‘మహా’ డైవర్షన్ మెసేజ్- నేడు మహావీర్ మెడికల్ కాలేజీలో తనిఖీలు

సహనం వందే, హైదరాబాద్:మహావీర్ మెడికల్ కాలేజీ యాజమాన్యం తన తప్పులను సరిదిద్దుకోకుండా దిక్కుమాలిన వ్యవహారాలన్నీ చేస్తూ బుక్ అవుతుంది. గురువారం రాత్రి పదిన్నర గంటల సమయంలో ఫ్యాకల్టీ, డాక్టర్లు, ఇతర వాట్సాప్ గ్రూపులలో ఒక మెసేజ్ పెట్టారు. శుక్రవారం హెల్త్ యూనివర్సిటీ అధికారుల తనిఖీ ఉన్నందున ఉదయం ఏడున్నర గంటలకే బోధనాసుపత్రిలో అందుబాటులో ఉండాలని ఆ మెసేజ్ లో స్పష్టం చేశారు. అయితే ఇందులో ఏమైనా మతలబు ఉందా అన్న చర్చ కాలేజీ వర్గాలలో నెలకొంది. గత…

Read More

రద్దయినా మారని బుద్ధి – ‘మహావీర్’ యాజమాన్యం ధిక్కరణ ధోరణి

సహనం వందే, హైదరాబాద్:వికారాబాద్ లోని ‘మహావీర్’ మెడికల్ కాలేజీ బాగోతం అంతా ఇంతా కాదు. మూడేళ్ల క్రితం రాష్ట్రంలో మూడు మెడికల్ కాలేజీలలో మౌలిక సదుపాయాలు లేవని ఆ సంవత్సరం బ్యాచ్ లను జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ మూడు కాలేజీల్లో మహావీర్ మెడికల్ కాలేజీ కూడా ఉంది. అయినప్పటికీ ఆ కాలేజీ యాజమాన్యం మాత్రం తన వైఖరి మార్చుకోవడం లేదని బోధనాసుపత్రిని చూస్తే అర్థమవుతుంది. ఏం చేసుకుంటారో చేసుకోండన్న…

Read More

దిక్కులేని దీనులు… ‘మహా’ విద్యార్థులు – మహావీర్ మెడికల్ కాలేజీలో పరిస్థితి ఘోరం

వికారాబాద్ నుంచి ‘సహనం వందే’ ప్రతినిధి:వికారాబాద్ మహావీర్ మెడికల్ కాలేజీ అనుబంధ ఆసుపత్రిని పరిశీలిస్తే దీనికి ఇన్నాళ్లు ఎలా అనుమతులు వచ్చాయా అన్న అనుమానాలు తలెత్తుతాయి. జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) కళ్ళు మూసుకుని ముడుపులు పుచ్చుకొని బాజాప్తా అనుమతులు ఇచ్చినట్లు అర్థం అవుతుంది. ఈ స్టోరీని చదువుతున్న వాళ్ళు ఎవరైనా ఒక్కసారి అక్కడికి వెళ్లి చూడండి… లేదా ఈ ఆర్టికల్ తోపాటు పెడుతున్న వీడియోలను చూడండి. దానికి అనుమతులు ఇవ్వడం న్యాయమా లేదా మీరే నిర్ణయించండి….

Read More

మహావీర్ గుప్పిట్లో ఎన్ఎంసీ -లంచం తీసుకున్నందుకు కృతజ్ఞతాభావం

సహనం వందే, హైదరాబాద్:జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) దారి తప్పిపోయింది. లంచాల రుచికి మరిగిన ఎన్ఎంసీ బృందాలు ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ తమ తీరు మార్చుకోవడం లేదు. దేశంలో అనేక చోట్ల సీబీఐ కేసులు పెడుతూ కొందరిని అరెస్టు చేస్తున్నా… ఎన్ఎంసీ అధికారులు మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ముడుపులు తీసుకుని ముందే కమిట్మెంట్లు ఇవ్వడంతో మెడికల్ కాలేజీ యాజమాన్యాలతో చెట్టాపట్టాల్ వేసుకొని దర్జాగా తిరుగుతూనే ఉన్నాయి. అందుకు నిలువెత్తు ఉదాహరణ వికారాబాద్ లో ఉన్న మహావీర్…

Read More

నకిలీ రోగులతో ‘మహావీర్ంగం’ – మహావీర్ మెడికల్ కాలేజీకి కౌంట్ డౌ(ట్)న్

సహనం వందే, హైదరాబాద్: వికారాబాద్ మహావీర్ మెడికల్ కాలేజీ మాయలు ఒకటీ రెండు కావు. నకిలీ రోగులు… వారికి లేనిపోని రోగాలు అంటగట్టి కేస్ సీట్లు తయారు చేయటం… ఘోస్ట్ ఫ్యాకల్టీని సిద్ధం చేసుకోవడం… ఇలా ఆ కాలేజీ యాజమాన్యం రాత్రీ పగలు బిజీలో పడిపోయింది. ఈ నెలాఖరులోగా జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) తనిఖీలు ఉండటంతో సినిమా సెట్టింగులా కాలేజీని సిద్ధం చేస్తున్నారు. కొన్ని పరికరాలను బయట నుంచి తెప్పించి తాత్కాలిక ఏర్పాటు చేస్తున్నట్లు విశ్వసనీయ…

Read More

పదో తరగతిలో ఆవు మెదడు -ఉపాధ్యాయురాలు సస్పెండ్

సహనం వందే, వికారాబాద్: వికారాబాద్ జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయురాలు ఆవు మెదడు ను తీసుకొచ్చి తరగతి గదిలో ప్రదర్శించడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనతో విద్యార్థులు, హిందూ సంఘాలు, బీజేపీ నాయకుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవడంతో ఆ ఉపాధ్యాయురాలుని సస్పెండ్ చేశారు. తాండూరు నియోజకవర్గంలోని యలాల్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలికలు)లో ఈ ఘటన చోటుచేసుకుంది. సైన్స్ ఉపాధ్యాయురాలు ఖాసీమ్ బీ… 10వ తరగతి విద్యార్థులకు మానవ మెదడు…

Read More

మెడికల్ కౌన్సిల్ – నకిలీ వైద్యులపై కొరడా

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యులపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టి.ఎం.సి.) ఉక్కుపాదం మోపింది. హైదరాబాద్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో నిర్వహించిన తనిఖీల్లో సరైన వైద్య విద్యా అర్హతలు లేకుండా డాక్టర్లుగా చలామణి అవుతున్న 15 మంది నకిలీ వైద్యులపై కేసులు నమోదు చేసింది. నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలుగత నెలలో జరిగిన ఈ తనిఖీల అనంతరం ఈ కేసులు నమోదు చేసినట్లు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తెలియజేసింది. ఈ తనిఖీలను…

Read More

మహావీర్ మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ లీకులు

సహనం వందే, హైదరాబాద్: వికారాబాద్ లోని మహావీర్ ప్రైవేట్ మెడికల్ కాలేజీ రెండు రోజుల ప్రత్యేక డ్రామాకు తెరలేపింది. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) బృందాల తనిఖీలు గురు, శుక్రవారాల్లో జరుగుతాయని మేనేజ్మెంట్ కు సమాచారం అందింది. ఆకస్మికంగా జరగాల్సిన తనిఖీలు ముందస్తు లీకు కావడం గమనార్హం. దీంతో యాజమాన్యం మహా యాక్షన్ కు రంగం సిద్ధం చేసింది. ఎక్కడెక్కడో ఉన్న వివిధ విభాగాల అధిపతులు తక్షణమే కాలేజీకి చేరుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. వారంతా కేవలం…

Read More