ఢీకొట్టినా వెనక్కితగ్గని ‘జర్నలిజం’

సహనం వందే, బాల్టీమోర్: గుర్రపు పందేలంటే ఉత్కంఠకు కేరాఫ్ అడ్రస్. క్షణక్షణానికో మలుపు తిరిగే ఈ రేస్‌ల్లో ఒక్కోసారి ఊహించని విజయాలు నమోదవుతుంటాయి. సరిగ్గా అలాంటి సంచలనమే ఆదివారం మేరీల్యాండ్ లోని బాల్టిమోర్‌ పిమ్లికో రేస్ కోర్స్‌లో జరిగింది. 150వ ప్రీక్‌నెస్ స్టేక్స్‌లో జర్నలిజం అనే గుర్రం అద్భుతమైన కంబ్యాక్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. రేస్ మధ్యలో మరో గుర్రంతో ఢీకొని ట్రాక్ తప్పే ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డ ఈ గుర్రం, చివరి క్షణాల్లో మెరుపు వేగంతో…

Read More

’23’: తెరపై దళిత గాథ!

సహనం వందే, హైదరాబాద్: వెండితెరపై కదులుతున్న దృశ్యం కేవలం సినిమా కాదు… అది కాలం చేసిన గాయం! ’23’ అనే అంకె… 1993లో చిలకలూరిపేటలో జరిగిన బస్సు దహన ఘటనలో అసువులు బాసిన 23 మంది అమాయకుల ఆర్తనాదం! జీఆర్ మహర్షి అందించిన కథతో దర్శకుడు రాజ్ ఆర్ రూపొందించిన ఈ చిత్రం… ఆనాటి విషాదాన్ని, నేటి సమాజంలోని అసమానతలను కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. నేరం చేసిన వారికి శిక్ష పడాలి… కానీ, సమాజంలో అందరికీ న్యాయం…

Read More

ఆయిల్ ఫెడ్ అక్రమాలపై సీబీఐ!

సహనం వందే, హైదరాబాద్: ఆయిల్ ఫెడ్ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని రైతులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని యోచిస్తున్నారు. ఆయిల్ ఫెడ్ లో అక్రమాలపై రాష్ట్ర వ్యవసాయ శాఖకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వారెవరూ పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయిల్ ఫెడ్ లోని కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడినట్లు వారు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ విచారణ కోరడమే సరైన పరిష్కారంగా రైతులు భావిస్తున్నారు. ‘రైతుల…

Read More

హిట్లర్ నాజీ’హీరో’యిజం

సహనం వందే, హైదరాబాద్: అడాల్ఫ్ హిట్లర్… ఈ పేరు వింటేనే ప్రపంచ చరిత్రలో రక్తపు అధ్యాయం కళ్లముందు కదలాడుతుంది. రెండో ప్రపంచ యుద్ధానికి కారకుడైన ఈ నియంత విద్వేషపూరిత భావజాలం 80 ఏళ్ల తర్వాత కూడా పూర్తిగా అంతరించలేదు. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే కొన్ని దేశాల్లో నియో-నాజీలు కేవలం రహస్యంగానే కాకుండా, రాజకీయ పార్టీల రూపంలోనూ ఉనికిని చాటుకుంటున్నాయి. హిట్లర్ భావజాలం పట్ల నేటి తరం ఆకర్షితులవుతున్నారు. అనేక దేశాల్లో హిట్లర్ ఒక హీరోగా యువతను…

Read More

ఫిలింసిటీలో ‘మిస్ వరల్డ్’ రచ్చ

సమన్వయ లోపం.. కార్యక్రమం ఆలస్యం సహనం వందే, హైదరాబాద్: ఫిలిం సిటీలో అందాల బామల పర్యటన కార్యక్రమం ఆలస్యంగా సాగింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న సుందరీమణుల ప్రోగ్రాంలు సమయనుకూలంగా జరుగుతుండగా.. ఫిలిం సిటీ శనివారం నాటి కార్యక్రమం మాత్రం ఆలస్యంగా జరిగింది. వాస్తవానికి ఫిలిం సిటీకి సమయం ప్రకారం సాయంత్రం 5.30 గంటలకే అందాల తారాలంతా చేరుకున్నప్పటికి అక్కడి సిబ్బంది, అధికారులు, పోలీసుల మధ్యన సమన్వయ లోపంతో కార్యక్రమ నిర్వహణలో ఆలస్యం చోటు చేసుకుందని…

Read More

ఎవరికి ఛాన్స్? ఎవరికి షాక్?

సహనం వందే, హైదరాబాద్: ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణ వ్యవహారం మళ్ళీ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతున్నా విస్తరణ జరగపోవడంతో అనేకమంది నిరాశలో ఉండిపోయారు. ప్రతి పండుగకు లేదా శుభకార్యం సందర్భంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మళ్లీ ఇప్పుడు విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ పెద్దలు చెబుతుండటంతో మళ్ళీ ఆశలు చిగురిస్తున్నాయి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తాజా ప్రకటనతో ఈ నెలాఖరు లేదా జూన్ మొదటి…

Read More

బీఆర్ఎస్‌ చీలికకు హరీష్ బీజాలు

సహనం వందే, హైదరాబాద్: రాజకీయ ఓనమాలు నేర్పించి ఈ స్థాయికి తీసుకొస్తే, తన సొంత మేనమామ కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచేందుకు కూడా హరీష్ రావు వెనుకాడడం లేదని జోరుగా ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్‌ చీలికకు ఆయన బీజం వేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేటీఆర్ నాయకత్వాన్ని ఏమాత్రం అంగీకరించడానికి హరీష్ రావు సిద్ధంగా లేనట్టు చెబుతున్నారు. కేటీఆర్ కు పూర్తిస్థాయి పార్టీ బాధ్యతలు అప్పగిస్తే తన రాజకీయ అడుగులు మరోరకంగా ఉంటాయని హరీష్ రావు తన…

Read More

మ్యాచ్ టాప్… మ్యాథ్స్ వీక్

సహనం వందే, హైదరాబాద్: భారత క్రికెట్ జట్టులో తనదైన ముద్ర వేసిన విరాట్ కోహ్లీకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2025 సంవత్సరానికి సంబంధించిన సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు వెలువడిన నేపథ్యంలో, కొన్నేళ్ల క్రితం నాటి విరాట్ కోహ్లీ పదో తరగతి మార్కుల జాబితా నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ మార్కుల జాబితాను ఐఏఎస్ అధికారి జితిన్ యాదవ్ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. ఈ మార్కుల జాబితాలో…

Read More

ఐఫోన్ రూ. 2.50 లక్షలు?

సహనం వందే, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మేక్ ఇన్ యూఎస్ విధానంలో భాగంగా యాపిల్ ఐఫోన్‌లను అమెరికాలోనే తయారు చేయాలని గట్టిగా కోరుకుంటున్నారు. అయితే ఈ కల నిజమైతే ఐఫోన్ కొనుగోలుదారులకు భారీ షాక్ తగలవచ్చు. నిపుణుల హెచ్చరికల ప్రకారం, ఒక ఐఫోన్ ధర ఏకంగా $3,000 (సుమారు రూ. 2.5 లక్షలు) వరకు పెరిగే అవకాశం ఉంది. చైనా నుంచి అమెరికాకు ఉత్పత్తి మారితే…ట్రంప్ ప్రభుత్వం చైనా నుంచి దిగుమతి చేసుకునే…

Read More

ట్రంప్‌పై కంగనా ఫైర్

సోషల్ మీడియాలో పోస్ట్… తొలగింపు సహనం వందే, న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై చేసిన సోషల్ మీడియా పోస్ట్ గురువారం రాత్రి హఠాత్తుగా మాయమైంది. బీజేపీ అధ్యక్షుడు జె.పి. నడ్డా ఫోన్ కాల్ తర్వాతే ఆమె ఈ పోస్ట్‌ను తొలగించినట్లు తెలుస్తోంది. ట్రంప్‌పై కంగనా చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించడంతో, నడ్డా స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. కంగనా పోస్ట్‌లో ఏముంది?కంగనా రనౌత్ తన…

Read More