
తెలంగాణ ఆయిల్ ఫెడ్ అక్రమాలపై కేంద్రం ఆగ్రహం
సహనం వందే, హైదరాబాద్:ఆయిల్ ఫెడ్ అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం వేసింది. నర్సరీలు, నాణ్యతలేని మొక్కలు తదితర అంశాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రంగంలోకి దిగారు. తెలంగాణలో జరుగుతున్న ఆయిల్ పామ్ మొక్కల అక్రమాలపై విచారణ చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్), భారతీయ ఆయిల్ పామ్ పరిశోధన సంస్థ (ఐఐఓపీఆర్)లకు చెందిన అధికారులు, శాస్త్రవేత్తల బృందం…