- సుతారియాతో హద్దులు లేని యష్ ముద్దులు
- సినిమా డిజాస్టర్ అయినా… రొమాన్స్ టాప్
- కేవలం పెద్దలు చూసే చిత్రంగానే టాక్సిక్
- దర్శకురాలు, హీరోకు మధ్య తీవ్ర వైరుధ్యాలు
సహనం వందే, హైదరాబాద్:
రాకింగ్ స్టార్ యష్ నటించిన తాజా సినిమా టాక్సిక్ బుధవారం థియేటర్లలో విడుదలైంది. గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఒక ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ లా రూపుదిద్దుకుంది. ఈ చిత్రంలో యాక్షన్‌తో పాటు రొమాన్స్ కూడా హైలైట్ కావడంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, తారా సుతారియా ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సినిమా పరంగా డిజాస్టర్ అయినప్పటికీ రొమాన్స్ మాత్రం బీభత్సంగా ఉందని ప్రేక్షకులు అంటున్నారు.
నడియా పాత్రలో కియారా మెరుపులు
ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నడియా అనే పాత్రలో అద్భుతంగా నటించింది. యష్ పాత్ర అయిన రాయాతో ఈమె పంచుకున్న రొమాంటిక్ సీన్లు సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. తబాహీ అనే పాటలో వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి థియేటర్లలో అభిమానులు ఫిదా అయిపోయారు. గ్లామరస్ లొకేషన్లలో వీరిద్దరూ కలిసి నటించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంది. సినిమాలో కియారా అద్వానీ చాలా కొత్త స్టైలిష్ లుక్‌లో కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంది.

రెబెక్కా పాత్రలో తారా సుతారియా
ఈ చిత్రంలో కియారా అద్వానీతో పాటు మరో ప్రముఖ నటి తారా సుతారియా కూడా కీలక పాత్రలో అదరగొట్టింది. ఈ చిత్రంలో తారా సుతారియా రెబెక్కా అనే పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా ఒకే బ్లాంకెట్‌లో ఇద్దరూ కలిసి ఉన్న సీన్ ఆడియెన్స్‌లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచేసింది. రొమాంటిక్ సీన్లలో చాలా బోల్డ్‌గా నటించినట్లు సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. యశ్ తారా చెంపలపై ముద్దు పెట్టుకోవడం, బాత్‌టబ్‌లో ఇద్దరూ కలిసి సమయం గడపడం వంటి విజువల్స్ సినిమాను మరింత రంజుగా మార్చాయి.
యష్, గీతు మోహన్ దాస్ మధ్య వైరుధ్యాలు
కేవలం శృంగారాన్ని నమ్ముకుని ఈ సినిమా ఉండటం విచారకరం. కేజీఎఫ్ తో ప్రపంచవ్యాప్తంగా అంచనాలు పెంచిన యష్, ఇప్పుడు గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో చేసిన ఈ భారీ చిత్రం ఏ రేంజ్ లో విఫలమైందో తెలుసా? సినిమా రంగంలో ఒక దర్శకుడు, ఒక హీరో పూర్తిగా భిన్నమైన ఆలోచనలతో ప్రయాణం చేస్తే ఫలితం ఎలా ఉంటుంది అనేదానికి టాక్సిక్ సినిమా సరిగ్గా సరిపోతుంది. ఈ ఇద్దరి ఆలోచనలు మధ్యలో కలవకపోవడం వల్ల తెరపై పెద్ద డిస్కనెక్ట్ కనిపిస్తుంది.
సహ రచయితగా యష్
యష్ స్వయంగా ఈ సినిమాకు సహ రచయితగా వ్యవహరించారు. ఆయన ఆలోచనలు చాలా గొప్పగానే ఉన్నప్పటికీ వాటిని తెరపైకి తీసుకురావడంలో తీవ్రమైన వైఫల్యం ఎదురైంది. కేజీఎఫ్ తరహా డైలాగులు, అదే డెలివరీ స్టైల్ ఈ గోవా బ్యాక్ డ్రాప్ గ్యాంగ్ స్టర్ ప్రపంచానికి అస్సలు సెట్ కాలేదు. అలాగే ఉజ్వల్ కులకర్ణి చేసిన ఎడిటింగ్ చెత్తగా ఉండటంతో సినిమా దెబ్బతింటుంది. దీనికి తోడు స్క్రీన్ పై రాయ పాత్రను పదే పదే ఎలివేట్ చేయడం ప్రేక్షకుడికి విసుగు తెప్పిస్తుంది.
ఐదు ప్రధానమైన మహిళా పాత్రలున్నా…
ఈ చిత్రంలో హ్యూమా ఖురేషి, రుక్మిణి వసంత్, నయనతారతో పాటు ఐదు ప్రధానమైన మహిళా పాత్రలు ఉన్నాయి. కానీ ఏ ఒక్క పాత్రకు కూడా కథలో తమ ప్రభావాన్ని చూపే అవకాశం వారికి దక్కలేదు. దర్శకురాలు గీతు మోహన్ దాస్ టేకింగ్ చాలా కృత్రిమంగా అనిపిస్తుంది. పాత్రలు కదలకుండా ఒకే చోట నిలబడి తమ సంభాషణలు చెప్పడం చూస్తే ఏదో నాటకం చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. చివరిగా చెప్పాలంటే దర్శకురాలి విజన్ కు, హీరో స్టార్ ఇమేజ్ కు మధ్య జరిగిన ఈ ఘర్షణలో సినిమానే బలైంది.