All Trains are full for Sankrathi

సంక్రాంతికి రైళ్లన్నీ ఫుల్‌! – రిజర్వేషన్లు తెరిచిన నిమిషాల్లోనే ఖతం

సహనం వందే, హైదరాబాద్: సంక్రాంతి పండుగకు ఇంకా రెండు నెలల సమయం ఉండగానే రైలు ప్రయాణికులకు కష్టాలు మొదలయ్యాయి. సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న వారికి రిజర్వేషన్‌ కౌంటర్లలో చుక్కెదురవుతోంది. ముఖ్యంగా హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో టికెట్లు దొరకడం గగనమవుతోంది. రిజర్వేషన్లు ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రముఖ రైళ్లలో అందుబాటులో ఉన్న సీట్లన్నీ నిండిపోతున్నాయి. దీంతో ముందుగానే ప్రయాణానికి ప్రణాళిక వేసుకున్నవారికి కూడా నిరాశ తప్పడం లేదు. సాధారణంగా సంక్రాంతి సమయానికి రైళ్లలో రద్దీ…

Read More
Vasthu Must or Not for New House

వాస్తు మస్టా? వేస్టా? – ఇల్లు కొనేముందు ఈ నిజాలు తెలుసుకోవాల్సిందే

సహనం వందే, హైదరాబాద్: మీరు ఒక ఇల్లు కొనాలనుకుంటున్నారు. ప్రాంతం బాగుంది, ధర అందుబాటులో ఉంది, నిర్మాణం కూడా నచ్చింది. కానీ చివరి నిమిషంలో ఈశాన్యం బాగోలేదనో, వంటగది, ప్రధాన ద్వారం సరిగా లేదనో ఎవరైనా చెబితే మీ నిర్ణయం మారిపోతుందా? లక్షలు ఖర్చుపెట్టి మార్పులు చేయించుకుంటారా? లేదంటే ఆ ఇంట్లో నివసిస్తే కష్టాలు వస్తాయని భయపడతారా? మరోవైపు వాస్తు అనుకూలంగా ఉందనే కారణంతో మిగతా ఇళ్ల కంటే పది, ఇరవై లక్షలు అదనంగా అడిగితే చెల్లించాలా?…

Read More
Jalamandali Scam

జలమండలిలో కోట్ల మాయాజాలం! – ప్రజాధనంతో అధికారుల చెలగాటం!

సహనం వందే, హైదరాబాద్: ప్రభుత్వ సంస్థల్లో ప్రజాధనం ఎలా ఖర్చవుతోంది? కోట్ల రూపాయల చెల్లింపులు చేసే అధికారులు కనీస జాగ్రత్తలు తీసుకుంటున్నారా? హైదరాబాద్ జలమండలిలో వెలుగుచూసిన రూ.1.3 కోట్ల నిధుల బదిలీ వ్యవహారం ఈ ప్రశ్నలకు కారణమవుతోంది. జలమండలిలో ఆర్థిక లావాదేవీల పర్యవేక్షణ ఏ స్థాయిలో ఉందో ఈ ఘటన ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఇది సాధారణ తప్పిదమని సరిపెట్టుకునే వ్యవహారం కాదు. భారీ చెల్లింపుల్లో కనీస తనిఖీలు కూడా చేయని అధికారుల పనితీరుపై తీవ్రమైన విమర్శలు…

Read More
Divorces in Abroad not valid

విదేశీ విడాకులు చెల్లవు – సుప్రీంకోర్టు సంచలన తీర్పు

సహనం వందే, న్యూఢిల్లీ: ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్తున్న మనవాళ్లు అక్కడి కోర్టుల్లోనే విడాకులు తీసుకుని కొత్త జీవితాలు మొదలుపెట్టేస్తున్నారు. అసలు అలా విదేశాల్లో విడాకులు తీసుకుంటే మన దేశంలో చెల్లుతాయా లేదా అనే దానిపై సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పునిచ్చింది. మన దేశంలో పెళ్లి చేసుకుని విదేశాల్లో విడాకులు తీసుకునే వారికి ఇది ఒక పెద్ద షాక్ అనే చెప్పాలి. మన చట్టాల పరిధిలోనే వివాహ రద్దుభారతదేశంలో పెళ్లి చేసుకున్న జంటలకు విదేశీ…

Read More
Telangana Government New Rules to Rice Millers

ధాన్యం మాయమైతే మిల్లర్లకు మోతే! – తెలంగాణ రైస్ మిల్లర్లపై కొత్త నిబంధనల కొరడా

సహనం వందే, హైదరాబాద్: ప్రభుత్వ ధాన్యం మిల్లులకు చేరిన తర్వాత దాని భద్రత, నిల్వలు, వినియోగంపై పూర్తి బాధ్యత మిల్లర్లదే. ధాన్యం నిల్వల్లో తేడా వచ్చినా, బియ్యం సరఫరాలో లోపాలున్నా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ పౌరసరఫరాల శాఖ 2026–27 వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి కొత్త కస్టమ్ మిల్లింగ్ రైస్‌ (సీఎంఆర్‌) నిబంధనలను అమల్లోకి తెస్తోంది. ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి బియ్యం ప్రభుత్వానికి చేరేవరకు ప్రతి దశలో మిల్లర్ల బాధ్యతను నిర్దేశిస్తూ ఒప్పందంలో…

Read More
JNTU Research Scam

జేఎన్టీయూ రీసెర్చ్ స్కామ్? – సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో షాకింగ్ నిజాలు

సహనం వందే, హైదరాబాద్: పరిశోధనలకు ప్రోత్సాహం ఇవ్వాలంటే విశ్వవిద్యాలయాలకు నిధులు అవసరం. కొత్త పరికరాలు కొనాలి. ప్రయోగాలు నిర్వహించాలి. విద్యార్థులు, అధ్యాపకులు కొత్త ఆవిష్కరణల దిశగా అడుగులు వేయాలి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సంస్థలు కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేస్తున్నాయి. అయితే ఆ నిధుల ఖర్చుకు సంబంధించిన లెక్కలు మాత్రం పక్కాగా ఉండాలి. ప్రతి కొనుగోలుకు ఆధారాలు ఉండాలి. కానీ జేఎన్టీయూలో పరిశోధన నిధుల వినియోగంపై రాష్ట్ర ఆడిట్ శాఖ లేవనెత్తిన ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా…

Read More
GenZ Young Rocks... Devotion Peaks

యంగ్ రాక్స్… భక్తి పీక్స్ – జెన్‌ జెడ్‌ ట్రెండ్‌… దేవుళ్లతో ఫ్రెండ్ షిప్

సహనం వందే, హైదరాబాద్: ఒకప్పుడు తీర్థయాత్ర అంటే దేవుడిని దర్శించుకోవడం, పుణ్యక్షేత్రంలో పూజలు చేసి తిరిగి రావడం. కానీ ఇప్పుడు ముఖ్యంగా యువత ఆలోచనల్లో మార్పు కనిపిస్తోంది. భక్తితో పాటు పర్యాటకం, చరిత్ర, సంస్కృతి, విశ్రాంతికి ప్రాధాన్యం ఇస్తున్నారు. దేవుడిని దర్శించుకోవడమే కాకుండా ఆ ప్రాంతంలోని చారిత్రక ప్రదేశాలను సందర్శించడం, స్థానిక జీవన విధానాన్ని తెలుసుకోవడం, ప్రశాంతమైన వాతావరణంలో సమయం గడపడం వంటి అంశాలను ప్రయాణ ప్రణాళికలో చేర్చుకుంటున్నారు. దీంతో తీర్థయాత్రలు కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలుగా కాకుండా…

Read More
High Court Vs FAke Judgements

హైకోర్టుల పేరుతో నకిలీ తీర్పులు – రాజస్థాన్, అలహాబాద్ కోర్టులకు షాక్!

సహనం వందే, న్యూఢిల్లీ: ఈ ఏడాది జూలై 19వ తేదీ రాత్రి 8 గంటల 59 నిమిషాలకు టెలికాం శాఖకు ఒక ఈమెయిల్ అందింది. ఆర్యన్ చౌదరి అనే అడ్వకేట్ ఆన్ రికార్డ్ పేరుతో రాజస్థాన్ హైకోర్టు ఉత్తర్వులను పంపించారు. వాటి ఆధారంగా జూలై 21న 34 బెట్టింగ్ వెబ్‌సైట్లను బ్లాక్ చేయాలని అధికారులు ఆదేశించారు. అనంతరం ఆగస్టు 22న కార్తికేయ పాండే అనే వ్యక్తి మరో ఈమెయిల్ పంపించారు. అందులో అలహాబాద్ హైకోర్టు పేరుతో నకిలీ…

Read More
JNTU Rs.52 Crores Scam

జేఎన్‌టీయూలో 52 కోట్లు గల్లంతు – సీబీఐకి అందిన ఫిర్యాదులో సంచలన విషయాలు

సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో అసలేం జరుగుతోంది? దాదాపు 52 కోట్ల రూపాయల లెక్కలు ఎందుకు తేలడం లేదు? ఈ నిధుల ఖర్చుపై అనుమానాలకు కారణమేంటి? ఇటీవల సీబీఐకి అందిన ఫిర్యాదులో ఆర్థిక లావాదేవీల నుంచి నియామకాలు, పదోన్నతుల వరకు పలు అంశాలపై కె.పి. భాగ్య వెంకట కుమార్ ఆరోపణలు చేశారు. మరోవైపు, గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్ర ఆడిట్ శాఖ నిర్వహించిన తనిఖీల్లోనూ కోట్ల రూపాయల ఖర్చులకు సరైన ఆధారాలు లేవని వెల్లడైంది….

Read More
Supreme Court Judgement on OBC Non Creamy Layer Reservations

సివిల్స్ ఎంపికల్లో మారిన లెక్కలు – నాన్ క్రీమీలేయర్ పరిమితిపై సుప్రీం సంచలన తీర్పు

సహనం వందే,న్యూఢిల్లీ: దేశంలో అత్యున్నత సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల కోసం కష్టపడే వేలాది మంది ఓబీసీ అభ్యర్థులకు సంబంధించి సుప్రీంకోర్టు అత్యంత కీలక ప్రకటన చేసింది. నాన్ క్రీమీలేయర్ పరిమితిపై కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పునఃపరిశీలన పిటిషన్‌పై ఈ నెల 6వ తేదీన సుదీర్ఘ విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం, తన మార్చి 11 నాటి తీర్పును మరోసారి పునరుద్ఘాటించింది. ఈ నిర్ణయంతో సివిల్స్ ఉద్యోగాల కేటాయింపులు, రిజర్వేషన్ల అర్హతలపై నెలకొన్న ఉత్కంఠకు స్పష్టత వచ్చింది….

Read More