
గురుశిష్యుల చెడుగుడు – కేసీఆర్, జగన్ లకు బాబు, రేవంత్ చుక్కలు
సహనం వందే, హైదరాబాద్/అమరావతి:తెలుగు రాష్ట్రాల రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. అధికార పార్టీలు ప్రతిపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీలు అవినీతి ఆరోపణలతో సతమతమవుతున్నాయి. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, మద్యం కుంభకోణం ఈ రెండు పార్టీల పతనానికి కారణమవుతున్నాయనే చర్చ జోరుగా సాగుతోంది. ఒకవైపు కేసీఆర్ కుటుంబం సీబీఐ విచారణల నీడలో చిక్కుకుంటే, మరోవైపు జగన్ చుట్టూ సిట్ విచారణల ఉచ్చు బిగుస్తోంది. ఈ కుంభకోణాల పర్వం తెలుగు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని ఆవిష్కరిస్తోంది….