తులం తుస్… బంగారం మిస్ – ఎన్నికల హామీపై చేతులెత్తేసిన కాంగ్రెస్
సహనం వందే, హైదరాబాద్:రాష్ట్రంలో ఎంతో వాడీవేడిగా జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన తులం బంగారం ఇవ్వడం సాధ్యం కాదని ఆయన కామెంట్స్ చేయడంపై విమర్శలు వెలుగుతున్నాయి. దీంతో మహిళల తులం బంగారం ఆశ అడియాశగా మారింది. మహాలక్ష్మి పథకం పేరుతో కొత్తగా పెళ్లయిన వారికి పసిడి బహుమతి అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించినా ఆ హామీ ఇప్పుడు…