Ayodhya Ram Mandir

అవినీతి అయోధ్య… విరాళాల మాయ – రాముని పేరుతో వేల కోట్ల అక్రమాలు

సహనం వందే, అయోధ్య: అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం పేరుతో సేకరించిన వేల కోట్ల రూపాయల విరాళాలు గాలిలో కలిసిపోయాయి. భక్తుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని భారీ ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడంతో రామమందిర ఆర్థిక వ్యవహారాల్లోని చీకటి కోణాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అంతులేని అవినీతి ఆరోపణలురామమందిర నిర్మాణం, నిర్వహణలో భారీగా ఆర్థిక అవకతవకలు జరిగాయని దశాబ్దాలుగా విమర్శలు వస్తున్నాయి. రామమందిరం పేరుతో వసూలు…

Read More
News System

డబ్బు మైకం… మీడియా మౌనం – ప్రకటనల సంకెళ్లలో వార్తల కన్నీరు

సహనం వందే, హైదరాబాద్: ఉచిత వార్త అంటే అది ఉచితం కాదు. అది ప్రజలను ఒక వస్తువుగా మార్చేసే వ్యూహం. ప్రకటనల కోసం వార్తలను వండడం, కార్పొరేట్ లాభాల కోసం వాస్తవాలను తొక్కేయడం నేడు మీడియాలో సాధారణమైపోయింది. కానీ ప్రపంచంలో కొన్ని సంస్థలు ప్రకటనలకు స్వస్తి పలికి కేవలం ప్రజల చందాలతోనే నిలబడగలుగుతున్నాయి. వార్తలకు డబ్బులు చెల్లించడం అంటే మీ ప్రజాస్వామ్య హక్కును మీరు కాపాడుకోవడమే. ప్రకటనల మాయాజాలం ప్రమాదకర పరిణామంమీడియా సంస్థలు ప్రకటనలపైనే బతుకుతుంటే అవి…

Read More
Face Scan 101

సెల్ఫీలో ఆరోగ్య రహస్యం – ముఖంతోనే ఆరోగ్య పరీక్ష

సహనం వందే, హైదరాబాద్: ఇన్నాళ్లు మీ మొబైల్ కెమెరా కేవలం ఫోటోలు తీయడానికి మాత్రమే పనికొచ్చింది. కానీ ఇప్పుడు అదే కెమెరా మీ ప్రాణాలను కాపాడే డాక్టర్‌గా మారుతోంది. ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా మీ శరీర అంతర్గత స్థితిని అంచనా వేసే అద్భుత సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. ఇది వైద్య రంగంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది. సెల్ఫీలో దాగి ఉన్న వైద్యంరెడ్‌క్లిఫ్ ల్యాబ్స్ తాజాగా ఫేస్ స్కాన్ అనే సరికొత్త పరికరాన్ని మన…

Read More
Moulana Sajjad Nomani Comments

హిందువులంతా మైనారిటీలే – మెజారిటీ అనేది కేవలం భ్రమ

సహనం వందే, హైదరాబాద్: దేశంలో మెజారిటీ ఎవరంటే టక్కున వచ్చే సమాధానం హిందువులు. కానీ ఈ నమ్మకాన్ని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ సభ్యుడు మౌలానా సజ్జాద్ నోమానీ తన మాటలతో బద్దలు కొట్టారు. హిందువులు మెజారిటీ కాదు, వారు కూడా మైనారిటీలే అని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఆయన చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న లోతైన కోణాలను ఇప్పుడు చూద్దాం. రాజకీయ వ్యూహమా? సామాజిక వాస్తవమా?హిందూ మతం ఒక్కటి…

Read More
Aman's Cusor AI Coding

25 ఏళ్లు… 5 లక్షల కోట్ల డీల్ – కుర్రాడి కంపెనీని లక్షల కోట్లకు కొన్న మస్క్

సహనం వందే, హైదరాబాద్: సాంకేతిక ప్రపంచం ఇప్పుడు ఒక 25 ఏళ్ల యువ మేధావి వైపు ఆశ్చర్యంగా చూస్తోంది. ఎలాన్ మస్క్ సామ్రాజ్యం స్పేస్‌ఎక్స్ సంస్థ ఏకంగా 5 లక్షల కోట్ల రూపాయల భారీ డీల్‌తో ఒక భారతీయ మూలాలున్న యువకుడిని సొంతం చేసుకుంది. అమన్ సంగర్ సృష్టించిన కర్సర్ ప్లాట్‌ఫామ్ ఇప్పుడు అంతర్జాతీయ టెక్ దిగ్గజాల దృష్టిని ఆకర్షించి అసాధారణమైన రీతిలో టెక్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. స్పేస్‌ఎక్స్ భారీ ఒప్పందంటెక్ దిగ్గజం ఎలాన్ మస్క్…

Read More
NIA Chief Sundarraj

దేశ భద్రతకు ‘నక్సల్స్’ పాఠాలు – ఎన్ఐఏ చీఫ్ గా ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్

సహనం వందే, న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్ బస్తర్ అడవుల్లో మావోయిస్టుల సామ్రాజ్యాన్ని కూల్చివేసిన ఐపీఎస్ అధికారి సుందర్‌రాజ్ ని కేంద్రం తన అమ్ములపొదిలోకి తీసుకుంది. దశాబ్ద కాలంగా నక్సల్స్ పాలిట సింహస్వప్నంగా మారిన ఈ అధికారి ఇప్పుడు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏలో ఇన్ స్పెక్టర్ జనరల్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. మావోయిజం అణిచివేతలో ఆయన సాధించిన అరుదైన విజయాలే ఈ అత్యున్నత పదవికి ఆయనను అర్హుడిగా నిలబెట్టాయి. మావోయిస్టులకు పీడకలగాసుందర్‌రాజ్ 2003 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. బస్తర్…

Read More
Punjab Outsourcing Benefits

ఔట్‌సోర్సింగ్ ఆర్తనాదం… పంజాబ్ ఆదర్శం – పీఎఫ్, పెన్షన్, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి భద్రత

సహనం వందే, హైదరాబాద్: ప్రభుత్వ వ్యవస్థలో ప్రాణం పోస్తున్న అదృశ్య శక్తి ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులే. దశాబ్దాలుగా సేవలందిస్తున్నా వారికి గుర్తింపు లేదు. కనీస భద్రత లేని జీవితాలతో వారు సతమతమవుతున్నారు. పంజాబ్ మోడల్ ఒక వైపు ఆశను చిగురింపజేస్తుంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లో అమలవుతున్న వివక్ష మరోవైపు వారిని నిరాశలోకి నెడుతోంది. అసలు ఈ వ్యవస్థలో దాగున్న నిజాలేమిటో ఇప్పుడు చూద్దాం. ఆశలు రేపుతున్న పంజాబ్ బాటదేశవ్యాప్తంగా ఇప్పుడు పంజాబ్ మోడల్ పైనే చర్చ నడుస్తోంది….

Read More
TVs Vs Mobile

సోషల్ మీడియాకు కిరీటం – ప్రపంచంలో టీవీలు బంద్… మొబైల్స్ ఆన్….

సహనం వందే, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా సమాచార విప్లవం ముంచెత్తుతున్న వేళ అసలు వార్తలపై జనాల్లో నమ్మకం పూర్తిగా సన్నగిల్లుతోంది. నిత్యం మనం చూసే, చదివే వార్తల వెనుక నిజమెంత అనే ప్రశ్న అందరినీ వేధిస్తోంది. అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ తాజా పరిశోధనలో తేలిన చేదు నిజం ఇదే. మీడియా చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా వార్తా రంగం తీవ్ర విశ్వసనీయత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పాత మీడియాకు పెద్ద దెబ్బప్రపంచవ్యాప్తంగా ప్రధాన వార్తా సంస్థలపై ప్రజా నమ్మకం…

Read More
North Vs South - Annamalai

ఉత్తరాది వలసలపై అన్నామలై సలసల – తమిళనాడులో ఉత్తరాది వర్సెస్ దక్షిణాది

సహనం వందే, తమిళనాడు: తమిళనాడు రాజకీయాల్లో ఎవరూ ఊహించని సరికొత్త సంచలనం మొదలైంది. నిన్నటివరకు ద్రవిడ పార్టీల ఉత్తరాది వ్యతిరేకతను తప్పుపట్టిన బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై.. ఇప్పుడు అదే ఉత్తరాది వలస కూలీల నేరాలపై తిరుగుబావుటా ఎగురవేస్తూ సరికొత్త పొలిటికల్ యుద్ధం ప్రకటించారు. ఉత్తరాదిపై అన్నామలై సరికొత్త పోరుతమిళనాడులో ప్రాంతీయ అస్తిత్వం, భాషా సెంటిమెంట్ల చుట్టూనే ఎప్పుడూ రాజకీయం తిరుగుతుంది. అయితే భారతీయ జనతా పార్టీని వీడిన తర్వాత కె.అన్నామలై పాత రాజకీయ మూసను పూర్తిగా…

Read More
GenZ Income Earning Thoughts

రాత్రికి రాత్రే రాజయోగం…! – కష్టపడినా దక్కని రూపాయి

సహనం వందే, హైదరాబాద్: కష్టపడి పనిచేసినా చేతిలో చిల్లిగవ్వ మిగలని ప్రస్తుత ఆర్థిక వ్యవస్థపై నేటి తరం తీవ్ర అసంతృప్తితో ఉంది. సమాజంలో అంతా రిగ్గింగ్ జరిగిందని భావిస్తున్న యువత తమ కలలను నిజం చేసుకోవడానికి ఇప్పుడు కొత్త దారులను వెతుకుతోంది. ఈ వ్యవస్థాగత వైఫల్యం సృష్టిస్తున్న సామాజిక సంక్షోభంపై ప్రత్యేక విశ్లేషణ. మారిన ఆర్థిక ఆలోచనలుఈ రోజుల్లో రూపాయి సంపాదించడం ఎంతో కష్టంగా మారింది. పొద్దున లేస్తే రాత్రి దాకా గొడ్డు చాకిరీ చేసినా నెల…

Read More