
బీపీ కొత్త లెక్కల షాకింగ్ – అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కొత్త గైడ్ లైన్స్
సహనం వందే, న్యూయార్క్:అధిక రక్తపోటును నియంత్రించడానికి కొత్త మార్గదర్శకాలను అమెరికన్ హార్ట్ అసోసియేషన్, అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ కలిసి శుక్రవారం విడుదల చేశాయి. 2017 తర్వాత వచ్చిన ఈ తాజా సూచనలు, రక్తపోటును అదుపులో ఉంచడం ద్వారా గుండె జబ్బులు, మూత్రపిండ వ్యాధులు, మధుమేహం, జ్ఞాపకశక్తి సమస్యలు వంటి వాటిని నివారించవచ్చని స్పష్టం చేస్తున్నాయి. ఈ కొత్త నియమాలు పాతవాటి కంటే చాలా కఠినంగా ఉండడమే కాకుండా, మద్యం వినియోగాన్ని పూర్తిగా మానేయాలని సిఫారసు చేస్తున్నాయి….