బాంబే ఐఐటీలో కులోన్మాదకాండ – ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి

IIT Bombay Student Suicide
  • రగిలిపోతున్న విద్యార్థి లోకం
  • న్యాయం చేయాలని డిమాండ్లు
  • డీన్ పై వేటు వేసిన యంత్రాంగం

సహనం వందే, ముంబై:

దేశంలోనే అత్యున్నత విద్యాసంస్థగా పేరొందిన ఐఐటీ బొంబాయిలో అసలేం జరుగుతోంది? ఒక విద్యార్థి విషాదాంతం ఐఐటీ క్యాంపస్‌ను ఎందుకు రణరంగంగా మార్చింది? పరీక్షలో కాపీ కొట్టాడనే ఆరోపణల నుంచి మొదలైన ఈ కథ, ఇప్పుడు కుల వివక్ష ఆరోపణలు, ప్రొఫెసర్లపై ఎఫ్ఐఆర్ వరకు ఎలా వెళ్లింది? కాపీ కొట్టడాన్ని సమర్థిస్తూ విద్యార్థులు రోడ్డెక్కారా లేక దీని వెనుక పెద్ద వ్యవస్థాగత లోపాలు ఉన్నాయా? అసలు ఈ వివాదంలో నిజానిజాలు ఏమిటో ఈ స్టోరీలో చూద్దాం.

కాపీ కొట్టాడని దుర్మార్గ చర్య…
ఈ నెల 18న ఐఐటీ బొంబాయిలో చదువుతున్న ద్వితీయ సంవత్సరం విద్యార్థి సాహిల్ వాకోడే ఆత్మహత్య చేసుకోవడంతో ఈ వివాదం మొదలైంది. పరీక్ష జరుగుతున్న సమయంలో సాహిల్ తన మొబైల్ ఫోన్ వాడాడని, ప్రశ్నపత్రాన్ని చాట్ జీపీటీకి అప్‌లోడ్ చేసి జవాబులు వెతికాడని యాజమాన్యం ప్రాథమికంగా చెప్పింది. ఆ తర్వాత అతనికి కౌన్సిలింగ్ ఇచ్చామని, ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదని కూడా పేర్కొంది. అయితే పరీక్ష హాల్ నుంచి సాహిల్‌ను బయటకు పంపేసిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఆ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే సాహిల్ తన గదిలో ప్రాణాలు తీసుకోవడం పెద్ద కలకలం రేపింది.

మూడు రోజుల వరుస నిరసనలు…
సాహిల్ మరణం తర్వాత క్యాంపస్‌లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. విద్యార్థులు మూడు రోజుల పాటు వరుస నిరసనలకు దిగారు. యాజమాన్యం వ్యవహరించిన తీరుపై, మానసిక ఒత్తిడిని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారనే కోణంలో విద్యార్థులు ప్రశ్నించడం మొదలుపెట్టారు. క్యాంపస్‌లో సరైన మెంటల్ హెల్త్ సపోర్ట్, కౌన్సెలింగ్ వ్యవస్థ లేకపోవడమే ఇటువంటి ఘోరాలకు కారణమని విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి.

వ్యవస్థాగత లోపాలే కారణం…
ఈ నిరసనలపై బయట రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. కాపీ కొట్టిన విద్యార్థిని వెనకేసుకొస్తూ నిరసనలు చేస్తున్నారని సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఐఐటీ బొంబాయి విద్యార్థి ప్రతినిధులు ఒక సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. తాము కాపీ కొట్టడాన్ని లేదా ఏ విధమైన అకడమిక్ మోసాన్ని అస్సలు సమర్థించడం లేదని స్పష్టంగా చెప్పారు. తమ పోరాటం చీటింగ్ గురించి కాదని, సాహిల్ మరణం, క్యాంపస్‌లో ఉన్న వ్యవస్థాగత సమస్యలు, విద్యార్థుల రక్షణ గురించేనని తేల్చిచెప్పారు.

బొంబాయి డైరెక్టర్ శిరీష్ కేదారేకు విన్నపం…
విద్యార్థులు తమ డిమాండ్లతో కూడిన 18 అంశాల నివేదికను ఐఐటీ బొంబాయి డైరెక్టర్ శిరీష్ కేదారేకు సమర్పించారు. ఇందులో క్యాంపస్‌లో జవాబుదారీతనం పెంచడం, విద్యార్థులకు సరైన ప్రాతినిధ్యం కల్పించడం, మెడికల్, మెంటల్ హెల్త్ సపోర్ట్ పెంచడం వంటి కీలక అంశాలు ఉన్నాయి. విద్యార్థుల ఒత్తిడిని పర్యవేక్షించేందుకు ఒక స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ డిమాండ్లను డైరెక్టర్ స్వయంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తామని సంతకం చేసి అంగీకరించారని విద్యార్థులు తెలిపారు.

డీన్ పై చర్యలు…
ఈ కేసులో ప్రధానంగా నలుగుతున్న పేరు డీన్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్ ప్రొఫెసర్ సూర్యనారాయణ. సాహిల్ పరీక్ష రాస్తున్న సమయంలో ఆయనే ఇన్విజిలేటర్‌గా ఉన్నారు. విచారణ పూర్తయ్యే వరకు ఆయన్ను అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతల నుంచి తప్పించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. విద్యార్థుల ఒత్తిడికి తలొగ్గిన ఐఐటీ యాజమాన్యం సూర్యనారాయణను డీన్ పదవి నుంచి తక్షణమే తొలగించింది. అయితే విచారణ సాగుతున్నంత కాలం ఆయన ప్రొఫెసర్‌గా మాత్రమే కొనసాగుతారని యాజమాన్యం స్పష్టం చేసింది.

కుల వివక్ష…
ఈ ఘటనకు మరో సున్నితమైన కోణం కూడా తోడైంది. సాహిల్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో ఇది తీవ్ర రూపం దాల్చింది. క్యాంపస్‌లో సాహిల్ కుల వివక్షను ఎదుర్కొన్నాడని, తీవ్ర వేధింపులకు గురయ్యాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తండ్రి ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు ప్రొఫెసర్ దూళ్లాపై ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా విచారణను ముంబై క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు.

ఐఐటీ యాజమాన్యం ఖండన…
ఐఐటీ యాజమాన్యం ఈ కుల వివక్ష ఆరోపణలను ఖండించే ప్రయత్నం చేసింది. సాహిల్ తమ ఎస్సీ, ఎస్టీ సెల్‌కు గానీ, అడ్మినిస్ట్రేషన్‌కు గానీ ఎలాంటి ఫిర్యాదు చేయలేదని ఐఐటీ తెలిపింది. అదే సమయంలో మొదట విడుదల చేసిన ప్రకటనలో కొన్ని తప్పులు ఉన్నాయని ఒప్పుకుంటూ ఐఐటీ క్షమాపణలు చెప్పింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా విచారణ దశలోనే ఉన్నాయని, ఏ విషయమూ తేలకముందే నిర్ధారణకు రాకూడదని ఐఐటీ స్పష్టం చేస…

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *