
ఏ దారి ఎటు పోతుందో! – స్వదేశీ ‘మ్యాపుల్స్’ మహాద్భుతం!
సహనం వందే, హైదరాబాద్:గూగుల్ మ్యాప్‌కు గట్టి పోటీనిస్తూ మ్యాప్స్ మై ఇండియా సంస్థ రూపొందించిన ‘మ్యాపుల్స్’ యాప్ ఆకర్షిస్తుంది. మన రోడ్ల సంక్లిష్టతకు అనుగుణంగా తయారుచేసిన ఈ నావిగేషన్ యాప్ 3.5 కోట్ల డౌన్‌లోడ్లతో దూసుకుపోవడమే కాకుండా గోప్యత, భద్రతకు పెద్దపీట వేస్తుంది. ఇస్రో భాగస్వామ్యంతో ఉపగ్రహ చిత్రాల డేటాను ఉపయోగించుకోవడం ద్వారా మ్యాప్ ఖచ్చితత్వాన్ని అమాంతం పెంచింది. 13 అద్భుత ఫీచర్లు…ఇందులో 13 అద్భుత ఫీచర్లు ఉన్నాయి. ఫ్లైఓవర్లు, ఓవర్‌బ్రిడ్జిలు, అండర్‌పాస్‌ల వద్ద మూడు డైమెన్షనల్…