
అధికారుల తీరుతో అన్నదాత బలి – నాడు రుణమాఫీ… నేడు యూరియా
సహనం వందే, హైదరాబాద్:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ప్రభుత్వంలో ఏమైనా కుట్ర జరుగుతుందా? ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత రావడానికి వ్యవసాయశాఖలో ఎవరైనా కోవర్టులుగా పనిచేస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు కొందరు రాజకీయ పండితులు. అప్పట్లో రుణమాఫీ విషయంలోనూ… ఇప్పుడు యూరియా కొరతను సమర్థవంతంగా ఎదుర్కోవడంలోనూ యంత్రాంగ నిర్లక్ష్యమే నిదర్శనమని చెప్తున్నారు. ప్రభుత్వంలో ఉంటూ సర్కారును ఇరుకున పెట్టే విధంగా కొందరు వ్యవసాయ అధికారులు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వ పెద్దలతో కలిసి…