తిరుమలలో దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు
సహనం వందే, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మనవడు దేవాన్ష్ పుట్టిన రోజును పురస్కరించుకుని శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వెంగమాంబ అన్నదాన కేంద్రంలో భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. దేవాన్ష్ చేతుల మీదుగా ప్రసాదాల పంపిణీ చేశారు. దేవాన్ష్ కూడా తన తాతతోపాటు భక్తులకు అన్నప్రసాదాలు స్వయంగా వడ్డించి, వారి ఆశీర్వాదాలు పొందాడు. ఈ సందర్భంగా చంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ అన్నదాన ట్రస్ట్…