‘ప్రపంచం కళ్లన్నీ తెలంగాణవైపే’

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం అంతర్జాతీయ ఖ్యాతిని మరింతగా పెంచేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన 72వ మిస్ వరల్డ్ 2025 పోటీలను హైదరాబాద్ వేదికగా ఈ నెల 7 నుండి 31 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించింది. ఈ పోటీలను తెలంగాణ ప్రత్యేకతలను ప్రపంచానికి చాటి చెప్పే సువర్ణావకాశంగా భావిస్తూ, భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రపంచం కళ్లన్నీ తెలంగాణవైపే!…‘ప్రపంచం కళ్లన్నీ…

Read More

డిగ్రీ పరీక్షలు తక్షణమే నిర్వహించాలి

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలో డిగ్రీ పరీక్షల నిర్వహణలో నెలకొన్న గందరగోళంపై ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణమే డిగ్రీ పరీక్షలు నిర్వహించాలని, ప్రభుత్వం, యాజమాన్యాల మధ్య విద్యార్థుల భవిష్యత్తు బలి కాకూడదని డిమాండ్ చేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని, ఉన్నత విద్యామండలి జోక్యం చేసుకుని సమస్యలను పరిష్కరించాలని కోరింది. అలాగే, తెలుగు విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ ప్రవేశాల్లోని అవకతవకలపై విచారణ జరిపి…

Read More

‘మెగా’ ఇన్‌స్పిరేషన్

సహనం వందే, ముంబై: ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో జరిగిన వేవ్స్ సమ్మిట్ లో అల్లు అర్జున్ పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవిని తన మెగా ఇన్‌స్పిరేషన్‌గా అభివర్ణించాడు. ‘మామయ్య చిరంజీవి నా సినిమా జర్నీలో ఎప్పుడూ మెగా ఇన్‌స్పిరేషన్. ఆయన నటన, సినిమా పట్ల అంకితభావం నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. ఆయన స్ఫూర్తితోనే నేను నటనలో ఎన్నో కొత్త ప్రయోగాలు చేశాన’ని బన్నీ ఎమోషనల్‌గా చెప్పాడు. చిరంజీవి నటనలోని వైవిధ్యం, యాక్షన్ స్టంట్స్, డ్యాన్స్ నుండి…

Read More

కాంగ్రెస్ ‘కులం’… కాషాయం హైజాక్

సహనం వందే, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ స్వాతంత్రానంతరం తీసుకున్న అతిపెద్ద నిర్ణయం ఇది. రాబోయే జాతీయ జనాభా లెక్కల్లో కులగణన చేపడతామని స్పష్టం చేసింది. దీంతో దేశం మొత్తం ఒక్కసారిగా విస్మయానికి గురైంది. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ జోడో యాత్రలో కులగణన డిమాండ్ ను ముందుకు తీసుకువచ్చారు. తాము గెలిస్తే కులగణన చేసి తీరుతామని హామీయిచ్చారు. అయితే కేంద్రంలో మళ్లీ అధికారం చేపట్టిన భారతీయ జనతా పార్టీ… కులగణనకు…

Read More

అమెజాన్ వర్సెస్ అమెరికా

సహనం వందే, వాషింగ్టన్: అమెరికా ఆన్‌లైన్ దిగ్గజం అమెజాన్‌తో వైట్ హౌస్ నేరుగా తలపడుతోంది. అమెరికా ప్రభుత్వం విధించిన టారిఫ్‌ల వల్ల ఉత్పత్తుల ధరలపై పడే అదనపు భారాన్ని తమ వెబ్‌సైట్‌లో వినియోగదారులకు చూపాలని అమెజాన్ యోచిస్తున్నట్లు వార్తలు రావడంతో వైట్ హౌస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్యను ‘శత్రుత్వపూరిత, రాజకీయ ప్రేరేపిత చర్య’గా అభివర్ణించింది. ఈ వివాదం అమెజాన్ షేర్ల పతనానికి దారితీసింది, టారిఫ్ విధానాలపై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చను మరింత రాజుకుంది….

Read More

సింగర్ దేశద్రోహం

సహనం వందే హైదరాబాద్: పహల్గాంలో ఉగ్రదాడి ఘటనపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ భోజ్‌పురి గాయని నేహా సింగ్ రాథోడ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశద్రోహం కేసుగా మారాయి. ఆమె వ్యాఖ్యలు మత, కుల విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని, పాకిస్తాన్‌లో వైరల్ అవుతూ భారత్‌కు వ్యతిరేకంగా ఉపయోగపడుతున్నాయని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. నేహా రాథోడ్ విమర్శలు… భగ్గుమన్న వివాదంపహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడంపై నేహా సింగ్ రాథోడ్ తీవ్రంగా స్పందించారు. ఈ దాడిని…

Read More

‘భారతి’ సిమెంట్స్ ‘గోవింద’

సహనం వందే, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) హయాంలో జరిగిన భారీ మద్యం కుంభకోణం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ స్కామ్‌లో కీలక పాత్రధారిగా భారతి సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ పేరు తెరపైకి వచ్చింది. తాడేపల్లిలో ఈ పేరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బాలాజీని ఆజ్ఞాతంలో దాచినట్లు వార్తలు వస్తుండగా, ఆయన దొరికితే భారతి సిమెంట్స్‌తో పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి రెడ్డికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు…

Read More

ఉగ్రదాడికి స్థానికుల సహకారం

సహనం వందే, పహల్గామ్: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన భీకర ఉగ్రదాడి వెనుక 15 మంది స్థానికులు టెర్రరిస్టులకు సహకరించినట్లు విచారణలో వెల్లడైంది. టెర్రరిస్టులకు పథకం రూపొందించడంలోనూ, అమలు చేయడంలోనూ స్థానిక ఓవర్‌గ్రౌండ్ వర్కర్స్ కీలక పాత్ర పోషించినట్లు అధికారులు గుర్తించారు. ఈ దాడిలో పాకిస్థాన్ ఉగ్రవాదులు ఏకే-47, ఎం4 రైఫిళ్లతో దాడి చేసి అనేక మంది పౌరులను, భద్రతా సిబ్బందిని హతమార్చారు. ఈ దాడి స్థానిక సహకారం లేకుండా సాధ్యం కాదని విచారణలో వెల్లడైంది. ఎలక్ట్రానిక్…

Read More

పేదల ఇళ్లు కూల్చొద్దు!

సహనం వందే వరంగల్: ‘హైడ్రా పేరు చెప్పి పేదల ఇళ్లు కూలగొడుతున్నారు. తెలంగాణను నెంబర్‌వన్‌ స్థానంలో నిలబెడితే, ఇప్పుడు 14వ స్థానానికి తీసుకెళ్లిపోయారు. నా కళ్ల ముందు తెలంగాణ పరిస్థితి ఇలా అవుతుంటే బాధ కలుగుతోంది. మరో రెండున్నరేళ్లలో ఇక ఏమీ చేయగలుగుతార’ని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం వరంగల్ జిల్లా ఎల్కతుర్తి సభలో తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత దుస్థితిపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం, వెనుకబాటు…

Read More

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు

సహనం వందే హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె. రామకృష్ణారావు నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈ నెల పదవి విరమణ చేస్తున్నడంతో రామకృష్ణారావుని ప్రభుత్వం నియమించింది. మరోవైపు తెలంగాణలో ఐఏఎస్ అధికారులు భారీగా బదిలీ అయ్యారు. ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీగా స్మితా సబర్వాల్, గుడ్ గవర్నెన్స్ వైస్ చైర్మన్‌గా శశాంక్ గోయెల్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్, యాదగిరిగుట్ట…

Read More