి హస్తం ఉందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. పథకాల రూపకల్పన నుంచి అమలు వరకు జరుగుతున్న తప్పిదాలు యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా? లేక ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనే దురుద్దేశంతో కొందరు కావాలనే చేస్తున్నారా? అన్న ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా…

Read More

‘యుద్ధం బాలీవుడ్ సినిమా కాదు’

సహనం వందే, పూణే: భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై కొందరు వ్యక్తం చేస్తున్న అనుమానాలను భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణే తీవ్రంగా ఖండించారు. యుద్ధం అనేది బాలీవుడ్ సినిమాలో చూపించే రొమాంటిక్ అంశం కాదని, అది అత్యంత గంభీరమైన విషయమని ఆయన స్పష్టం చేశారు. సోమవారం పుణెలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యుద్ధం రొమాంటిక్ సీన్ కాదు…యుద్ధం రొమాంటిక్ సీన్ కాదు. అది మీ…

Read More

‘యాపిల్’ కొరకలేం

సహనం వందే, అమెరికా: ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ తన ఐఫోన్ కొనుగోలుదారులకు చేదు వార్త చెప్పింది. ఈ ఏడాది చివర్లో విడుదల చేయనున్న కొత్త ఐఫోన్ల ధరలను పెంచాలని కంపెనీ యోచిస్తోంది. సరికొత్త ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్‌తో వస్తున్న ఈ ఫోన్ల ధరలు కొంచెం ఎక్కువగానే ఉండనున్నాయి. అయితే చైనా నుండి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై అమెరికా వేసిన పన్నుల వల్ల ఈ ధరలు పెరుగుతున్నాయని మాత్రం యాపిల్ చెప్పడం లేదు. ఈ నిర్ణయం ఐఫోన్…

Read More

నితిన్ ‘తమ్ముడు’

సహనం వందే, సినిమా బ్యూరో, హైదరాబాద్: యువ కథానాయకుడు నితిన్, దర్శకుడు శ్రీరామ్ వేణు కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం తమ్ముడుపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం జులై 4న విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్రం నుండి మూడ్ ఆఫ్ తమ్ముడు అనే పాత్రల పరిచయ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ వీడియో చిత్ర కథాంశానికి…

Read More

ఆయిల్ ఫెడ్ అవకతవకల్లో ‘ప్రవీణ్యుడు’

సహనం వందే, హైదరాబాద్: ఆయన ఆయిల్ ఫెడ్ నర్సరీలో అక్రమాలకు పాల్పడ్డాడని నిర్ధారించారు. అప్పటి ఎండి నిర్మల దీనిపై విచారణ చేసి తప్పు జరిగినట్టు నిర్ధారించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాదు నర్సరీలో జరిగిన అక్రమాలకు అతన్ని బాధ్యున్ని చేసి రూ. 40 లక్షలు రికవరీ చేయాలని ఆమె నిర్ణయించారు. కానీ ఆమె అనంతరం వచ్చినవారు ఎవరూ కూడా అక్రమాలకు పాల్పడిన అధికారిపై చర్యలు తీసుకోకపోగా అందలం ఎక్కించారు. ఇప్పుడు హైదరాబాద్ ఆయిల్ ఫెడ్ సంస్థలో…

Read More

కొకైన్ మత్తులో ‘ఆసుపత్రి’ మాజీ…

సహనం వందే, హైదరాబాద్: ప్రముఖ ఒమేగా హాస్పిటల్స్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) నమ్రతా చిగురుపాటి (34) ఏకంగా వాట్సాప్ ద్వారా రూ. 5 లక్షల విలువైన కొకైన్ కొనుగోలు చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటనతో ఉన్నత వర్గాల్లో డ్రగ్స్ ఎంతలా పాతుకుపోయిందో మరోసారి బహిర్గతమైంది. ఈ వ్యవహారంలో ముంబైకి చెందిన డ్రగ్ సరఫరాదారుడు వంశ్ ధక్కర్‌కు సహకరిస్తున్న బాలకృష్ణ (రాంప్యార్ రామ్) అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. రెడ్…

Read More

బంగ్లాదేశ్ లో నియంతృత్వం

సహనం వందే, ఢాకా: బంగ్లాదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం! తాత్కాలిక ప్రభుత్వం మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీపై ఉక్కుపాదం మోపింది. పార్టీ కార్యకలాపాలపై పూర్తి నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాద నిరోధక చట్టం కింద ఈ నిషేధం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంతో బంగ్లాదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. చాత్రా లీగ్‌పై ఉగ్రవాద ముద్ర…అవామీ లీగ్ విద్యార్థి విభాగమైన చాత్రా లీగ్‌ను గతంలోనే ఉగ్రవాద సంస్థగా…

Read More