
కేసీఆర్ దోషి… హరీష్ పాత్రధారి – కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అంతులేని అవినీతి
సహనం వందే, హైదరాబాద్:కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో న్యాయ విచారణ జరిపిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాల మేరకు తదుపరి కార్యాచరణ ఉంటుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రాష్ట్ర మంత్రిమండలి యధాతథంగా ఆమోదించినట్టు తెలిపారు. జస్టిస్ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై ముఖ్యమంత్రి అధ్యక్షతన సోమవారం సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశం సమగ్రంగా చర్చించింది. అనంతరం రేవంత్ రెడ్డి…