JNTU Student Vikram Death Issue

జేఎన్‌టీయూలో సెక్యూరి(పి)టీ? – ఇంజనీరింగ్ స్టూడెంట్ మృతితో ఉలిక్కిపడ్డ క్యాంపస్‌

సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్ జేఎన్‌టీయూలో ఇంజినీరింగ్‌ విద్యార్థి విక్రమ్‌ మృతి క్యాంపస్‌లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఈ ఘటనతో విశ్వవిద్యాలయంలో విద్యార్థుల భద్రత, సంక్షేమం, అధికారుల పర్యవేక్షణపై చర్చ మొదలైంది. భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా ఇప్పటికైనా గట్టి చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ జి.వి. నరసింహ, వైస్‌ ప్రిన్సిపాల్‌ రఘురాంకు వినతిపత్రం అందించారు. భవనాలపైకి వెళ్లకుండా చర్యలుక్యాంపస్‌లో ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి…

Read More
Women Protection Pistol

అమ్మాయి చేతికి తుపాకి – మహిళల భద్రతకు మార్కెట్లో కొత్త పరికరాలు

సహనం వందే, హైదరాబాద్‌: మహిళలపై లైంగిక వేధింపులు, దాడులపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఆత్మరక్షణ పరికరాలకు డిమాండ్ పెరుగుతోంది. సాధారణ బ్యాగులో పెట్టుకునేంత చిన్నగా ఉండే కీచైన్ అలారాలు, పెన్నుల రూపంలో ఉండే విద్యుత్ షాక్ పరికరాలు, అత్యవసర సంకేతాలు పంపే ఆభరణాలు మార్కెట్లోకి వస్తున్నాయి. వీటితో పాటు పెప్పర్ స్ప్రేలు, కారు అద్దాలను పగలగొట్టే చిన్న సుత్తులు, ప్రత్యేకమైన టార్చ్‌లైట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అంటే మహిళలు బయటకు వెళ్లేటప్పుడు తమ వెంట తీసుకెళ్లగలిగే భద్రతా…

Read More
Thirupathi Child Kidnap Issue

పసికందును ఎత్తుకెళ్లిన అప్పులోళ్లు – అప్పు వివాదంలో ఆరు నెలల చిన్నారి బందీ

సహనం వందే, తిరుపతి: ఆరు నెలల పసికందుకు అప్పులు, వడ్డీ లెక్కలతో ఏం పని? కానీ తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం శివనాథపాలెం గ్రామంలో వెలుగుచూసిన ఘటనలో ఓ చిన్నారి అప్పుల వివాదంలో చిక్కుకుంది. గ్రామానికి చెందిన ఆది, మేఘమాల దంపతులు సుమారు ఏడు నెలల క్రితం శ్రీకాళహస్తికి చెందిన వెంకటగిరి మునెమ్మ, ప్రసాద్, మోహన్ కుటుంబం నుంచి రూ. 1.50 లక్షలు అప్పుగా తీసుకున్నారు. వడ్డీ చెల్లింపులో జాప్యం జరగడంతో ఇరువర్గాల మధ్య వివాదం మొదలైంది….

Read More
CBI Enquiry on JNTU Professors Transfers

సీబీఐ ఉచ్చులో జేఎన్‌టీయూ ప్రొఫెసర్లు – 30 మందికి అక్రమ లబ్ధి… 52 లక్షలు చెల్లింపు

సహనం వందే, హైదరాబాద్: ఉద్యోగంలో ప్రమోషన్ వస్తే సహజంగానే ఆనందపడతారు. హోదా పెరుగుతుంది.. జీతం పెరుగుతుంది.. ఇన్నాళ్ల కష్టానికి గుర్తింపు లభించిందని భావిస్తారు. కానీ జేఎన్‌టీయూలో కొంతమంది ప్రొఫెసర్లకు మాత్రం ప్రమోషన్లు కొత్త సమస్యలు తెచ్చిపెట్టాయి. కెరీర్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ కింద అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొందిన సుమారు 30 మందికి చెల్లించిన మొత్తాలపై ఇప్పుడు వివాదం మొదలైంది. అర్హత వచ్చిన తేదీ నుంచే కొత్త హోదాకు సంబంధించిన వేతనాలు, బకాయిలు చెల్లించడంపై ఆడిట్ అధికారులు…

Read More
Waste Food New Business

‘చెత్త’ ఆహారం… కొత్త వ్యాపారం! – పారేయాల్సిన ఆహారం చౌకగా విక్రయం

సహనం వందే, హైదరాబాద్: బేకరీలు, రెస్టారెంట్లలో రోజంతా అమ్మకాలు ముగిశాక మిగిలిపోయే కేకులు, బ్రెడ్లు, పఫ్‌లను మరుసటి రోజు అమ్మలేక నిర్వాహకులు చెత్తబుట్టలో పారేస్తుంటారు. అయితే ఇప్పుడు ఈ మిగులు ఆహారమే ‘సర్‌ప్రైజ్ బ్యాగ్స్’ పేరుతో కొత్త వ్యాపారానికి మార్గం చూపిస్తోంది. ప్రత్యేక మొబైల్ యాప్‌ల ద్వారా సమీపంలోని బేకరీలు, కేఫ్‌లలో మిగిలిన ఆహార సంచులను బుక్ చేసుకుని, ఆన్‌లైన్‌లో డబ్బు చెల్లించాక వచ్చే కోడ్ చూపించి దుకాణంలో నేరుగా తీసుకోవచ్చు. ఏ దుకాణం నుంచి సంచి…

Read More
Huge Salaries to Corporate Higher Officials

బాసుల జీతం వంద రెట్లు అధికం – సీఈవోలు, ఉద్యోగుల మధ్య వేతనాల్లో భారీ అంతరం

సహనం వందే, హైదరాబాద్: భారత కార్పొరేట్ రంగంలో సీఈవోల వేతనాలు, సాధారణ ఉద్యోగుల సంపాదన మధ్య వ్యత్యాసం ఊహకందని విధంగా పెరుగుతోంది. ఒకే సంస్థలో పనిచేస్తున్నప్పటికీ, సంస్థలు అభివృద్ధి చెందుతున్న కొద్దీ కొద్దిమంది ఉన్నతాధికారుల సంపద దూసుకుపోతుండగా, కష్టపడే సాధారణ ఉద్యోగుల వేతనాలు నత్తనడకన సాగుతున్నాయని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. రికార్డు స్థాయిలో వేతనాల అంతరంబీఎస్‌ఈ 500 సూచీలోని 232 కంపెనీల వార్షిక నివేదికలను పరిశీలించగా, దాదాపు సగం సంస్థల బాసుల వేతనం సగటు ఉద్యోగి…

Read More
All Trains are full for Sankrathi

సంక్రాంతికి రైళ్లన్నీ ఫుల్‌! – రిజర్వేషన్లు తెరిచిన నిమిషాల్లోనే ఖతం

సహనం వందే, హైదరాబాద్: సంక్రాంతి పండుగకు ఇంకా రెండు నెలల సమయం ఉండగానే రైలు ప్రయాణికులకు కష్టాలు మొదలయ్యాయి. సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న వారికి రిజర్వేషన్‌ కౌంటర్లలో చుక్కెదురవుతోంది. ముఖ్యంగా హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో టికెట్లు దొరకడం గగనమవుతోంది. రిజర్వేషన్లు ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రముఖ రైళ్లలో అందుబాటులో ఉన్న సీట్లన్నీ నిండిపోతున్నాయి. దీంతో ముందుగానే ప్రయాణానికి ప్రణాళిక వేసుకున్నవారికి కూడా నిరాశ తప్పడం లేదు. సాధారణంగా సంక్రాంతి సమయానికి రైళ్లలో రద్దీ…

Read More
Vasthu Must or Not for New House

వాస్తు మస్టా? వేస్టా? – ఇల్లు కొనేముందు ఈ నిజాలు తెలుసుకోవాల్సిందే

సహనం వందే, హైదరాబాద్: మీరు ఒక ఇల్లు కొనాలనుకుంటున్నారు. ప్రాంతం బాగుంది, ధర అందుబాటులో ఉంది, నిర్మాణం కూడా నచ్చింది. కానీ చివరి నిమిషంలో ఈశాన్యం బాగోలేదనో, వంటగది, ప్రధాన ద్వారం సరిగా లేదనో ఎవరైనా చెబితే మీ నిర్ణయం మారిపోతుందా? లక్షలు ఖర్చుపెట్టి మార్పులు చేయించుకుంటారా? లేదంటే ఆ ఇంట్లో నివసిస్తే కష్టాలు వస్తాయని భయపడతారా? మరోవైపు వాస్తు అనుకూలంగా ఉందనే కారణంతో మిగతా ఇళ్ల కంటే పది, ఇరవై లక్షలు అదనంగా అడిగితే చెల్లించాలా?…

Read More
Jalamandali Scam

జలమండలిలో కోట్ల మాయాజాలం! – ప్రజాధనంతో అధికారుల చెలగాటం!

సహనం వందే, హైదరాబాద్: ప్రభుత్వ సంస్థల్లో ప్రజాధనం ఎలా ఖర్చవుతోంది? కోట్ల రూపాయల చెల్లింపులు చేసే అధికారులు కనీస జాగ్రత్తలు తీసుకుంటున్నారా? హైదరాబాద్ జలమండలిలో వెలుగుచూసిన రూ.1.3 కోట్ల నిధుల బదిలీ వ్యవహారం ఈ ప్రశ్నలకు కారణమవుతోంది. జలమండలిలో ఆర్థిక లావాదేవీల పర్యవేక్షణ ఏ స్థాయిలో ఉందో ఈ ఘటన ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఇది సాధారణ తప్పిదమని సరిపెట్టుకునే వ్యవహారం కాదు. భారీ చెల్లింపుల్లో కనీస తనిఖీలు కూడా చేయని అధికారుల పనితీరుపై తీవ్రమైన విమర్శలు…

Read More
Nvidia CEO Out

టెక్ ప్రపంచంలో సెక్స్ స్కాండల్స్ – రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన అనేకమంది సీఈఓలు!

సహనం వందే, హైదరాబాద్: కార్పొరేట్ రంగం అంటే అపరిమితమైన స్వేచ్ఛ, భారీ వేతనాలు, విలాసవంతమైన జీవనశైలి అని చాలా మంది భావిస్తుంటారు. అక్కడ ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ఉండొచ్చని, వ్యక్తిగత జీవితంలో ఏది చేసినా చెల్లుతుందని అనుకుంటారు. కానీ, ఆ రంగుల ప్రపంచం వెనుక అత్యంత కఠినమైన నియమ నిబంధనలు, ఉక్కు లాంటి క్రమశిక్షణ ఉంటాయి. స్వేచ్ఛను విచ్చలవిడితనంగా మార్చుకుని, కంపెనీ రూల్స్ బ్రేక్ చేసిన ఎంతటి దిగ్గజాలకైనా ఆ కుర్చీలో ఒక్క నిమిషం కూడా…

Read More