‘బాషా’గా సమంత – ‘మా ఇంటి బంగారం’లో ఊచకోత

Samantha Maa Inti Bangaram
  • యాక్షన్ అవతార్‌లో కొత్త సమంత
  • నిర్మాతల బాధ్యతలోనూ స్టార్ నటి
  • రజినీకాంత్ బాషా తరహా థ్రిల్లింగ్ కథనం
  • నందినీరెడ్డి సమంత కాంబినేషన్
  • మూడోసారి వెండితెర సందడి

సహనం వందే, హైదరాబాద్:

గతంలో ఎన్నడూ చూడని యాక్షన్ అవతార్‌తో సమంత మరోసారి వెండితెరపై సంచలనం సృష్టించేందుకు సిద్ధమయ్యారు. నందినీరెడ్డి దర్శకత్వంలో వస్తున్న మా ఇంటి బంగారం చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కేవలం నటిగానే కాకుండా నిర్మాతగా కూడా సమంత ఈ ప్రాజెక్టును తన భుజాలపై వేసుకుని ముందుకు సాగుతున్నారు. కుటుంబం కోసం ఆమె చేసే పోరాటమే ఈ సినిమా అసలు సారాంశం.

నందినీరెడ్డి సమంత కాంబినేషన్
ఒకటి రెండు కాదు ఏకంగా మూడోసారి నందినీరెడ్డి సమంత కాంబినేషన్ అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈసారి సమంత కనిపించేది మునుపెన్నడూ చూడని యాక్షన్ అవతార్‌లో. సాధారణంగా మనం చూసే కోడలి పాత్రలకు ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది. ఆమె పాత్ర చాలా కాంప్లెక్స్‌గా పవర్‌ఫుల్‌గా ఉండబోతోంది. బయట ప్రపంచానికి ఆమె ఒకలా కనిపిస్తూనే లోపల తనదైన గతాన్ని తనకంటూ ఒక రక్షణ కవచాన్ని దాచుకున్న పాత్రలో కనిపిస్తారు.

Samantha Maa Inti Bangaram

బాషా తరహా ఫార్మాట్
ఈ పాత్రకు నందినీరెడ్డి బాషా ఫార్మాట్‌ను తీసుకున్నారు. గతంలో హీరోయిన్లకు ఇలాంటి యాక్షన్ షేడ్స్ చాలా తక్కువ. తన కుటుంబానికి తెలియకుండానే గతాన్ని మోస్తూ వారు ఏ ప్రమాదంలో పడకుండా తన శత్రువులను ఎలా ఎదుర్కోబోతోంది అనేదే సమంత పాత్రలోని అసలు థ్రిల్. ఈ పాత్రలో పశ్చాత్తాపం ఉంటుంది. భయం ఉంటుంది. అదే సమయంలో కఠినమైన యాక్షన్ కూడా ఉంటుంది. కుటుంబం పట్ల ఆమెకు ఉన్న ప్రేమను శత్రువుల పట్ల చూపే తెగింపును సమంత చాలా సహజంగా పండించారు.

యాక్షన్ సీక్వెన్స్‌లో సమంత
ఈ సినిమా కోసం సమంత ఏకంగా ఐదారు భారీ యాక్షన్ సీక్వెన్స్‌లలో నటించారు. ఇది ఆమె కెరీర్‌లోనే ఒక కొత్త మైలురాయి కానుంది. కెమెరా ముందు సమంత యాక్షన్ చూస్తుంటే ఆమె ఎంత కష్టపడ్డారో ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. ఆమె కికాస్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులకి విజువల్ ట్రీట్ ఇవ్వడం ఖాయం. ప్రతి సన్నివేశాన్ని ప్రతి యాక్షన్ బిట్‌ను ఆమె ఎంతో జాగ్రత్తగా పరిశీలించారు.

నిర్మాతగా సమంత బాధ్యత
సమంత ఈ సినిమాకి కేవలం నటి మాత్రమే కాదు నిర్మాత కూడా. సినిమా ఎడిటింగ్ టేబుల్ వద్ద కూడా సమంత స్వయంగా కూర్చుని తన పాత్ర ఎలా వస్తుందో ఆడియన్స్‌కి ఆ ఎమోషన్ ఎలా కనెక్ట్ అవుతుందో అని ప్రతి విషయంలోనూ ఇన్వాల్వ్ అయ్యారు. ఇలా ఒక నటిగా నిర్మాతగా ఆమె పడ్డ కష్టం ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లేలా ఉంది. ప్రతి ఫ్రేమ్‌లోనూ ఆమె ముద్రలు స్పష్టంగా కనిపిస్తాయని చిత్ర బృందం చెబుతోంది.

1980ల నాటి నేపథ్యం
సమంత పాత్రను 1980ల కాలం నాటి నేపథ్యంలో తీర్చిదిద్దడం వల్ల ఆమె బాడీ లాంగ్వేజ్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. అప్పటి కాలానికి తగ్గట్టుగా అదే సమయంలో తన క్యారెక్టర్‌లో ఉండే వైలెన్స్‌ని బ్యాలెన్స్ చేస్తూ ఆమె పోషించిన పాత్ర సినిమాకు ప్రాణంగా నిలవనుంది. ముఖ్యంగా మా ఇంటి బంగారం పేరుకు తగ్గట్టుగానే ఆ ఇంటిని కాపాడుకునే బంగారం లాంటి ఆ క్యారెక్టర్ చివరకు ఎలాంటి ముగింపును అందుకుంటుంది అనేది ఉత్కంఠను రేపుతోంది.

బాక్సాఫీస్ వద్ద రికార్డులు
నందిని రెడ్డి రాసుకున్న ఈ స్టోరీకి సమంత పెర్ఫార్మెన్స్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు మోత మోగడం ఖాయం అంటున్నారు. సినిమా అంటేనే పాత్రల ప్రయాణం. ఆ ప్రయాణంలో సమంత లాంటి నటి ఇలాంటి పవర్ ఫుల్ పాత్రను ఎంచుకోవడం నిజంగానే ఆసక్తికరం. ఆ బాషా తరహా గతం ఈమె చేస్తున్న యాక్షన్ మొత్తం మీద సమంత మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *