Amaravathi chattam

దేశ చరిత్రలో ‘అమరావతి’కే చట్టబద్ధత – ఇతర రాష్ట్ర రాజధానులకు లేని ప్రత్యేక చట్టం

సహనం వందే, అమరావతి: దేశ చరిత్రలో ఒక రాష్ట్ర రాజధాని కోసం పార్లమెంటులో ప్రత్యేకంగా చట్ట సవరణ చేయడం ఇదే మొదటిసారి. గతంలో ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు ఏర్పడినప్పుడు వాటి రాజధానుల విషయంలో ఇంతటి న్యాయపోరాటం లేదా రాజకీయ అనిశ్చితి లేదు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వివాదంతో అమరావతి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. అందుకే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సవరణ తెచ్చి అమరావతిని శాశ్వత రాజధానిగా ముద్ర వేసింది….

Read More
Araku Coffee

అప్పలనాయుడు ‘అరకు కాఫీ’ – లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఫిదా

సహనం వందే, న్యూఢిల్లీ: దేశ రాజధాని నడిబొడ్డున ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రాంతపు సువాసనలు విరబూస్తున్నాయి. విజయనగరం ఎంపీ అప్పలనాయుడు చొరవతో అరకు కాఫీ ఇప్పుడు జాతీయ స్థాయి గుర్తింపును సొంతం చేసుకుంది. రాజకీయ హడావుడి మధ్య లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా స్వయంగా ఈ కాఫీ రుచిని మెచ్చుకోవడం విశేషం. ఇది కేవలం ఒక పానీయం గురించి మాత్రమే కాకుండా ప్రాంతీయ బ్రాండ్ ఎదుగుదలను సూచిస్తోంది. స్పీకర్ ప్రశంసలుఢిల్లీ వేదికగా అరకు కాఫీకి అరుదైన గౌరవం…

Read More

న్యాయ పీఠంపై రాజమండ్రి శీతల్ తళుక్కు – 26 ఏళ్ల వయసులోనే సివిల్ జడ్జి (జూనియర్)

సహనం వందే, రాజమండ్రి: జీవితం అనేది ఒక నాటక రంగం.. అందులో ప్రతి ఒక్కరూ తమ పాత్రను పోషించాల్సిందే. కానీ కొందరు మాత్రమే తమ పాత్రతో చరిత్రను తిరగరాస్తారు. రాజమండ్రి అనే పురాతన నగరం సాక్షిగా ఒక యువతి తన కలల సౌధాన్ని నిర్మించుకుంది. ఒక సైనికుడి రక్తం, ఒక మేధావి మేధస్సు కలగలిసి.. న్యాయదేవత పాదాల చెంత కొలువుదీరిన వేళ. అది కేవలం ఒక విజయం కాదు… ధర్మం సాధించిన మహా విజయం. రక్తంలోనే దేశభక్తిరాజమండ్రికి…

Read More
Indian wedding system

మూడు ముళ్లు… ఆరు ‘ఉరితాళ్లు’ – ఇండియాలో ఏటా పెళ్లి ఖర్చు 10 లక్షల కోట్లు

సహనం వందే, హైదరాబాద్: భారతీయ వివాహం అంటే కేవలం రెండు మనసుల కలయిక మాత్రమే కాదు. అది లక్షల కోట్ల రూపాయల వ్యాపారం. కన్నకూతురిని అత్తారింటికి పంపే వేళ తండ్రి పడే తపన, చేసే అప్పులు ఒక జీవితకాలపు భారంలా మారుతున్నాయి. మేకప్ అద్దాల వెనుక దాగిన కన్నీళ్లు, మిరిమిట్లు గొలిపే బంగారు ఆభరణాల వెనుక ఉన్న ఆర్థిక సంక్షోభంపై ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సంస్థ జెఫరీస్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ సర్వే నివేదికలు…

Read More
Appalanaidu Speech on Amaravathi at Parliament

అమరావతికి అప్పలనాయుడు హారతి – లోక్‌సభలో విజయనగరం ఎంపీ కలిశెట్టి గళం

సహనం వందే, న్యూఢిల్లీ: మట్టికి మనిషికి మధ్య ఉండే బంధం రక్త సంబంధం కంటే పవిత్రమైనది. కన్నతల్లికి బిడ్డకు ఉండే పేగు బంధం లాంటిది రైతుకు తన నేలతో ఉండే అనుబంధం. కానీ ఆ మట్టినే నమ్ముకున్న రైతుల కన్నీరు గత పాలకుల పతనానికి పునాది అయింది. నేడు ఆ కన్నీటి చుక్కల నుంచి అమరావతి మళ్ళీ చిగురిస్తోంది. నవ్యాంధ్ర భవిష్యత్తు కోసం ప్రాణప్రదమైన భూమిని ధారపోసిన రైతుల గాథ ఇది. అమరవీరుల త్యాగాల పునాదిలోక్‌సభ సాక్షిగా…

Read More
AI Vs Techies

అడ్డమీది కూలీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి – టెక్నాలజీ రంగంలో ఉబర్ తరహా బానిసత్వం

సహనం వందే, హైదరాబాద్: సాంకేతిక విప్లవం ముసుగులో సామాన్యుడి కడుపు కొట్టేందుకు టెక్ ది’గ్గజ’ దొంగలు సిద్ధమయ్యారు. కంప్యూటర్ల మేధస్సు పెరిగితే మనిషికి విలువ పడిపోతుందా అన్న అనుమానం నిజమవుతోంది. ఏఐ వస్తోంది… అంతా మారిపోతుంది అంటూ భయపెడుతూ తెర వెనుక ఖర్చు తగ్గించుకునే నాటకానికి తెర లేపారు. ఇది సాంకేతికత తెచ్చిన వినాశనం కాదు.. కేవలం సాఫ్ట్‌వేర్ కార్పొరేట్ శక్తులు ఆడుతున్న ఒక తెలివైన జూదం. లాభాల కోసమే ఉద్యోగ కోతలుటెక్ దిగ్గజాలు గెనెరేటివ్ ఏఐ…

Read More
Baba Ashok Karat

బాబా వేషం.. మహిళా శోకం – నాసిక్ బాబా అశోక్ ఖరాత్ అరాచకాలు

సహనం వందే, నాసిక్: మనుషుల నమ్మకం ఒక అగాధమైతే అందులో దొంగ బాబా విసిరే వల ఒక విషాదం. కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు కనిపిస్తాడో లేదో తెలియదు కానీ దేవుడి పేరిట వేషగాళ్లు మాత్రం వేటగాళ్లలా తారసపడతారు. మూఢనమ్మకం కళ్లకు గంతలు కట్టినప్పుడు పవిత్రమైన మంత్రాల సాక్షిగా అపవిత్రమైన పాడు పనులు ఎలా జరుగుతాయో చెప్పే పచ్చి నిజమే ఈ కథనం. సూపర్ నేచురల్ శక్తుల మోసంతనకు అలౌకిక శక్తులు ఉన్నాయని అశోక్ ఖరాత్ ప్రచారం చేసుకున్నాడు….

Read More
Apple 50 Years

అందమైన రూపం… ‘టచ్’ చేస్తే స్వర్గం – యాపిల్ సంస్థకు ఏప్రిల్ 1తో 50 ఏళ్లు పూర్తి

సహనం వందే, హైదరాబాద్: జీవితంలో ఒక్కోసారి మనం అన్నీ కోల్పోయామని అనుకుంటాం. కానీ సరిగ్గా అప్పుడే ఒక చిన్న ఆలోచన మన రాతను మారుస్తుంది. యాపిల్ సంస్థ 50 ఏళ్ల పండుగ చేసుకుంటున్న వేళ ఒకప్పుడు ఆ సంస్థ చనిపోవడానికి కేవలం 90 రోజుల దూరంలో ఉందంటే ఎవరూ నమ్మలేరు. కానీ అది నిజం. స్టీవ్ జాబ్స్ అనే ఒక యోధుడు తిరిగి వచ్చి కేవలం ఒక తెల్ల కాగితం మీద గీసిన నాలుగు గీతలు ఒక…

Read More
Kalisetti celebrates 44years of TDP

సముద్రపు అలలపై కలిశెట్టి అడుగులు – రణస్థలం తీరాన పసుపు జెండా రెపరెపలు

సహనం వందే, రణస్థలం: గాలిలో తేలే పసుపు రంగు కేవలం ఒక పార్టీ గుర్తు మాత్రమే కాదు. అది వేల మంది గుండె చప్పుడు. రణస్థలం సముద్ర తీరాన అలల హోరులో ఆ పసుపు జెండా రెపరెపలాడుతుంటే చరిత్ర మళ్ళీ తలవొంచి నమస్కరించింది. మత్స్యకారుల కష్టాల్లోనూ, పేదల కన్నీళ్లలోనూ తోడున్న ఒక రాజకీయ ప్రస్థానం ఇది. గతాన్ని మరిచిపోని ఒక నాయకుడి ఆరాటం ఈ వేడుకలో కనిపించింది. పసుపు జెండా పండుగవిజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వినూత్నంగా…

Read More
Israel attacks on press

కెమెరా గుండెలో బుల్లెట్ గాయం – మీడియా వాహనంపై మృత్యు పంజరం

సహనం వందే, లెబనాన్: లోకం నిద్రపోతున్నప్పుడు ఎవరో ఒకరు మేల్కొని ఉండాలి. యుద్ధం జరుగుతున్నప్పుడు ఎవరో ఒకరు అక్కడ నిలబడాలి. వాళ్లే జర్నలిస్టులు. కెమెరా పట్టుకున్న చేతులు, నిజాన్ని మోసే భుజాలు ఈరోజు కుప్పకూలుతున్నాయి. ఇది కేవలం బాంబుల యుద్ధం కాదు… బయటకు రాకూడని నిజాలపై జరుగుతున్న దమనకాండ. అక్షరం సాక్షిగా జరుగుతున్న అన్యాయమిది. లెబనాన్ రక్తపు చారలు…యుద్ధ క్షేత్రంలో చావు ఎప్పుడూ వెంటే ఉంటుంది. కానీ కెమెరా పట్టుకున్న చేతులు, ప్రెస్ అని రాసి ఉన్న…

Read More